
అమెరికాలో నెవాడోలో వికృతమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు ఓ వ్యక్తి బానిసయ్యాడు. ఈ వికృత చేష్టలకు విసిగిపోయిన మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని పసిగట్టారు. నిందితున్ని ఆంథోనీ గొంజాలెస్(26)గా గుర్తించి అరెస్టు చేశారు.
జులై 1న నిందితుడు ఇద్దరు మహిళలు ఉండే ఫ్లాట్‌లోకి దొంగచాటుగా వెళ్లాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే వరుస. జులై 1 నుంచి జులై 3 మధ్య వారిపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితున్ని ఆంథోని గొంజాలెస్‌గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Riots In New York: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు..
Comments
Please login to add a commentAdd a comment