హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై చర్చ చేపడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో బాక్సైట్, ఇసుక, జలవిధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. అయితే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 వరకే జరుగుతాయని చెప్పారు.
ఈ సమావేశాల్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు యోగా శిక్షణ ఇవ్వటం లేదని యనమల స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే రామ్‌దేవ్ బాబా యోగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వ్యాట్, ఎక్సైజ్, మనీలాండరింగ్ బిల్లులు ప్రవేశపెడతామని యనమల రామకృష్ణుడు తెలిపారు.
'ఏపీ ఎమ్మెల్యేలకు రాందేవ్ బాబా శిక్షణ'
Published Thu, Dec 17 2015 11:14 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement