
రూ.100 కోట్లు ఇస్తే.. వంద సంవత్సరాలు ఖాయం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధకరమని బాబు మరోసారి పేర్కొన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన ఏపీ టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు.
అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు ఇచ్చారని.. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతినివ్వాలని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అడిగితే.. కేంద్రం రూ.100 కోట్లు కేటాయించదన్నారు.ఆ మొత్తంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుందని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సంవత్సరం 30 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ వ్యవసాయంలో మంచి ప్రగతి సాధించమన్నారు. మిగులు జలాలను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామన్నారు.