
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై ఆంక్షలు విధించారు. బోర్డర్ దాటి అమెరికాలోకి వచ్చే కెనడా పౌరులు తమ దేశంలో 30 రోజులు మించి ఉండకూడదు. దాటితే తమ నిబంధనలకు లోబడి ఉండాలి. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో అమెరికాలోని మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25శాతం పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో (Ontario) ప్రకటించింది. ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించారు.
సాధారణంగా కెనడా పౌరులు బోర్డర్ దాటి అమెరికాలో చొరబడుతుంటారు. 30 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఇందుకోసం ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సి ఉండేది కాదు. కానీ తాజాగా ట్రంప్ నిర్ణయంతో 30రోజులు దాటిన అమెరికాలోని కెనడా పౌరులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
లేదంటే 5వేల డాలర్ల ఫైన్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైన్‌తో పాటు, ఆరు నెలల జైలు శిక్షను విధించాల్సి ఉంటుంది. తాజాగా, ట్రంప్ విధించిన నిబంధనలు ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment