న్యూఢిల్లీ: రియల్టీ రంగ దిగ్గజం గోద్రెజ్ ప్రాపర్టీస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను అధిగమించింది. హౌసింగ్‌కు నెలకొన్న పటిష్ట డిమాండ్ ఇందుకు సహకరించింది.
అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 260 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,523 కోట్ల నుంచి రూ. 1,839 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు ఎన్‌సీడీలు, బాండ్లు తదితర మార్గాల ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 2,000 కోట్ల సమీకరించేందుకు అనుమతించింది. చేపడుతున్న ప్రాజెక్టులు, పటిష్ట బ్యాలన్స్‌షీట్, హౌసింగ్ రంగ వృద్ధి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లోనూ ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్శన్ పిరోజ్‌షా గోద్రెజ్ అభిప్రాయపడ్డారు.
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 571 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 352 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,586 కోట్ల నుంచి రూ. 3,039 కోట్లకు బలపడింది. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 12,232 కోట్ల విలువైన అమ్మకాల బుకింగ్స్‌ను సాధించింది. 2021–22లో నమోదైన రూ. 7,861 కోట్లతో పోలిస్తే ఇవి 56 శాతం అధికం. నగదు వసూళ్లు 41 శాతం ఎగసి రూ. 8,991 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపరీ్టస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం తగ్గి రూ. 1,323 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment