
అసెంబ్లీ లాబీలో నటుడు వేణుమాధవ్
హైదరాబాద్ : హాస్యనటుడు వేణుమాధవ్ బుధవారం అసెంబ్లీ లాబీలో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన్ని విలేకర్లు పలకరించగా గతంలో తాను టీడీఎల్పీలో ఉద్యోగిగా పని చేశానని... ప్రస్తుతం షూటింగ్ లేకపోవటంతో నేతలను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలను వేణుమాధవ్ కలిశాడు.
కాగా వేణు మాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. ఓ సందర్భంలో అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావు టాకింగ్ డాల్‌లో ప్రోగ్రామ్ చేసిన అతడిని భువనగిరిలో తెలుగుదేశం పార్టీ మీటింగ్‌కి తీసుకెళ్లారు. అలా ఎన్టీఆర్ మహానాడులో వేణుమాధవ్ ప్రదర్శన ఇవ్వటం జరిగింది. అది ఎన్టీఆర్కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్ను హిమాయత్‌నగర్ తెలుగు దేశం పార్టీ ఆఫీసులో చేర్చుకున్నారు. అక్కణ్ణుంచీ అసెంబ్లీలోని టీడీపీ లెజిస్లేటివ్ కార్యాలయంలో చేర్చారు.