Assembly Committee Hall
-
మహిళా సంక్షేమమే మా లక్ష్యం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: మహిళల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో మహిళా ఆర్గనైజర్లు, మహిళా, శిశు సంక్షేమాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు కష్టపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తోందని, వచ్చే ఉగాదికల్లా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. నీళ్లు ఇవ్వకుంటే ఓటు అడగబోమని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో పనిచేసిన వారిని మహిళా సంక్షేమ పథకాల పరిశీలన కోసం ఆర్గనైజర్లుగా నియమించినట్లు తెలిపారు. -
మూడేళ్లుగా ఒక్క ఇటుకా పెట్టలేదు..
అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజెంటేషన్‌పై జగన్ వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: మూడేళ్లుగా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, అమరావతి నగర నిర్మాణమంటూ ఎవరిని మోసం చేస్తారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ ప్రజల్ని మోసం చేయడానికేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో అమరావతి నగర నిర్మాణ ప్రణాళికపై నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్లాన్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు విపక్ష నేత జగన్ హాజరు కాలేదు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జగన్ మాట్లాడుతూ... ఈ ప్రజంటేషన్‌కు హాజరు కాకపోవడమే మేలని, సభా సమయం మరో గంట పాటు వృ«థా తప్ప మరొకటి కాదన్నారు. ప్రజా సమస్యలు చర్చించకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకు అని ప్రశ్నించారు. -
'4న ఏపీ ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, ఇతర అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన సమావేశమైన ఈ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు, వైఎస్సార్సీపీ ఎమ్యెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి తదిదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన నివేదిక.. ప్రివిలేజ్ కమిటీకి అందిందనీ, నివేదిక కాపీలను మాకివ్వలేదని జ్యోతుల నెహ్రు అన్నారు. గతంలో ఇతర ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటిసులనే పరిశీలించామన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి రావడం లేదని చైర్మన్‌ను అడిగామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాట్లాడి అన్నిపార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల నోటీసులు.. ప్రివిలేజ్ కమిటీకి వచ్చేలా చేయాలని కోరామన్నారు. వచ్చే నెల 4న ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై ప్రివిలేజ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని జ్యోతుల నెహ్రు వెల్లడించారు. -
'ఏపీ ఎమ్మెల్యేలకు రాందేవ్ బాబా శిక్షణ'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై చర్చ చేపడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో బాక్సైట్, ఇసుక, జలవిధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. అయితే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 వరకే జరుగుతాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు యోగా శిక్షణ ఇవ్వటం లేదని యనమల స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే రామ్‌దేవ్ బాబా యోగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో వ్యాట్, ఎక్సైజ్, మనీలాండరింగ్ బిల్లులు ప్రవేశపెడతామని యనమల రామకృష్ణుడు తెలిపారు. -
అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ భేటీ
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం తెలంగాణ సీఎల్పీ భేటీ అయింది. దివంగత ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డికి తెలంగాణ సీఎల్పీ నివాళులర్పించింది. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై తెలంగాణ సీఎల్పీ చర్చిస్తుస్తోంది. అయితే కిష్టారెడ్డి మరణంతో నారాణయ్ఖేడ్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి పార్టీలను కాంగ్రెస్ కోరనున్నట్టు సమాచారం. -
అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్
హైదరాబాద్: శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకోసం జరుగుతున్న ఎన్నికలకు అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటో తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 5 గంటలకు మొదలవుతుందని ఆయన వెల్లడించారు. -
పీఏసీ అలంకారప్రాయం కావొద్దు
ప్రజా పద్దుల కమిటీ తొలి భేటీలో స్పీకర్ కోడెల హితవు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమా సాక్షి, హైదరాబాద్: ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) అలంకారప్రాయం కాకూడదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికట్టడంలో సమితి క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పీఏసీ తొలి సమావేశాన్ని కోడెల శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, పనుల్లో ఏైదె నా అవినీతి జరిగినట్లు కమిటీ పరిశీలనకు వస్తే ప్రభుత్వంతోపాటు అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కానీయొద్దు కమిటీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలన్నింటిలో పీఏసీ కీలకమైందన్నారు. ప్రజాధనం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రయత్నిద్దామన్నారు. అందుకు అందరి సహకారం కావాలన్నారు. అందరూ ఒక బృందంగా పనిచేద్దామన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గత పీఏసీలో కూడా తాను సభ్యుడినని, అపుడు నిర్వహించిన సమావేశాలకు అధికారులు సక్రమంగా హాజరయ్యేవారు కాదని, శాఖాపరమైన సమీక్షలు సక్రమంగా జరగాలంటే అధికారుల హాజరు తప్పనిసరని అన్నారు. శాసనసభ సచివాలయ ప్రభుత్వ అధికారులు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభ్యులందరం కలిసి పనిచేసి అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిద్దామన్నారు. కమిటీ ఆషామాషీగా కాకుండా గట్టిగా పని చేయాలన్నారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పీఏసీ స్థాయిని పెంచేందుకు సభ్యులందరం కలిసి ప్రయత్నిద్దామన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికడదామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణ మాట్లాడుతూ కమిటీ సమావేశానికి రెండు వారాల ముందు తమకు సమాచారం అందిస్తే అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కాకాణి గోవర్ధనరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, బీకే పార్థసారథి, పీవీజీఆర్ నాయుడు, ఎంవీఎస్ శర్మ, శమంతకమణి, రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.