Godrej Properties
-
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-బుడిగెరె క్రాస్‌లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
రియల్టీ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజాలు ప్రాపరీ్టల అమ్మకాలలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్పీడందుకున్నాయి. 18 లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాయి. ఈ జాబితాలో గోద్రెజ్ ప్రాపరీ్టస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డీఎల్ఎఫ్, మాక్రోటెక్ డెవలపర్స్, సిగ్నేచర్ గ్లోబల్ తదితరాలు అగ్రపథంలో నిలిచాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 25,527 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్ సాధించి తొలి స్థానాన్ని పొందింది. అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే కొద్దిపాటి కంపెనీలను మినహాయిస్తే ప్రధాన సంస్థలన్నీ అమ్మకాల బుకింగ్స్‌లో జోరు చూపాయి. ఇందుకు ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పుట్టిన పటిష్ట డిమాండ్ కారణమైంది. ప్రధాన నగరాలలో ప్రత్యేకంగా విలాసవంత గృహాలకు భారీ డిమాండ్ కనిపించడం తోడ్పాటునిచి్చంది! శోభా, బ్రిగేడ్, పుర్వంకారా.. రియల్టీ రంగ లిస్టెడ్ దిగ్గజాలలో గతేడాది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 21,040 కోట్ల అమ్మకాల బుకింగ్స్‌తో రెండో ర్యాంకులో నిలిచింది. ఇక డీఎల్ఎఫ్ రూ. 14,778 కోట్లు, లోధా బ్రాండ్ మాక్రోటెక్ రూ. 14,520 కోట్లు, గురుగ్రామ్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 7,270 కోట్లు చొప్పున ప్రీసేల్స్ సాధించి తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఈ బాటలో బెంగళూరు సంస్థ శోభా లిమిటెడ్ రూ. 6,644 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 6,013 కోట్లు, పుర్వంకారా రూ. 5,914 కోట్లు, ముంబై కంపెనీ ఒబెరాయ్ రియల్టీ రూ. 4,007 కోట్లు, కోల్టే పాటిల్ రూ. 2,822 కోట్లు, మహీంద్రా లైఫ్సై్పస్ రూ. 2,328 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ. 2,266 కోట్లు, సన్‌టెక్ రియల్టీ రూ. 1,915 కోట్లు చొప్పున అమ్మకాల బుకింగ్స్ నమోదు చేశాయి. ఇదేవిధంగా ఏషియానా హౌసింగ్ రూ. 1,798 కోట్లు, అరవింద్ స్మార్ట్‌స్పేసెస్ రూ. 1,107 కోట్లు, అజ్మీరా రియల్టీ అండ్ ఇన్ఫ్రా రూ. 1,017 కోట్లు, ఎల్డెకో హౌసింగ్ రూ. 388 కోట్లు, ఇండియాబుల్స్ రియల్టీ రూ. 280 కోట్లు చొప్పున బుకింగ్స్ అందుకున్నాయి. అయితే ఒమాక్సే తదితర కొన్ని కంపెనీల వివరాలు వెల్లడికావలసి ఉంది. ఇతర దిగ్గజాలు.. ఇతర దిగ్గజాలలో టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రా, అదానీ రియలీ్ట, పిరమల్ రియల్టీ, హీరానందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ తదితరాలు నాన్‌లిస్టెడ్ కంపెనీలుకావడంతో త్రైమాసిక, వార్షిక బుకింగ్స్ వివరాలు వెల్లడించని సంగతి తెలిసిందే. కాగా.. కోవిడ్–19 తదుపరి సొంత ఇంటికి ప్రాధాన్యత పెరగడంతో హౌసింగ్ రంగం ఊపందుకున్నట్లు రియల్టీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పటిష్టస్థాయిలో ప్రాజెక్టులను పూర్తిచేసే కంపెనీల ప్రాపరీ్టలకు డిమాండు పెరిగినట్లు తెలియజేశారు. వెరసి బ్రాండెడ్ గృహాలవైపు కన్జూమర్ చూపుసారించడం లిస్టెడ్ కంపెనీలకు కలసి వస్తున్నట్లు తెలియజేశారు. గతంలో యూనిటెక్, జేపీ ఇన్ఫ్రాటెక్ తదితరాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికాకపోగా.. విఫలంకావడంతో గృహ కొనుగోలుదారులు ధర అధికమైనా రిస్‌్కలేని వెంచర్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.33 శాతం వృద్ధిబలమైన కన్జూమర్ డిమాండ్ నేపథ్యంలో గతేడాది దేశీ రియల్టీ రంగంలో రికార్డ్ ప్రీసేల్స్ నమోదయ్యాయి. ఆయా కంపెనీల సమాచారం ప్రకారం లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 1,16,635 కోట్ల సేల్స్ బుకింగ్స్‌ను సాధించాయి. 2022–23లో నమోదైన రూ. 88,000 కోట్ల బుకింగ్స్‌తో పోలిస్తే ఇది 33 శాతం అధికం. జాబితాలో శోభా, బ్రిగేడ్, పుర్వంకారా, ఒబెరాయ్ రియలీ్ట, మహీంద్రా లైఫ్‌స్పేస్, కోల్టేపాటిల్, సన్‌టెక్, కీస్టోన్ రియల్టర్స్ తదితరాలు చేరాయి. పటిష్ట బ్రాండ్ గుర్తింపు, డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పెట్టుబడుల సులభ సమీకరణ కారణంగా లిస్టెడ్ రియల్టీ కంపెనీలు ఆకర్షణీయ పనితీరు చూపగలుగుతున్నట్లు హౌసింగ్.కామ్, ప్రాప్‌టైగర్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనికితోడు ఆధునిక టెక్నాలజీలతో మార్కెటింగ్, అమ్మకాలు చేపట్టడం, మెరుగైన కస్టమర్ సరీ్వసులు తదితరాల ద్వారా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి నాన్‌లిస్టెడ్ లేదా చిన్న కంపెనీలకంటే పైచేయి సాధించగలుగుతున్నట్లు వివరించారు. -
గోద్రేజ్ ప్రాపర్టిస్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రాపర్టిస్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.125 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లతో పోల్చి చూసినప్పుడు మూడు రెట్లు వృద్ధి చెందింది. కొత్త బుకింగ్‌లు (ఇళ్లు/ఫ్లాట్లు) 11 శాతం తగ్గి జూన్ త్రైమాసికంలో రూ.2,254 కోట్లుగా ఉన్నాయి. బుకింగ్‌ల పరిమాణం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పడు 20 శాతం తగ్గి 2.25 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.426 కోట్ల నుంచి రూ1,266 కోట్లకు దూసుకుపోయింది. ఎన్సీడీలు, బాండ్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. జూన్ త్రైమాసికంలో 4.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో ఇళ్లను కస్టమర్లకు అందించింది. లక్ష్యం దిశగానే.. ‘‘బుకింగ్‌ల పరంగా ఇది స్తబ్దతతో కూడిన త్రైమాసికం. డెలివరీలు, వ్యాపార అభివృద్ధి, నగదు వసూళ్లు అన్నీ కూడా జూన్ క్వార్టర్లో మంచి వృద్ధిని చూశాయి. బలమైన కొత్త ప్రాజెక్టుల ఆరంభ ప్రణాళికలు, బలమైన బ్యాలన్స్ షీట్, చెక్కుచెదరని డిమాండ్ ఇవన్నీ కలసి 2023–24 సంవత్సరంలో రూ.14,000 కోట్ల బుకింగ్‌ల లక్ష్యాన్ని చేరుకునే దిశలోనే ఉన్నాం’’అని గోద్రేజ్ ప్రాపర్టిస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పిరోజ్షా గోద్రేజ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.12,232 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించడం గమనార్హం. జూన్‌లో నమోదైన తాజా బుకింగ్‌లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో రూ.656 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో రూ.548 కోట్లు, బెంగళూరు మార్కెట్లో రూ.509 కోట్లు, పుణె మార్కెట్లో రూ.446 కోట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు మార్కెట్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. జయశ్రీ వైద్యనాథన్‌ను అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. -
అదరగొట్టిన గోద్రెజ్ ప్రాపర్టీస్.. నికర లాభంలో 58% వృద్ధి
న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను అధిగమించింది. హౌసింగ్‌కు నెలకొన్న పటిష్ట డిమాండ్ ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 260 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,523 కోట్ల నుంచి రూ. 1,839 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు ఎన్సీడీలు, బాండ్లు తదితర మార్గాల ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 2,000 కోట్ల సమీకరించేందుకు అనుమతించింది. చేపడుతున్న ప్రాజెక్టులు, పటిష్ట బ్యాలన్స్‌షీట్, హౌసింగ్ రంగ వృద్ధి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లోనూ ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ పిరోజ్షా గోద్రెజ్ అభిప్రాయపడ్డారు. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 571 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 352 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,586 కోట్ల నుంచి రూ. 3,039 కోట్లకు బలపడింది. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 12,232 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ను సాధించింది. 2021–22లో నమోదైన రూ. 7,861 కోట్లతో పోలిస్తే ఇవి 56 శాతం అధికం. నగదు వసూళ్లు 41 శాతం ఎగసి రూ. 8,991 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపరీ్టస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం తగ్గి రూ. 1,323 వద్ద ముగిసింది. -
లెజెండ్రీ యాక్టర్ ఐకానిక్ బంగ్లా, గోద్రెజ్ ప్రాపర్టీస్ చేతికి: రణధీర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ముంబై బంగ్లాను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ముంబైలోని చెంబూర్‌లో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్ బంగ్లాను కొనుగోలు చేసినట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది. కపూర్ కుటుంబానికి చెందిన వారసులనుంచి చట్టబద్ధంగా ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ముంబైలోని చెంబూర్‌లోని డియోనార్ ఫామ్ రోడ్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రక్కనే ఈ బంగ్లా ఉంది. అయితే కొనుగోలు డీల్ విలువను వెల్లడించలేదు. ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌ను తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడం సంతోషంగా ఉందని,ఈ అవకాశం ఇచ్చిన కపూర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ గౌరవ్ పాండే. ఈ ప్రాజెక్ట్ చెంబూర్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనుందని పాండే చెప్పారు. గతకొన్నేళ్లుగా ప్రీమియం డెవలప్మెంట్లకు డిమాండ్ బలంగా ఉందన్నారు. ఈ ఐకానిక్ ప్రాపర్టీకి తమ కుటుంబానికీ మధ్య సంబంధం కేవలం భావోద్వేగమైంది మాత్రమే కాదు చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉందని రణధీర్‌కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. గోద్రెజ్ గ్రూప్‌లో భాగస్వామ్యంపై ఆయన సంతోషం ప్రకటించారు. 2019, మేలో ప్రీమియం మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఆర్కెఎస్ను అభివృద్ధి చేయడానికి కపూర్ కుటుంబం నుండి చెంబూర్‌లోని ఆర్కె స్టూడియోస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం డెలివరీ కానుందని అంచనా. ఆర్కే బంగ్లా లేదా కృష్ణరాజ్ బంగ్లా 76 సంవత్సరాల క్రితం 1946లో ఆర్కే కాటేజీగా నిర్మించారు బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ . ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో కొలువుదీరిన ఈ అందమైన భవనం ఆర్కే బంగ్లా (కృష్ణ రాజ్ బంగ్లా) కొన్ని దశాబ్దాలుగా పాపులర్ అయింది. అయితే రిషి కపూర్ , నీతూ వివాహం సందర్భంగా ఈ బంగ్లా పేరును 'కృష్ణ రాజ్ బంగ్లా'గా మార్చారట. దాదాపు 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో రాజ్ కపూర్, భార్య కృష్ణ కపూర్, పిల్లలందరూ నివసించారు. రాజ్ కపూర్ పిల్లలు రిషి కపూర్, రణధీర్, రాజీవ్ కపూర్ ఈ బంగ్లాలో వివాహం చేసుకున్నారు. గత 76 ఏళ్లుగా, కపూర్ కుటుంబంలోని వివాహాలు, పెద్ద పెద్ద ఈవెంట్లకు ఈ బంగ్లానే వేదిక కావడం విశేషం. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ మోహిత్ మల్హోత్రా రాజీనామా
సాక్షి,ముంబై: గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ మోహిత్ మల్హోత్రా సీఎండీ రాజీనామా చేశారు. మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన పదవులకు రాజీనామా చేసినట్లు ఆగస్టు 2న స్టాక్ ఎక్స్ఛేంజ్కి సమాచారంలో కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం నార్త్ జోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గౌరవ్ పాండే బాధ్యతలు స్వీకరిస్తార కంపెనీ తెలిపింది అయితే రాజీనామా చేసిన మల్హోత్రా డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలోఉంటారు. ఈనేపథ్యంలో 2023 జనవరి నుంచి గౌరవ్ పాండే కొంత్త సీఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పాండేకు రియల్ ఎస్టేట్ రంగంలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉందని పేర్కొంది. కొత్త సీఎండీ గౌరవ్ పాండే నియామకంపై గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని, పరిశ్రమలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయాన్ని కొనసాగించేలా మార్గనిర్దేశం చేస్తారని భావిస్తున్నామన్నారు. కాగా గోద్రెజ్‌లో చేరడానికి ముందు, పాండే రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ, ప్రాప్ఈక్విటీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ & కన్సల్టింగ్ హెడ్‌గా కూడా పనిచేశారు. దీంతోపాటు దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులకు సలహాలిచ్చేవారు. -
కొత్త ప్రాజెక్టులపై ఒక బిలియన్ డాలర్లు..
న్యూఢిల్లీ: రాబోయే కొన్ని సంవత్సరాల్లో కొత్త ప్రాజెక్టుల కొనుగోలు, అభివృద్ధిపై 1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు రియల్టీ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ వెల్లడించారు. అధిక వృద్ధి సాధన లక్ష్యాల్లో భాగంగా ఈ మేరకు ప్రణాళికలను అమలు చేయనున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో ఆయన వివరించారు. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ 14 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 6,725 కోట్లకు చేరాయని గోద్రెజ్ తెలిపారు. మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) నమోదు చేసిన రూ. 6,000 కోట్ల బుకింగ్స్ స్థాయిని అధిగమించినట్లు వివరించారు. ‘రోజుకు సగటున 25 గృహాల చొప్పున మొత్తం 9,345 గృహాలను విక్రయించాం‘ అని గోద్రెజ్ పేర్కొన్నారు. మార్చి నెలలో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ప్రక్రియ ద్వారా రూ. 3,750 కోట్లు సమీకరించిన నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మిగులు నిధులతో ముగించినట్లయిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యాపార అభివృద్ధికి పటిష్టమైన అవకాశాలు ఉన్నట్లు గోద్రెజ్ వివరించారు. ప్రధానంగా ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం)పై ప్రధానంగా దృష్టి పెడుతున్న గోద్రెజ్ ప్రాపర్టీస్.. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కీలక మార్కెట్లో సుమారు రూ. 1,300 కోట్ల పైగా విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించింది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్లా- ఎన్ఎఫ్ఎల్ ఖుషీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో(ఏప్రిల్- అక్టోబర్) నాన్యూరియా ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జోరందుకోవడంతో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. వెరసి గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్ భారీ నష్టాలతో కళ తప్పగా.. ఎన్ఎఫ్ఎల్ భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నికర లాభం 78 శాతం క్షీణించి రూ. 7 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 65 శాతం నీరసించి రూ. 90 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69 శాతం పడిపోయి రూ. 22.6 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.3 శాతం కుప్పకూలి రూ. 1,036 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,030 వరకూ వెనకడుగు వేసింది. ఎన్ఎఫ్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో అన్నిరకాల యూరియాయేతర ఎరువుల అమ్మకాలు జోరందుకున్నట్లు నేషనల్ ఫెర్టిలైజర్స్ తెలియజేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువుల వాడకంలో రైతులకు కంపెనీ ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా పానిపట్‌లో తయారైన బెంటోనైట్ సల్ఫర్ అమ్మకాలు 3478 ఎంటీ నుంచి 11,730 ఎంటీకి ఎగశాయి. ఇదేవిధంగా ఎస్ఎస్పీ విక్రయాలు 6323 ఎంటీ నుంచి 14,726 ఎంటీకి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్ఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 32.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 34 వరకూ ఎగసింది. -
ఇన్ఫో ఎడ్జ్ క్విప్ షురూ- షేరు జూమ్
ఇంటర్నెట్ ఫ్రాంచైజీ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 3177.18ను కంపెనీ బోర్డు మంగళవారం ప్రకటించింది. కాగా.. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు జూన్ 22న జరిగిన సమావేశంలోనే ఇన్ఫో ఎడ్జ్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు.. తాజాగా క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 1,875 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆన్లైన్ క్లాసిఫైడ్ విభాగాలు.. నౌకరీ.కామ్, 99ఏకర్స్.కామ్, జీవన్సాథీ.కామ్, శిక్షా.కామ్‌ను కంపెనీ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇన్ఫోఎడ్జ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 3420ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 3395 వద్ద ట్రేడవుతోంది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 20.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2019-20) క్యూ1లో రూ. 90 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 89 శాతం పడిపోయి రూ. 72 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ఎన్ఎస్ఈలో 2.7 శాతం క్షీణించి రూ. 906 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 892 వరకూ పతనమైంది. -
ఈ ఏడాది విక్రయాలు బావుంటాయ్: గోద్రేజ్ ప్రాపర్టీస్
గతేడాది మాదిరి ఈ ఏడాది కూడా ప్రాపర్టీ విక్రయాలు బావుంటాయని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎక్సిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రేజ్ అన్నారు.కోవిడ్-19 కారణంగా నిర్మాణ రంగ కార్యక్రమాలు నెమ్మదించినప్పటికీ, ప్రాపర్టీ కంపెనీలు ప్రాజెక్టులను పూర్తిచేసే ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.గత ఆర్థిక సంవత్సరం గోద్రేజ్ ప్రాపర్టీస్‌లో రూ.5,915 కోట్ల రికార్డు స్థాయి బుకింగ్స్ జరిగాయని ఈ ఆర్థిక సంవత్సరంలో అదే స్థాయి విక్రయాలు జరుగుతాయని పిరోజ్షా ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల కాలంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ బుకింగ్స్ పెరిగాయని,మార్చి నెల చివరి 10-15 రోజుల్లో కూడా అమ్మకాలు జరిపామని తెలిపారు. లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి నిర్మాణ రంగ పనులతోపాటు, భౌతిక విక్రయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లోకూడా అమ్మకాలు మంచిగా జరిగి ఈ ఆర్థిక సంవత్సరం కూడా బావుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కొనుగోలు దారులపై సంస్థ ఆసక్తి కనబరుస్తుందన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా 10-15 శాతం ఎన్ఆర్ఐలు విక్రయాల బుకింగ్స్ జరిగాయని,లాక్డౌన్ కాలంలో ఇది ఎంతో సాయపడిందని తెలిపారు. నగదు ప్రవాహ పరిస్థితి, నిర్మాణ రంగ పనుల వేగం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంటుందని, నగదు ప్రవాహంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్‌కు ఎటువంటి నగదు ఇబ్బంది లేదని రూ.2000 కోట్ల బ్యాలెన్స్ షీట్, ఆరోగ్యకరమైన డెట్ ఈక్విటీ రేషియో ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హౌసింగ్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్నిఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, వేతనాల్లో కోతలవల్ల కొనుగోలు శక్తి తీవ్రంగా దెబ్బతింటుదని చెప్పారు. కాగా ప్రస్తుతం బీఎస్ఈలో గోద్రేజ్ ప్రాపర్టీస్ షేరు దాదాపు 4 శాతం లాభపడి రూ.715.55 వద్ద ముగిసింది. -
గోద్రేజ్ చేతికి ఆర్కే స్టూడియోస్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ఐకానిక్ ఆర్కే స్టూడియోస్‌ను గోద్రేజ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ స్టూడియోస్ ను హస్తగతం చేసుకోవడానికి చాలా సంస్థలు పోటీపడినా చివరకు.. గోద్రెజ్ సంస్థ గత ఏడాది అక్టోబర్‌లోనే రూ.190 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. అయితే శుక్రవారం దీనికి సంబంధించి లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. ఆర్కే స్టూడియోస్‌ను తమ ఆస్తుల్లో భాగం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ గోద్రేజ్ తెలిపింది. దీనిపై గోద్రేజ్ ఎక్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్‌షా గోద్రేజ్ వ్యాఖ్యానిస్తూ చెంబూరు మౌలిక సదుపాయాల ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. మా వ్యూహాలకు ఈ స్థలం సరిగ్గా సరిపోతుంది. ఆర్కే స్టూడియోస్ ఎంతో ప్రాచుర్యం చెందింది. దీనికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్‌లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియోస్ యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. స్టూడియోస్‌ను ముంబయిలోని చెంబూరులో 2.2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.జరుపుకొన్నాయి. కాగా సుమారు 70 సంవత్సరాల క్రితం ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 2.2 ఎకరాల్లో నిర్మితమైన ఆర్కే స్టూడియోస్ ను బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కపూర్ ఈ స్టుడియోస్ ను నిర్మించారు. 1970, 80ల నాటి కాలంలో ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆర్కు ఫిలింస్ బ్యానర్లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మితమయ్యాయి. రాజ్ కపూర్ మరణించిన తరువాత ఈ స్టూడియోస్ ను ఆయనకుటుంబం దీని బాగోగులు చూస్తూ వచ్చింది. అయితే దీనిని అమ్మేయాలని రిషి కపూర్ ఫ్యామిలీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ లాభం రూ.21 కోట్లు
న్యూఢిల్లీ: గోద్రేజ్ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ గోద్రేజ్ ప్రొపర్టీస్ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతపదికన రూ. 21 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.21 లక్షల నికర లాభం మాత్రమే వచ్చిందని గోద్రేజ్ ప్రొపర్టీస్ పేర్కొంది. ఆదాయం అధికంగా ఉండటం, పన్ను రివర్సల్, అధిక ఇతర ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఫిరోజ్‌షా గోద్రేజ్ చెప్పారు. గత క్యూ2లో రూ.349 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.487 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఈ క్యూ2లో అమ్మకాల బుకింగ్‌లు రూ.807 కోట్లుగా ఉన్నాయని ఫిరోజ్‌షా తెలియజేశారు. గత క్యూ2లో ఈ బుకింగ్‌లు రూ.1,335 కోట్లని, 14 శాతం క్షీణత నమోదైందని చెప్పారు. ఇతర ఆదాయం 161 శాతం పెరిగి రూ.94 కోట్లకు చేరుకుంది. గత క్యూ2లో పన్ను వ్యయాలు రూ.3.6 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.17 కోట్ల ట్యాక్స్ క్రెడిట్ లభించింది. -
రెండు నెలల్లో 300కు పైగా ఫ్లాట్స్ విక్రయం
ముంబై: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ పునేలో భారీ అమ్మకాలను సాధించింది. ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం స్వల్ప కాలంలోనే సుమారు75 శాతం విక్రయాలను నమోదు చేసింది. ఉంద్రిలోని 31 ఎకరాల రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ లో భాగంగా 10 ఎకరాల విస్తరించిన గోద్రెజ్ గ్రీన్స్ ప్రాజెక్టులో 2, 3 బెడ్ రూమ్ ఫ్లాట్లను విక్రయిస్తోంది. ముంబై ఆధారిత ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ పూనే లో గోద్రెజ్ గ్రీన్స్ ప్రాజెక్ట్ కు చెందిన 300 అపార్ట్ మెంట్లను విక్రయించింది. మొత్తం 400 ఫ్లాట్స్ లో ఇది 75 శాతమని గోద్రెజ్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో పిరోజ్ షా గోద్రెజ్ చెప్పారు. పుణే తమకు కీలకమైన ప్రాంతమని, భవిష్యత్తులో మరింత విజయాన్ని సాధించనున్నామని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ వినియోగదారులు అసాధారణమైన, వినూత్నమైన ప్రాజెక్ట్ అందించేందుకు కృషి చేస్తాన్నామన్నారు.