
ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేను:చంద్రబాబు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కొరత చాలా ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేనని బాబు తేల్చి చెప్పేశారు. సోమవారం ఏపీ టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిధులు కొరతపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నందున.. తాను ఎమ్మెల్యేలకు కేటాయించాల్సిన నిధులను ఇవ్వలేనన్నారు. ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలుంటే తనను కలవాలని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
టీటీడీ లెటర్లు ఇష్టానుసారం ఇవ్వొద్దని.. దాని వల్ల ఇబ్బందులు పడతారని ఎమ్మెల్యేలకు బాబు సూచించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గం వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దన్నారు. ప్రతి కార్యాలయంలో సంక్షేమ పథకాల పోస్టర్లపై సీఎం ఫోటో ఉండేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.