
పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్ పెళ్లి ఘనంగా జరిగింది.

మాధవి, కోటపాటి సీతారామరావు పుత్రిక అక్షతతో అభినయ్ ఏడడుగులు వేశాడు.

బుధవారం (డిసెంబర్ 25) రాత్రి 12.37 నిమిషాలకు హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.

ఈ పెళ్లికి రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, నటులు వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్ సహా తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.



























