![Three Indians arrested while entering US illegally from Canada - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/15/usa%2C-canada.jpg.webp?itok=hGYDNj7c)
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు భారతీయులు సహా నలుగురు అక్కడి అధికారులకు పట్టుబడ్డారు. కెనడాలో గూడ్స్ రైలెక్కిన వీరు ఈ నెల 12న సరిహద్దులు దాటాక బఫెలో నగరంలోని ఇంటర్నేషనల్ రైల్‌రోడ్ బ్రిడ్జి వద్ద కదులుతున్న రైలు నుంచి కిందికి దూకారు.
ఆ క్రమంలో నలుగురిలో ఒక మహిళ గాయపడింది. ఆమెతోపాటు మిగతా ముగ్గురినీ అనంతరం సరిహద్దు గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. వీరు ఎలాంటి పత్రాలు లేని అమెరికాయేతర పౌరులని చెప్పారు. ఇందులో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు భారతీయ పౌరులు కాగా, నాలుగో వ్యక్తిని డొమినికల్ రిపబ్లిక్ దేశస్తుడిగా గుర్తించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment