హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికపై టీడీపీ నేతలు గురువారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. తీర్మానం పత్రిని వారు ఈ సందర్భంగా గవర్నర్కు అందచేశారు. అనంతరం టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాల్సిదిగా గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఈనెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్కు తెలిపామన్నారు. ప్రమాణ స్వీకారం వివరాలు పంపాలని గవర్నర్ కోరారన్నారు. కాగా గవర్నర్ను కలిసినవారిలో ధూళిపాళ్ల నరేంద్ర, కేఈ కృష్ణమూర్తి, మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు.