enters
-
కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్న అనన్య బిర్లా (ఫోటోలు)
-
వడాపావ్ అమ్ముతూ రోజుకు రూ.40 వేల సంపాదన.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. పట్టుబడ్డ భారతీయులు
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు భారతీయులు సహా నలుగురు అక్కడి అధికారులకు పట్టుబడ్డారు. కెనడాలో గూడ్స్ రైలెక్కిన వీరు ఈ నెల 12న సరిహద్దులు దాటాక బఫెలో నగరంలోని ఇంటర్నేషనల్ రైల్రోడ్ బ్రిడ్జి వద్ద కదులుతున్న రైలు నుంచి కిందికి దూకారు. ఆ క్రమంలో నలుగురిలో ఒక మహిళ గాయపడింది. ఆమెతోపాటు మిగతా ముగ్గురినీ అనంతరం సరిహద్దు గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. వీరు ఎలాంటి పత్రాలు లేని అమెరికాయేతర పౌరులని చెప్పారు. ఇందులో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు భారతీయ పౌరులు కాగా, నాలుగో వ్యక్తిని డొమినికల్ రిపబ్లిక్ దేశస్తుడిగా గుర్తించామన్నారు. -
మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత..
ఢిల్లీ: వివాదాలతో, చిత్రవిచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్య డ్యాన్సులు, ఫైటింగ్‌లు, వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు.. అయినప్పటికీ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టేంత పని చేసింది. Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW — Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ, యువకుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. తాను తోడుగా ఉన్న మహిళకు సహాయంగా మాత్రమే మహిళల విభాగంలోకి వెళ్లానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి.. -
ఛీ.. ఛీ ..ఇదేం అలవాటు.. నిద్రిస్తున్న మహిళల పాదాలు తాకుతూ..
అమెరికాలో నెవాడోలో వికృతమైన స్వభావం కలిగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిద్రిస్తున్న మహిళల ఇంట్లోకి చొరబడి వారి పాదాలను నిమరే అలవాటుకు ఓ వ్యక్తి బానిసయ్యాడు. ఈ వికృత చేష్టలకు విసిగిపోయిన మహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని పసిగట్టారు. నిందితున్ని ఆంథోనీ గొంజాలెస్(26)గా గుర్తించి అరెస్టు చేశారు. జులై 1న నిందితుడు ఇద్దరు మహిళలు ఉండే ఫ్లాట్‌లోకి దొంగచాటుగా వెళ్లాడు. నిద్రిస్తున్న మహిళ పాదాలు నిమిరాడు. ఒక్కసారిగా మహిళలు లేచి ప్రతిదాడి చేసేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదే వరుస. జులై 1 నుంచి జులై 3 మధ్య వారిపై ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు కూడా ఆ ప్రాంతంలోని మహిళలందరిపై ఈ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం ఆరా తీశారు. అయితే.. వేలి ముద్రల ఆధారంగా ఆగష్టు 1న అతన్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని ఆంథోని గొంజాలెస్గా గుర్తించారు. ఇతడు ఇంతకుముందే ఇలాంటి ఘటనల్లో నిందితునిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మహిళల బూట్లు దొంగిలించిన ఘటనల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో లైంగిక స్వయంతృప్తి చెందుతున్నాడనే ఫిర్యాదులు కూడా ఇతనిపై వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: Riots In New York: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
వామ్మో.. తరగతి గదిలో ప్రవేశించిన చిరుత..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఒక తరగతి గదిలో చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో ఉదయాన్నే కళాశాలకు వెళ్లిన విద్యార్థిపై దాడిచేసింది. అతను భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్‌లోని చౌదరి నిహాల్ సింగ్ అనే పాఠశాలలో చిరుతపులి ప్రవేశించింది. తరగతి గదిలో బెంచీల చాటున దాక్కుంది. గదిలోకి ప్రవేశించిన..లక్కీరాజ్ సింగ్ అనే బాలుడిపై వెనక నుంచి దాడిచేసి.. గాయపర్చింది. వెంటనే పులి వేరే చోటుకి పారిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ యోగేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం చిరుత ఒక తరగతి గదిలో దాక్కుందని పాఠశాల సిబ్బంది అటవీ అధికారులకు తెలిపారు. చిరుత పులి కదలికలు పాఠశాలలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈక్రమంలో.. అటవీ సిబ్బంది చిరుత పులిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తును ప్రజలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. -
Warangal: వ్యాక్సిన్ సెంటర్లోకి నాగుపాములు
సాక్షి, జనగామ(వరంగల్): జనగామ జిల్లా కేంద్రం లేబర్ అడ్డా ఏరియాలోని ఏబీవీ ఎయిడెడ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లోకి రెండు నాగుపాములు వచ్చి హల్చల్చేసిన సంఘటన ఆదివారం జరిగింది. మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం స్వర్ణ, మెప్మా ఆర్పీ షాహీన్, ఇతర వైద్య సిబ్బంది సెంటర్‌కు చేరుకున్నారు. టీకా కార్యక్రమం ప్రారంభించేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సిబ్బందికి వేర్వేరు చోట్ల రెండు పాములు కనిపించడంతో... డోస్‌ల డబ్బాలు అక్కడే వదిలిపెట్టి భయంతో పరుగులు పెట్టారు. పక్కనే శిథిలమైన గదిలోకి ఓ పాము వెళ్లగా, మరొకటి మాత్రం టీకా సెంటర్లోనే ఉండి పోయింది. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజు, కమిటీ సభ్యులు, స్థానికులు, మునిసిపల్ మేనేజర్రాములు అక్కడకు వచ్చి బయటకు పంపేందుకు గంట పాటు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో వ్యాక్సిన్ సెంటర్‌ను పాతగోదాంల వద్ద ఉన్న సబ్సెంటర్కు తరలించారు. చిన్నారికి తప్పిన ముప్పు జనగామ రూరల్: పట్టణంలోని ఏసీరెడ్డి నగర్ డబుల్‌బెడ్ రూం కాలనీలో పాములు బుసకొడుతున్నాయి. కాలనీలో మౌలిక సదుపాయాలు అయిన వీధి దీపాలు, విద్యుత్, మంచి నీటి వసతి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. వీటికి తోడుగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో చిన్నారులు పెద్దలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆదివారం 8వ బ్లాక్‌లో గిద్దల ఎల్లయ్య ఇంట్లోకి పాము రాగా ఆ సమయంలో వారి కూతురు నైసి ఇంట్లోనే ఉంది. పక్కింటి వారు పామును గమనించి బిగ్గరగా అరవడంతో చాకచక్యంగా పామును బంధించారు. చదవండి: తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ -
ఎనిమిదడుగుల మొసలి.. ఫారెస్ట్ అధికారులను రెండు గంటలపాటు..
జైపూర్: సాధారణంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లలో ఉండే జీవులు మానవ ఆవాసాలకు కొట్టుకుని వస్తుంటాయి. పాములు, మొసళ్లు, తదితర జీవులు నీటిప్రవాహంలో కొట్టుకుని వస్తుంటాయనే విషయం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులన్ని నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో.. ఎనిమిదడుగుల మొసలి దారితప్పి ఒక ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. సవాయి మాధోపూర్ జిల్లాలోని ఒక ఇంటి ఆవరణలోకి ఎనిమిది అడుగుల భారీ మొసలి ప్రవేశించింది. ఆ ఇల్లు చెరువుకు దగ్గరలో ఉంటుంది. కాగా, ఇంటి ఆవరణలో మొసలిని చూసిన వారు భయాందోళనలకు గురయ్యారు. ఆ మొసలి అటు ఇటూ తిరుగుతూ కాసేపు బీభత్సాన్ని సృష్టించింది. భారీ మొసలిని చూడటానికి స్థానికులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో, ఇంట్లోని వారు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాసేపటికి రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొసలిని చూసి ఆశ్చర్యపోయారు. దాన్ని బంధించడానికి పెద్ద బోనును తీసుకువచ్చారు. మొసలిని తాళ్లసహయంతో పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే, మొసలి అధికారులకు ముప్పు తిప్పలు పెట్టి.. చిక్కినట్టే చిక్కి తప్పించుకోసాగింది. కాగా, దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చివరకు మొసలిని బంధించారు. ఈ సంఘటనను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీన్ని తమ ఫోనులో రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
జనావాసాల్లోకి ప్రవేశించిన చిరుత : ఉత్తర ప్రదేశ్
-
Shocking: స్టోర్‌లో ప్రవేశించిన పాము.. దీంతో ఆ మహిళ..
బ్యాంకాక్: సాధారణంగా మనలో చాలా మందికి పాములంటే విపరీతమైన భయం. దాని పేరెత్తగానే భయంతో వణికి పోతుంటారు. ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో కనిపిస్తే, ఇంకేమైన ఉందా.. అక్కడి నుంచి చటుక్కున పారిపోతారు. అయితే, ఇలాంటి షాకింగ్ ఘటన థాయిలాండ్‌లోనూ చోటుచేసుకుంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. వివరాలు.. చోన్బూరి పరిధిలో ఉన్న ఒక స్టోర్‌లో మహిళ ఉద్యోగి కౌంటర్లో కూర్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె ఏదో వస్తువును రిఫ్రిజిరేటర్లో పెట్టడానికి వెళ్లింది. అక్కడే, నిలబడి ఫ్రిజ్‌లో చూస్తోంది. ఇదిలా ఉండగా.. బయట నుంచి ఏదో పాకుకుంటు తన షాప్‌లో రావడాన్ని చూసింది. వెంటనే తేరుకుని పరిశీలించి చూసింది. ఒక పాము మెరుపు వేగంతో షాప్‌లోని కౌంటర్ కింద నుంచి లోపలికి ప్రవేశించింది. దీంతో ఆమెకు ఒక్క సారిగా గుండె ఆగినంతా పనైంది. దీంతో ఆమహిళ ‘వామ్మో.. అంటూ భయంతో షాపు నుంచి బయటకు పరుగులు తీసింది’. అయితే, ఇదంతా అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ‘పాము, మీ షాపులో ఎలుకల కోసం వచ్చుంటుంది..’, ‘ మీ సమయ స్ఫూర్తికి హ్యట్సాఫ్..’, ‘ మీరు ఒక్కరే ఉన్నారు.. బహుషా.. చూడటానికి వచ్చిందేమో.. ’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: హెల్మెట్‌ను చాక్లెట్లా మింగేసిన ఏనుగు.. వీడియో వైరల్ -
అట్లాంటిక్ సముద్రంలో మిసైన సబ్‌మెరైన్
-
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు
-
గ్లోబల్ ట్రావెల్ సెర్చ్ ఇంజన్ 'కయాక్' ఎంట్రీ
ముంబై: గ్లోబల్ ట్రావెల్ సర్చ్ ఇంజన్ కయాక్ భారత మార్కెట్లో ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని బుధవారం సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమ వెబ్సైట్, ట్రావెల్ యాప్ ద్వారా భారత్ లోని వినియోగదారులకు మరింత సమాచారాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. బహుళ వెబ్సైట్లకు వెళ్ళకుండా, ధరలు, ప్రైస్ ఎలర్ట్స్, సహా ప్రయాణాల ఉచిత నిర్వహణ వంటి సేవలను కయాక్ అందించనుంది. ప్రజలకు వినూత్న ప్రయాణ సౌకర్యాలను అందించే దిశగా , వారి వారి ట్రిప్ లను ప్లాన్ చేసుకునేందుకు సహాయం చేసేలా పనిచేయనున్నట్టు కయాక్ డైరెక్టర్ (ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశం) ఫంగ్ పిటిఐకి తెలిపారు. భారతదేశం లో ట్రావెల్ మార్కెట్ కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో భారత మార్కట్లో ప్రవేశానికి ఇదే సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు. ప్రజల పర్యటనకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి తమ సంస్థ సహాయపడుతుందన్నారు. అనేక వెబ్ సైట్లను దర్శించాల్సిన అవసరం లేకుండానే కయాక్ వినియోగదారులు కేవలం కొన్ని క్లిక్ లతో వందల సైట్ల సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. ఈ మేరకు డిజిటల్ సహా సోషల్ మీడియా, ఈ కామర్స్, ఇతర అన్ని మీడియాల్లో భారీ ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో అగ్రస్థానంలో ఒకటిగా ఉన్న భారత్ వినియోగదారులకు మరింత అదనపు ప్రయోజనాలను అందించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. కొరియా, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ ఇతర టాప్ మార్కెట్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా కయాక్ 20భాషల్లో 40 అంతర్జాతీయ సైట్లను నిర్వహిస్తోంది. 2016 సం.లో 1.5 మిలియన్ల సెర్చ్ లను నమోదు చేసింది. -
ఏ పూజకైనా బూటుతోనే హాజరు
-
ఆ సీఈవో రూ.32 కోట్ల సౌధానికి యజమాని
బెంగళూరు: బిగ్గెస్ట్ ఆన్ లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీబన్సల్ (32) టెక్ సిటీలోని విలాసవంతమైన ఏరియాలో ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. దాదాపు రూ.32కోట్లు (5మిలియన్ డాలర్లు) ఖరీదు చేసే బెంగళూరులోని కోరమంగళ ప్రాంతలో ఓ విశాలమైన సౌధాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 10,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. 32 సం.రాల వయసులో 32 కోట్ల రూపాయిల కలల సౌధానికి అధిపతిగా అవతరించాడు ఫ్లిప్ కార్ట్ బాస్. ఇటీవల బెంగళూరులో జరిగిన అతిపెద్ద గృహ కొనుగోలు డీల్స్‌లో ఇదీ ఒకటని అంచనా. తొమ్మిదేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించిన ప్రదేశానికి ఇది సమీపంలోనే ఉండడం విశేషం. అన్నట్టు ఫ్లిప్‌కార్ట్ మరో సహవ్యవస్థాపకుడైన సచిన్ బన్సాల్ దీనికి పొరుగునే కొన్నేళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన ఫ్లిప్‌కార్ట్‌లోని కొన్ని షేర్లను విక్రయించి వచ్చిన మొత్తంతో ఇక్కడ ఇల్లు కొన్నారు. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, క్రిస్ గోపాల కృష్ణన్, డాక్టర్ దేవిశెట్టి, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు నివసించే ఏరియాకి దగ్గరలోనే బన్సాల్ , ఆయన భార్య త్రిష కూడా చేరారు. కాగా బన్సాల్ రెండు ప్రైవేటు బ్యాంకుల్లో కొంత మొత్తం అప్పు తీసుకొని మరీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇక్బాల్ కుటుంబంనుంచి దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు కొన్ని వారాల క్రితమే రిజిష్ట్రేషన్ పూర్తయింది. అయితే దీనిపై స్పందించడానికి బిన్నీ బన్సల్ నిరాకరించారు. -
పొరపాటుగా భారత్ లోకి వచ్చిన పాక్ చిన్నారి
ఛండీగఢ్ః ఐదేళ్ల చిన్నారి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఇండియాలో ప్రవేశించింది. చెవిటి,మూగ సమస్యలతో బాధపడుతున్న ఆ పాకిస్తాన్ బాలిక పంజాబ్ అబోహార్ సెక్టార్ ప్రాంతం లోని సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు గుర్తించారు. భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం పదిన్నర గంటల ప్రాతంలో ఆ పాక్ చిన్నారి అంతర్జాతీయ సరిహద్దులు దాటింది. దీంతో సరిహద్దు స్థావరంలో పనిచేసే అభోర్ సెక్టార్ బీఎస్ఎఫ్ దళానికి చెందిన నతాసింగ్ వాలా బాలికను గమనించారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ బాలిక సరిహద్దు భద్రతా వలయంలోకి చేరినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఆర్ ఎస్ ఖటారియా తెలిపారు. అయితే అనుకోకుండా భారత్ లోకి ప్రవేశించిన ఆ ఐదేళ్ల చిన్నారిని ప్రశ్నించడంతో చెవిటి, మూగ అని తెలిసిందని, దీంతో ఆమెకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించలేక పోయిందని చివరికి పేరు కూడ తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఆమె సరిహద్దు దాటి వచ్చిందన్న హెచ్చరికలతో చిన్నారిని పట్టుకున్న దళాలు.. అనంతరం పాకిస్తాన్ రేంజర్స్ ను సంప్రదించి మానవతా దృక్పథంతో ఆ బాలికను ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు వివరించారు. -
సమైక్య గళం వినిపిస్తున్న యావత్ సీమాంధ్ర