హైదరాబాద్ : కాల్ మనీ కేసులో తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయినా అధికారం అడ్డం పెట్టుకుని, ప్రతిపక్షంపై ఎదురుదాడికి టీడీపీ సిద్ధం అవుతోంది. గురువారమిక్కడ సమావేశమైన టీడీఎల్పీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఆరోపణలు ఉన్న నేతలకు అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు పలువురు టీడీపీ పెద్దలు ధైర్యం నూరిపోసినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని, భయపడవద్దంటూ సూచించినట్లు సమాచారం.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఎదురుదాడికి దిగాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అలాగే సభలో అంబేద్కర్పై చర్చ తర్వాతే ఇతర అంశాలను చేపట్టనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీ వివరాలను మీడియాకు లీక్ చేయొద్దని ఈ సందర్భంగా హెచ్చరించారు. మీడియాతో జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు.
ఎదురుదాడికి రంగం సిద్ధం!
Published Thu, Dec 17 2015 5:57 PM | Last Updated on Sat, Aug 11 2018 4:22 PM
Advertisement
Advertisement