ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.
ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-బుడిగెరె క్రాస్‌లోని గోద్రేజ్ వుడ్‌స్కేప్స్‌లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్‌ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.
బెంగళూరులో గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment