హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. జపాన్ పర్యటన వివరాలను ఈ సందర్భంగా గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు.
అలాగే జపాన్ పర్యటన అనంతరం న్యూఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన అంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు గవర్నర్‌పై తన కేబినెట్లోని మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వివాదం సద్దుమణిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చింది.