
‘ఎర్రబెల్లి’ నోరు అదుపులో పెట్టుకో..
కాజీపేట రూరల్ : టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్‌యాదవ్ సూచించారు. హన్మకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌యూదవ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీఎల్‌పీ నేత దయూకర్‌రావు అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తే సహించేదిలేదని ఆయన దయూకర్‌రావును హెచ్చరించారు.
డబ్బు కట్టలతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని టీడీపీ నాయకులు వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. ఏపీలో మంత్రి పీతల సుజాత ఇంట్లో దొరికిన డబ్బుకట్టల వ్యవహరంపై కూడా టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి ప్రకాష్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్, పార్టీ అధికార ప్రతినిధి షంషీర్‌బేగ్, సిటీ మైనార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్‌ఖాన్, జిల్లా నాయకులు కంజుల రాజు, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.