టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి | Errabelli Dayakar rao elected as t-tdlp leader | Sakshi
Sakshi News home page

టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి

Published Sat, Jun 7 2014 11:51 AM | Last Updated on Fri, Aug 10 2018 7:50 PM

టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి - Sakshi

టీ-టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి

తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. అలాగే, శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస యాదవ్ను ఎంపిక చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నాయకుల ఎంపిక ప్రక్రియను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్లయింది.

ఇక అసెంబ్లీలోడిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్. కృష్ణయ్యలను ఎంపిక చేశారు. శాసన మండలిలో టీడీపీ పక్ష నాయకుడిగా అరికెల నర్సారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో విప్గా సండ్ర వెంకట వీరయ్యను నియమించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను మాత్రం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థాయితోనే చంద్రబాబు సరిపెట్టేశారు. ముందునుంచి తెలంగాణ టీడీపీ ఫోరం ఛైర్మన్గా వ్యవహరించిన ఎర్రబెల్లికే టీ-టీడీఎల్పీ పీఠాన్ని కట్టబెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement