ఎమ్మెల్సీ పోలింగ్కు ఆర్. కృష్ణయ్య దూరం!? | mla r. krishnaiah far away from legislative meeting | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ పోలింగ్కు ఆర్. కృష్ణయ్య దూరం!?

Published Mon, Jun 1 2015 10:42 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

ఎమ్మెల్సీ పోలింగ్కు ఆర్. కృష్ణయ్య దూరం!? - Sakshi

ఎమ్మెల్సీ పోలింగ్కు ఆర్. కృష్ణయ్య దూరం!?

హైదరాబాద్: ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పార్టీ విప్ ధిక్కరించారా? ఎమ్మెల్సీ పోలింగ్కు దూరంగా ఉండబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటికే ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోయిన టీడీపీకి మరో శరాఘాతమే అవుతుంది.

సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీలో కమిటీ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతితో ఓటు వేసేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. అయితే బీసీ ఉద్యమనాయకుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన ఓటింగ్లో కూడా పాల్గొనబోరనే వార్తలు వినవస్తున్నాయి.

ఎమ్మెల్యే కృష్ణయ్య మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునే క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలందరికీ టీడీపీ విప్ జారీచేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement