
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ తమ సభ్యుల పనితీరుపై తనకు తానే రేటింగ్స్, ర్యాంకింగ్స్ ఇవ్వడం నంది అవార్డులను తలపించింది. ప్రతిపక్షం లేకున్నా శాసనసభ ఘనంగా జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడానికి టీడీఎల్పీ స్వయంగా రంగంలోకి దిగింది. 11 రోజుల్లో ఏకంగా ఎనిమిది రోజులు చంద్రబాబు ఉత్తమ ప్రదర్శనకు ఎంపికయినట్టుగా ప్రకటించింది. ఇక మంత్రి నారా లోకేష్ రెండు రోజులు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు ఒక్కో రోజు ర్యాంకింగ్‌లు దక్కించుకున్నారు. శాఖల విషయానికి వస్తే దేవినేని ఉమ, ఆదినారాయణరెడ్డి, అచ్చెన్నాయుడు అద్భుతమని టీడీఎల్పీ ప్రకటించింది. ఈ మేరకు టీడీఎల్పీ శుక్రవారం చంద్రబాబుకు ఈ నివేదిక సమర్పించింది.