
బెజవాడలో మంత్రులకు విల్లాలు, అపార్ట్‌మెంట్లు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు బెజవాడలో నివాస గృహాలు ఖరారయ్యాయి. మలేషియన్ టౌన్ షిప్‌లో విల్లాలు, అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 245 అపార్ట్‌మెంట్లు, 26 విల్లాలు అద్దెకు తీసుకోనున్నారు. చదరపు అడుగుకు 11 రూపాయల చొప్పున అద్దె చెల్లించనున్నారు. కాగా ఆర్అండ్బీ లెక్క ప్రకారం అడుగుకు 7 రూపాయిలే ఉంది. ఈ అద్దె రూపేణా ఏడాదికి రూ.5.5 శాతం అద్దె చెల్లించనుంది.
నవంబర్ 1వ తేదీలోగా అపార్ట్మెంట్లు, విల్లాలను అప్పగించాలని యజమానులతో...సర్కార్ ఒప్పందం చేసుకుంది. రెండు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోగా, ఏటా 5 శాతం అద్దె పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో నెలకు రూ.50వేలు చొప్పన ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న విషయం తెలిసిందే.