సాక్షి, హైదరాబాద్: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం రాత్రి 7గంటలకు టీడీఎల్పీ సమావేశం జరగనుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక కానున్నారు. పార్టీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, టీడీఎల్పీ సమావేశం హైదరాబాద్‌కు వెలుపల జరగడం ఇదే తొలిసారి.