సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) సమావేశం జూన్ నాలుగో తేదీన తిరుపతిలో జరగనుంది. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని సెనేట్‌హాల్ లేదా ఆడిటోరియంలో సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు.