illegally
-
భారత్‌లోకి చొరబాటు.. త్రిపురలో ఐదుగురి బంగ్లాదేశీయులు అరెస్ట్
అగర్తల: బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురిని త్రిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీయులను ఆదివారం త్రిపురా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు.‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ ప్రారంభించాం. వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు. అరెస్ట్ అయిన ఐదుగురు బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి డివిజన్లోని చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లా పౌరులు భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి. -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. పట్టుబడ్డ భారతీయులు
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు భారతీయులు సహా నలుగురు అక్కడి అధికారులకు పట్టుబడ్డారు. కెనడాలో గూడ్స్ రైలెక్కిన వీరు ఈ నెల 12న సరిహద్దులు దాటాక బఫెలో నగరంలోని ఇంటర్నేషనల్ రైల్రోడ్ బ్రిడ్జి వద్ద కదులుతున్న రైలు నుంచి కిందికి దూకారు. ఆ క్రమంలో నలుగురిలో ఒక మహిళ గాయపడింది. ఆమెతోపాటు మిగతా ముగ్గురినీ అనంతరం సరిహద్దు గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. వీరు ఎలాంటి పత్రాలు లేని అమెరికాయేతర పౌరులని చెప్పారు. ఇందులో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు భారతీయ పౌరులు కాగా, నాలుగో వ్యక్తిని డొమినికల్ రిపబ్లిక్ దేశస్తుడిగా గుర్తించామన్నారు. -
ఔషధ చట్టం ఉల్లంఘిస్తే జైలుకే’
అరసవల్లి: జిల్లాలో అనధికారికంగా మందులు నిల్వ చేసే వారికి జైలు శిక్ష తప్పదని ఔషధ ని యంత్రణ శాఖ సహాయ సంచాలకులు ఎం. చంద్రరావు హెచ్చరించారు. ఆయన గురు వారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా టెక్కలి పరిధిలో ఔషధ చట్టం (1940) నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని గుర్తు చేశారు. 2018లో లైసెన్సు లేకుండా మందులు నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో అప్పట్లో టెక్కలి, శ్రీకాకుళం డ్రగ్ ఇన్స్పెక్టర్లు లావణ్య, కళ్యాణి బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కూర్మినాయుడుపై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు, నిల్వలున్న వ్యాపారులపై కఠిన చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం) -
బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా హైదరాబాద్‌లోకి
సాక్షి, రాజేంద్రనగర్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్న ఇద్దరు మయన్మార్ దేశస్తులను రాజేంద్రనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. మయన్మార్‌కు చెందిన అబ్దుల్ మునాఫ్ అలియాస్ అన్సారీ(31) 2014లో బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా పంజాబ్‌కు చేరుకుని అక్కడి నుంచి ముంబై, ఢిల్లీలలో నివసించాడు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి దినసరి కూలీగా బతుకుతున్నాడు. మయన్మార్‌కు చెందిన అఫీజ్ అహ్మద్(34) 2017లో బంగ్లా సరిహద్దు మీదుగా చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి మునాఫ్‌తో ఉంటున్నాడు. 2018 నుంచి వీరిద్దరు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ వారి భార్యలను సైతం నగరానికి రప్పించారు. ఇక్కడే ఆధార్, పాన్, ఓటర్ కార్డు తదితర వాటిని ఏజెంట్ల ద్వారా సమకూర్చుకున్నారు. పోలీసులు అబ్దుల్ మునాఫ్, అఫీజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి భార్యలు నూర్ కాలీమా, షేక్ రోఫికా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.8.82 కోట్ల విలువైన కార్లను తుక్కుతుక్కు చేశారు..
మనీలా: లక్షల రూపాయలు ఖరీదు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుకున్న కారు మీద చిన్న గీత కనిపించినా మనసు కలుక్కుమంటుంది. చాలా రోజుల పాటు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను తుక్కుతుక్కుగా మార్చితే.. అబ్బో తల్చుకోవడానికే బాధగా ఉంది కదా. కానీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలను విలువ చేసే లగ్జరీ కార్లను వరుసగా పార్క్ చేసి ఆ తర్వాత బుల్డోజర్తో వాటిని తుక్కుతుక్కుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ కార్లను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చారట. దాంతో కార్ స్మగ్లర్స్‌ను గట్టిగా హెచ్చరించడం కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 1.2మిలయన్ డాలర్లు(రూ. 8,89,72,920.00) విలువ చేసే 21 కార్లను ఇలా తుక్కుగా మార్చేసింది. ఇలా ధ్వంసం చేసిన కార్లలో మెక్లారెన్ 620 ఆర్, పోర్స్చే 911, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, మెర్సిడెస్ ఎస్‌ఎల్‌కే, లోటస్ ఎలిస్, మాడిఫైడ్ హ్యుందాయ్ జెనెసిస్ కూపే, టయోటా సోలారా, 14 “మిత్సుబిషి జీపు’’లను ఇలా తుక్కుగా మార్చింది. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ప్రకారం, ఈ లగ్జరీ కార్లన్నీ వేర్వేరు మార్గాల ద్వారా దేశంలోకి "అక్రమ రవాణా" చేయబడ్డాయి. 2018 నుంచి 2020 వరకు వేర్వేరు సందర్భాల్లో వీటిని స్వాధీనం చేసుకుని తుక్కుగా మార్చారు. “ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ 2017-447 ప్రకారం, ప్రభుత్వం కార్ల స్మగ్లర్ల పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలపడం కోసం వీటిని ఇలా నాశనం చేయవలసిందే’’ అని అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే పునరుద్ఘాటించారు. దేశంలోకి అక్రమ రవాణా చేసిన లగ్జరీ కార్లను ఇలా తుక్కుగా మార్చడం ఇది రెండో సారి. గతంలో బీఎమ్‌డబ్ల్యూ జెడ్ 1, ఫెరారీ 360 స్పైడర్, లంబోర్ఘిని గల్లార్డోతో సహా 17 వాహనాలను ఫిబ్రవరి 9 న బ్యూరో ఆఫ్ కస్టమ్స్ తుక్కుతుక్కు చేసింది. ఇది ఇక్కడ చాలా సాధారణ విషయం. గతంలో ఇలా తుక్కుగా మార్చిన వాటిలో రెనాల్ట్ 5 టర్బో, మెర్సిడెస్ ఎస్ఎల్ 55 ఏఎమ్‌జి, ఒపెల్ మాంటా, మసెరటి క్వాట్రోపోర్ట్, కాక లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వ చర్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఇంత ఖరీదైన కార్లను ఇలా ధ్వంసం చేసే బదులు ప్రభుత్వమే వేలం వేసి.. వచ్చిన డబ్బును మంచి పనుల కోసం వాడవచ్చు కదా అంటున్నారు జనాలు. చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే! -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 15 మంది గల్లంతు
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది పంజాబీ యువకులు గల్లంతయ్యారు. వీరిలో 6 మంది బహమాస్ ద్వీపం నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ గల్లంతుకాగా, మరో 9 మంది మెక్సికో–అమెరికా సరిహద్దు గుండా ప్రవేశించే ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాత్నం చాహల్ తెలిపారు. యువకులను అమెరికాకు పంపేందుకు ఢిల్లీలోని ఓ ఏజెంట్‌కు రూ. 19.5 లక్షలు ఇచ్చారని చాహల్ ఆరోపించారు. అమెరికా వెళ్లిన తర్వాత యువకులతో మాట్లాడేందుకు మరో రూ. 45 లక్షలు మరి కొంత మంది ఏజెంట్లకు ఇచ్చారని తెలిపారు. వారు మెక్సికో చేరిన తర్వాత నుంచి యువకుల నుంచి అసలు సమాచారమే లేదని తెలిపారు. వారిని కనుక్కునే ప్రయత్నం చేయాలంటూ చాహల్ భారత ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
అక్రమ నిర్మాణాలకు అడ్డా
సాక్షి, పటాన్చెరు: కిష్టారెడ్డిపేట అక్రమ నిర్మాణాలకు కేరాఆఫ్ అడ్రస్‌గా మారింది. పంచాయతీ కార్యదర్శి ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. హెచ్ఎండీఏ అనుమతులు లేనిది నిర్మాణాలు చేపట్టే ఆస్కారం అవకాశం లేదు. అయితే ఈ గ్రామ పంచాయతీలో మాత్రం కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. బీరంగూడ–కిష్టారెడ్డిపేట రోడ్డుపై గత కార్యదర్శుల సంతకాలతో కూడిన అనుమతులతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే ఆ రోడ్డు కావాల్సిన సెట్ బ్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. కానీ పంచాయతీ అనుమతులతో సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బీరంగూడ కమాన్ నుంచి సుల్తాపూర్ ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్‌కు వెళ్లే దారిలో కిష్టారెడ్డిపేటలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సుల్తాన్ పూర్ జంక్షన్ నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు వేలాది కార్లు ఈ దారిలోనే వెళ్లాల్సి వస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ఇప్పుడు గోతులమయంగా ఉంది. వాస్తవానికి ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఔటర్ జంక్షన్‌కు వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ఆ రోడ్డుకు ఇరుపక్కల సెట్ బ్యాక్‌లు, పార్కింగ్ సౌకర్యాలు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన పాలకవర్గం సభ్యులు కొందరు ఈ నిర్మాణాలను ఆపాలంటున్నారు. పంచాయతీ సర్పంచ్ ఏ.కృష్ణ కూడ గతంలో ఆ నిర్మాణాలు అడ్డుకోవాలని సూచించారు. ఇటు రారు.. వచ్చినా పట్టించుకోరు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన హెచ్ఎండీఏ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తార్నకలోని హెచ్ఎండీఏ కార్యాలయం వీడి బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సమస్యలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రం అక్రమార్కులతో చర్చలు జరిపి వారి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు దార్లను తార్నకకే రమ్మని చెప్తున్నారే.. తప్ప క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపడం లేదు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నివేదికను హెచ్ఎండీఏ అధికార్లకు సమర్పించారు. మూడు నెల్లల క్రితం ఆ నివేదికలు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై హెచ్ఎండీఏ అధికారి రమేశ్చరణ్ను వివరణ కోరగా తనకు అధికారికంగా ఎలాంటి నివేదిక అందలేదన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు. తప్పకుండాచర్యలు తీసుకుంటాం అక్రమ నిర్మాణాలను కచ్చితంగా నిరోధిస్తాం, అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. మండల ఈఓపీఆర్నకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి -
అమెరికాలో ఇద్దరు భారతీయుల నిర్బంధం
న్యూయార్క్: అమెరికాలోకి దొంగతనంగా ప్రవేశించిన ఇద్దరు భారతీయులను సరిహద్దు గస్తీ బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. న్యూయార్క్‌లోని హోగన్స్బర్గ్లో ఓ క్యాసినో వద్ద నిలిపి ఉన్న వాహనాన్ని బోర్డర్ పెట్రోల్ స్టేషన్ పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఆరుగురు భారతీయుల్లో ఇద్దరు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తేలింది. ఎటువంటి పత్రాలు లేని ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఓట్ల పథకమే
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వాలు తెస్తున్న పథకాన్ని ఓటు బ్యాంకు పథకంగా హైకోర్టు అభివర్ణించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇలాంటి పథకాలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బహుమానంగా ఇస్తున్నాయని ఆక్షేపించింది. తద్వారా చట్టాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తులకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని పేర్కొంది. ఇలాంటి పథకాలు రాజ్యాంగ సూత్రాలు, ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు మనుగడలో ఉండగా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని మోసగించడమే... ‘ప్రభుత్వం తొలుత దారిద్య్ర రేఖకు దిగువన ఉంటూ ఎలాంటి నివాసం లేని కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు క్రమబద్ధీకరణ పథకాన్ని తెచ్చింది. ఆ తరువాత పేద, ధనిక, పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేరుతో క్రమబద్ధీకరిస్తోంది. ఇందుకు ఉచితంగా లేదా నామమాత్రంగా రుసుము వసూలు చేస్తోంది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని స్పష్టం చేసింది. విశాఖ, హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి... విశాఖపట్నం, హైదరాబాద్‌లో పేద, ధనిక అనే తేడా లేకుండా ఉచితంగా 100 చదరపు గజాల వరకు సర్కారు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణదారుడికి అప్పటికే ఇల్లు ఉందా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉచితంగా భూమిని క్రమబద్ధీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాయితీ కలిగిన పౌరులు, ఖజానాకు చేటు చేసే దిశగా రాజకీయ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా శాశ్వతంగా ఉండేæ అధికార యంత్రాంగం నడుచుకోవడం దురదృష్టకరమని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎమ్మార్వో సలహాతోనే.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పునాదిని నిర్మించుకునేందుకు అక్రమార్కులకు క్రమబద్ధీకరణ లాంటి తాయిలాలు ఇస్తూ చట్టాన్ని గౌరవించే పౌరులను బాధితులుగా మారుస్తున్నారని, ఇందుకు తాము ఎంత మాత్రం అంగీకరించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో విశాఖ జిల్లా భీమునిపట్నం మండల తహసీల్దార్ ఇచ్చిన సలహాతోనే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పిటిషనర్ బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాస్తవానికి ఆమెకు ఈ ఐడియా లేదని వ్యాఖ్యానించింది. ఆమె ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వ్యక్తే కాకుండా రాజకీయ నాయకురాలు (విజయనగరం జిల్లా చెరుకుపల్లి గ్రామ సర్పంచ్) కూడా అని గుర్తు చేసింది. రాజకీయ వర్గాలకు సైతం క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ప్రభుత్వానికి పట్టడం లేదంది. హైకోర్టులో పలు వ్యాజ్యాలు... బైరెడ్ల చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జి.రాము 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భీమునిపట్నం మండల తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే తహసీల్దార్ ఇచ్చిన సలహా మేరకు.. తాను అక్రమించుకున్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించాలంటూ బైరెడ్ల చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగానే భీమునిపట్నం మండలం తగరపువలస గ్రామం బంగ్లామెట్ట వద్ద సర్వే నెంబర్ 1–49–182/1లో చిన్నా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు ప్రయత్నించారు. దీనిపై చిన్నా 2017లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని జీవీఎంసీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ 2018లో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. చనిపోయిన కుమారుడికి చిన్నా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నందున రెండు వారాల పాటు నిర్మాణాల కూల్చివేతపై స్టే విధిస్తున్నట్లు గత ఏడాది ఫిబ్రవరి 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధిక్కార పిటిషన్ దాఖలు... అయితే ఆ తరువాత ఈ ఉత్తర్వులను హైకోర్టు పొడిగించలేదు. చిన్నా చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో అధికారులు చర్యలు తీసుకోలేదంటూ రాము కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు 2016లో జారీ చేసిన జీవో 118 ప్రకారం ఆక్రమిత భూమి క్రమబద్ధీకరణకు 2016 ఆగస్టులో చిన్నా దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం 2017 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 388 తెచ్చింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తుది తీర్పు వెలువరించారు. వన్‌టైం అంటూ మళ్లీ మళ్లీ.. ‘సి.కుల్సుంరెడ్డి కేసులో రాష్ట్రప్రభుత్వం తదుపరి ఎటువంటి క్రమబద్ధీకరణ పథకాలను తీసుకురాబోమంటూ వాగ్దానం చేసేం దుకు సిద్ధమైంది. అయితే ఈ హైకోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ వ్యవహార శైలే ఇందుకు కారణం. ప్రతిసారీ వన్‌టైం పథకం కింద తీసుకొస్తున్నామని చెప్పడం తరువాత మళ్లీ మరో కొత్త పథకం తీసుకురావడం చేస్తూ వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. ప్రస్తుత కేసు విషయాని కొస్తే చిన్నా అమాయకంగా ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా భావించి కొన్నా రు. ఇందులో ఎటువంటి అనుమతుల్లేకుండా జీ ప్లస్ టూ నిర్మాణం చేపట్టారు. 500 చదరపు గజాల వరకు ప్రభుత్వ భూమిని క్రమ బద్ధీకరిస్తామని సర్కారు పేర్కొంది. అందులో చేపట్టే నిర్మాణాల గురించి చెప్పలేదు. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను సమర్పించకుంటే నిర్మాణాలకు మునిసిపల్ అధికారులు అనుమ తులివ్వడానికి వీల్లేదు. దీనిప్రకారం సర్కారు తెచ్చిన క్రమబద్ధీకరణ పథకాన్ని చూస్తుంటే ప్రభుత్వ భూముల్ని దర్జాగా అక్రమించుకుని అందులో నిర్మాణాలు చేపట్టిన వారికి బహుమానంగా ఇచ్చేందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న పిటిషనర్ రాము వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసినా రాజ్యాంగ విరుద్ధమే.. ఏ రకంగా చూసినా కూడా ఈ క్రమబద్ధీకరణ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అయితే ఈ పథకాన్ని తమ ముందు సవాలు చేయనందున తాము ఆ మేరకు ప్రకటన చేయడం లేదని హైకోర్టు తెలిపింది. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి పథకాల గురించి ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు కొత్త పథకం వచ్చేంత వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తులపై నిద్రపోవడం ప్రభుత్వానికి ఎంత మాత్రం సరికాదంది. బైరెడ్ల చిన్నా క్రమబద్ధీకరణ దరఖాస్తు విషయంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు వారాల్లోపు తగిన నిర్ణయం వెలువరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రమబద్ధీకరణ దరఖాస్తును పరిష్కరించే వరకు ఆమె చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేయరాదని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. -
అమ్మకానికి తుపాకీ..!
సాక్షి, హైదరాబాద్: ఆయుధాన్ని అక్రమంగా బిహార్ నుంచి తీసుకువచ్చి వాట్సాప్ ద్వారా రూ.60 వేల రేటుకు అమ్మకానికి పెట్టిన ఓ మిత్రుల బృందం గుట్టును హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అక్కడి ఛాబ్రా ప్రాంతంలో తయారైన ఆయుధాన్ని ఎక్కువ రేటుకు అమ్మేందుకు ఓ వ్యక్తి ఖరీదు చేయగా... అది అనేక చేతులు మారి ఓ ఆభరణాల వ్యాపారి వద్దకు వచ్చింది. అతను ఓ వ్యక్తికి తాను ఇచ్చిన అప్పునకు గాను తుపాకీని జమ చేసుకోవడం కొసమెరుపు. ఈ జట్టుకు చెందిన మొత్తం ఆరుగురిని పట్టుకుని, నాటు తుపాకీ , మూ డు తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. టీ తాగి వచ్చేలోపు... బిహార్ రాజధాని పట్నాకు 30 కిమీ దూరంలోని ఛాబ్రా ప్రాంతం అడవికి దగ్గరలో ఉంటుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఇక్కడ నాటు తుపాకుల్ని తయారు చేసే కొన్ని కార్ఖానాలు వెలిశాయి. అక్కడ నాటు రివాల్వర్, పిస్టల్స్‌కు చెందిన విడి భాగాలను తయారు చేసి ఛాబ్రా వరకు తీసువచ్చి భద్రపరుస్తా రు. కొనుగోలుదారుడు ఎవరైనా వచ్చి తుపాకీకి డ బ్బు చెల్లిస్తే... దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి టీ తాగి రమ్మంటారు.దానికి పట్టే పావు గంటలో విడిభాగాలను అసెంబుల్ చేసి తుపాకీ సిద్ధం చేసి అందిస్తారు. ప్రస్తుతం మహారాష్ట్ర లోని పుణేలో ఆటోడ్రైవర్‌గా జీవిస్తున్న హుస్సేన్ గౌస్ మహ్మద్ ఖాన్ స్వస్థలం ఛాబ్రా. కొన్నాళ్ల క్రితం అక్కడకు వెళ్లిన ఖాన్ రూ.20 వేలు వెచ్చించి ఓ నాటు పిస్టల్, మూడు తూటాలు కొన్నాడు. విక్రయం కోసం సిటీకి తీసుకువచ్చి... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పి.ప్రకాష్ కుటుంబం కొన్నేళ్ల క్రితమే పుణేకు వలసపోయింది. అక్కడ ఉండగా తమ ఇంటి సమీపంలో నివసించే ఖాన్‌తో ఇతడికి పరిచయం ఏర్పడింది. ఆరు నెలల క్రితం ప్రకాష్ హైదరాబాద్‌కు వచ్చేసినా వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇలా ఖాన్ తాను ఖరీదు చేసిన తుపాకీ విషయం ఇతడికి చెప్పి విక్రయించమన్నాడు. అలా వచ్చిన మొత్తం ఇద్దరం పంచుకుందామని చెప్పాడు. అంగీకరించిన ప్రకాష్ ఆయుధం తీసుకువచ్చాడు. అతనికి ఓ వివాహ సందర్భంలో పరిగికి చెందిన జె.మోహన్‌తో పరిచయమైంది. దీంతో తుపాకీని అమ్మిపెట్టమని,లాభం పంచుకుందామంటూ అతనికి అందించాడు. ఇలా ముగ్గురూ దీని అమ్మకంపై దృష్టి సారించి ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. చిత్రంగా జ్యువెల్లరీ షాపు యజమాని వద్దకు... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మోహన్ కొన్నాళ్ల క్రితం పరిగికి చెందిన అజయ్ జ్యువెల్లర్స్ యజమాని నరేంద్ర చౌదరి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. అది తీర్చాలని నరేంద్ర ఇటీవల ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన మోహన్ తన వద్ద ఓ నాటు తుపాకీ ఉందని, దాన్ని అమ్మి ఆ డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు.సమ్మతించిన నరేంద్ర తానే విక్రయిస్తానని, వచ్చిన మొత్తంలో తన బాకీ మినహాయించుకుని మిగిలింది ఇస్తాననడంతో మోహన్ పిస్టల్‌ను అతనికి అప్పగించాడు. కొన్నాళ్లకు నరేంద్ర దాన్ని భద్రపరచమని సికింద్రాబాద్‌కు చెందిన తన స్నేహితులు నేమి చాంద్, గన్పత్ జట్లకు ఇచ్చాడు. వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసేసరికి... కొన్నాళ్లుగా ఈ పిస్టల్ ఖరీదు చేసే కస్టమర్ల కోసం తీవ్రంగా ప్రయత్నించిన నరేంద్ర తన స్నేహితుల బృందానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో ‘రూ.60 వేలకు వెపన్ ఫర్ సేల్’అంటూ పోస్టింగ్ పెట్టాడు. నిజమా? కాదా? అంటూ కొందరు చాట్ చేయడంతో ఆధారాలకోసం పిస్టల్ ఫొటో, తూటాల చిత్రం పెట్టాడు. ఈ విషయం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు దృష్టికి వచ్చింది. ఆయన నేతృత్వంలో పోలీసు బృందాలు వరుసదాడులు చేశాయి. ఫలితంగా ఆరుగురు నిందితులు అరెస్టు కావడంతో పాటు తుపాకీ, తూటాలు రికవరీ అయ్యాయి. -
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
పెద్దపల్లి: పెద్దపల్లి నుంచి గజ్వేల్‌కు అక్రమంగా తరలిస్తున్న 19 ఆవులను గోమాత రక్షక్ సేన సభ్యులు పట్టుకున్నారు. డీసీఎం వ్యానులో మొత్తం 19 ఆవులు ఉండగా రెండు ఆవులు మృతిచెందాయి. మరో మూడు ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. వీటిని వదశాలకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గోమాత రక్షక్ సేన సభ్యులు పోలీసులకు చేరవేశారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
కనగానపల్లి : అధికార పార్టీ పెద్దల అండంతో అక్రమార్కులు పెన్నానదిలో ఇసుకను తోడేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళా సంఘాల ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకొని లక్షలాది రూపాయలు ఆర్జించారు. ప్రసుత్తం ప్రజావసరాల కోసం చేపట్టిన భవనాల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ముసుగులో కూడా అధికార పార్టీ నాయకులు ఇసుకను మరింత అక్రమ రవాణా చేస్తున్నారు. రాప్తాడు నియోజక వర్గ పరిధిలో రామగిరి మండలంలోని పేరూరు సమీపంలోని పెన్నా నది పరివాహక ప్రాంతంతో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్నానది పరవళ్లుతొక్కేది. ఈ నదిపై పేరూరు సమీపంలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. దీని దిగువ భాగన ఇసుక దిన్నలు 5 కిలోమీటర్ల పొడవున ఏర్పడ్డాయి. దీంతో కొన్నేళ్లుగా రాజకీయనాయకులు, దళారులు కలిసి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ప్రతి రోజూ పెన్నా ఇసుక రిచ్‌ల నుంచి 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇసుకను ఓ చోట డంపు చేసుకొని అక్కడి నుంచి లారీల్లో కర్ణాటకలోని బెంగుళూరు ప్రాంతానికి తరలించి భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. పేరూరుకు సమీపంలో ఉన్న గ్రామాలతో పాటు కర్ణాటకలోని తిరుమణి, వల్లూరు గ్రామాల్లో అధికంగా డంపులు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లారీ ఇసుకను రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు అమ్ముకొంటున్నారు. దీంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గాలిమరల యూనిట్లకూ ఈ ఇసుకనే వినియోగిస్తున్న తెలుస్తోంది. ప్రస్తుతం పెన్నానది ప్రాంతంలో ఎక్కడ చూసిన రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టు పక్కల 10 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలలో బోరుబావులలో నీరు అడుగంటిపోయి తాగేందుకు నీరుదొకడం గగనమైదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జగదేవ్‌పూర్ : అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గుట్టు రట్టయింది.. ఇన్నాళ్లూ రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తూ పేదలపొట్ట కొడుతున్న వ్యాపారులకు కళ్లెంపడింది. రేషన్ బియ్యంతో దందా చేస్తూ లక్షలకు పడగలెత్తిన వ్యాపారి రెడ్ హ్యండ్‌గా దొరికాడు. సుమారు 15 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి లారీలో లొడు చేస్తున్న సమయంలో స్థానిక తహశీల్దార్ పరమేశం రెడ్‌హ్యాండెడ్‌గా దాడి చేసి, షాపును సీజ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు స్వయంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న జగదేవ్‌పూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం వ్యాపారం గుట్టుగా కొనసాగుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే ఉద్దేశంతో జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, అమ్మడం ప్రారంభించారు. జగదేవ్‌పూర్ మండలంతో పాటు, వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలు, నల్గొండ జిల్లా తుర్కపల్లి, రాజాపేట మండలాల నుంచి, రంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి కొందరు గిరిజనులు ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తూ మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారుల వద్ద కిలో రూ. 10ల చొప్పున విక్రయించేవారు. అయితే చట్ట ప్రకారం రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా నేరం. అయితే ఇక్కడి వ్యాపారులకు మాత్రం చట్టం చుట్టమే. ఎలా పట్టుకున్నారంటే.. జగదేవ్‌పూర్‌లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్ పరమేశంకు సమాచారం అందడంతో బుధవారం ఉదయం జగదేవ్‌పూర్ వచ్చారు. అక్కడ రోడ్డు పక్కనే బుద్ద చిన్న సత్యం దుకాణం వద్ద లారీలో బియ్యం లోడు చేస్తూ కనిపించడంతో అక్కడి వెళ్లారు. పరిశీలించి చూడగా అవి రేషన్ బియ్యంగా తేలింది. అప్పటికే లారీలో 60 క్వింటాళ్ల బియ్యం లోడు చేసి ఉంది. అలాగే దుకాణంలో తనిఖీలు చేయగా రాసి పోసిన బియ్యంతో పాటు సంచులలో బియ్యం కనిపించాయి. వెంటనే వాటిని కూడా సీజ్ చేశారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని మొత్తం తహశీల్దార్ సీజ్ చేశారు. వ్యాపారి జిమ్మక్కులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ పట్టుకొవడంతో సదరు వ్యాపారుడు అవి రేషన్ బియ్యం కావని.. మొత్తం నూకలంటూ తప్పించకునే ప్రయత్నం చేశాడు. అయితే బియ్యన్ని పరిశీలించి చూడగా కొన్ని నూకలు, పసుపు కలిపిన బియ్యంగా తహశీల్దార్ గుర్తించారు. జగదేవ్‌పూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు వ్యాపారికి వత్తాసు పలికే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో వ్యాపారి లొడు చేసిన లారీని తప్పించే ప్రయత్నం చేశారు. వెంటనే తహశీల్దార్ పరమేశం లారీని వెంటనే ఇక్కడికి తీసుకరావాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో లారీని ఘటన స్థలానికి రప్పించారు. దీంతో పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని గదిలోనే ఉంచి సీజ్ చేశారు. ఒకే లారీలో 60 క్వింటాళ్ల బియ్యం, గదిలో 60 పైగా రేషన్ బియ్యం పట్టుబడడంతో ఇవి ఒకే వ్యాపారికి చెందినవా.. లేక మరికొందరు దీని వెనుక ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహశీల్ధార్ పరమేశం మాట్లాడుతూ నమ్మ దగిన సమాచారం మేరకే దాడి చేసి రేషన్ బియ్యన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యంలో కొన్ని నూకలు, పసుపు కలిసిన బియ్యం ఉన్నట్లు చెప్పారు. సంగారెడ్డి ప్రాంతంలో బీరు కంపెనీలకు తరలిస్తున్నట్లు తెలిసిం దని వివరించారు. పట్టుకున్న బియ్యన్ని ఫోరెన్సిక్‌కు పంపించినట్లు తెలిపారు. -
'రైతులకు అండగా నిలుస్తాం'
-
డిఫెన్స్ మద్యం స్వాధీనం
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : అక్రమంగా విక్రరుుస్తున్న డిఫెన్స్ మద్యాన్ని హన్మకొండ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు కథనం ప్రకారం.. హన్మకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని ఒక ఇంట్లో డిఫెన్స్ మద్యం అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు పక్కాసమాచారం అందింది. దీంతో వారు ఆకస్మికంగా ఆ ఇంటిపై దాడులు చేసి, రూ.35 వేల విలువైన 40 ఫుల్‌బాటిళ్ల డిఫెన్స్ మద్యం పట్టుకున్నారు. దాడిలో పట్టుబడిన కాశిబుగ్గకు చెందిన పల్లె రాజును విచారించగా, హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీకి చెందిన తాటికొండ శ్రీనివాసులుతో కలిసి డిఫెన్స్ మద్యం ను అమ్ముతున్నట్లు వెల్లడించాడు. రక్షణ శాఖ వ్యక్తుల వద్ద నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. డిఫెన్స్ మద్యం అక్రమంగా కలిగి ఉండడం, అమ్మడం నేరమని సీఐ తెలిపారు. ఈ మద్యంపై ప్రభుత్వానికి రావాల్సిన సుంకం రానందున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంగా పరిగణిస్తామని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. దాడుల్లో సీఐ సిఐ గండ్రదేవేందర్రావుతోపాటు ఎస్సైలు రామకోటేశ్వర్రావు, సీతారామరాజు, సిబ్బంది రవీందర్, ఖలీ ల్, సత్తయ్య, సురేష్, రమేశ్ పాల్గొన్నారు. ఎన్డీపీ మద్యం సమాచారం తెలిస్తే 0870-2422652 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు. భీమారంలో మరో 55 మద్యం బాటిళ్లు.. భీమారం : భీమారంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరాలపై కేయూసీ పోలీసులు శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 55 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. భీమారానికి చెందిన ఉక్కు ప్రేమ్‌సాగర్ తనకు పరిచయస్తులైన ఆర్మీ జవాన్ల నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసేవాడు. ఇలా 55 బాటిళ్లు నిల్వ చేశాడు. అతడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారంతో కేయూసీ సీఐ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడులు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 35 రాయల్ స్టాగ్, 15 బ్లెండర్ స్ప్రైడ్, 5 సిగ్నిచర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయదారుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
160 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :లారీలో తరలిస్తున్న 160 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం పట్టణానికి సమీపంలోని సూర్యాసెమ్ వద్ద పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతోందంటూ విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు సీఐ వంశీధర్, డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో రామారావు సూర్యాసెమ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. దాచేపల్లి వైపు నుంచి గుంటూరు వైపు ఏపీ 7టిడి 3115 నంబరు గల లారీని సోదా చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీడ్రైవర్ అశోక్, యజమాని తోట మల్లయ్యలను విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాచేపల్లికి చెందిన వేముల శ్రీహరి, మందపాటి నరసింహారావు, ఒంటెల చంద్రశేఖర్ అలియాస్ చందు, నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన సురేష్, డ్రైవర్ అశోక్, యజమాని తోట మల్లయ్యలపై పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బియ్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ లారీపై జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇసుక మాఫియాపై దాడులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : నాగావళి, వంశధార నదీ తీర ప్రాంతాల నుంచి అనుమ తులు లేకుండా ఇసుకను అక్రమం గా తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిం చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాదారులపై దాడుల జోరు పెరిగింది. శని వారం జిల్లాలో పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు దాడులు చేసి ఇసుక రవాణాచేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీ సులకు అప్పగించారు. కొన్ని రోజుల నుంచి రెవెన్యూ, విజిలెన్స అధికారుల దాడులతో ఇసుక అక్రమ రవాణాకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. ఆరు ట్రాక్టర్ల పట్టివేత అనుమతులు లేకుండా నాగావళి నుంచి నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్, రెవెన్యూ పర్యవేక్షకులు శంకర్, అమర్నాథ్ దాడులు చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని బలగ ప్రాంతంలో హడ్కో కాలనీ వద్ద నాలుగు ట్రాక్టర్లు, రూరల్ మండలంలోని కళ్లేపల్లి వద్ద, కునుకుపేట వద్ద ఒక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. తమ్మినాయుడుపేట వద్ద ఐదు ట్రాక్టర్లు... ఎచ్చెర్ల క్యాంపస్ : జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తమ్మినాయుడు పేట నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను ఎచ్చెర్ల తహశీల్దార్ బి.వెంకటరావు సీజ్ చేశారు. వాటిని ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐదు రోజుల కిందట విజిలెన్స్ అధికారులు ఐదు ట్రాక్టర్లు పట్టుకున్నారు. వాటిలో కొన్ని ట్రాక్టర్లకు నంబర్లు కూడా లేవు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పది రోజుల నుంచి రెవెన్యూ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం యథాతథంగా సాగుతోంది. పోలాకిలో ట్రాక్టర్ పోలాకి : వంశధార నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు డిప్యూటీ తహశీల్దార్ టి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం రాత్రి రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వనిత మండలం వంశధార నది నుంచి ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేశామని, డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలాకి పోలీసులకు అప్పగించామన్నారు. ఇసుక తరలింపు గురించి పలుమార్లు ఇసుక ట్రాక్టర్ల యజమానులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో దాడులు చేశామన్నారు. దాడులు చేసిన వారిలో ఎస్ఐ అప్పలరాజు, ఆర్ఐ సంతోష్‌కుమార్, పోలీసులు ఉన్నారు. నేరడి బ్యారేజ్వద్ద... భామిని : భామిని మండలం నేరడి బ్యారేజ్, కాట్రగడ-బి గ్రామాల మధ్య శనివారం అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తహశీల్దార్ ఎం.సావిత్రి పట్టుకొని సీజ్ చేశారు. అనంతరం బత్తిలి పోలీసులకు ట్రాక్టర్‌ను అప్పగించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. నేరడి బ్యారేజ్ వద్ద వంశధార నదీ తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. తహశీల్దార్ చొరవతో తాత్కాలికంగా ఇసుక అక్రమ రవాణా నిలిచింది. -
17 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్:అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని విజిలెన్స్, సివిల్ సప్లయిస్ ఆధికారులు గురువారం సీజ్‌చేశారు. రూ. 3.40లక్షల విలువ చేసే 17 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఐదుగురు వ్యక్తులపై 6ఏ, క్రిమినల్ కే సులు నమోదుచేశారు. వివరాలిలా వున్నాయి.. ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన తోట ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, శివారెడ్డిలు బుధవారం రాత్రి మార్టూరు సమీప గ్రామాల్లో రేషన్ డీలర్లు, కార్డుదారుల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా తరలించేందుకు లారీలో లోడు చేశారు. గురువారం తెల్లవారుజామున మార్టూరు నుంచి బయలుదేరిన లారీ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చే సమయానికి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. లారీతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని జిల్లా విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. సుమారు రూ.3.40 లక్షల విలువచేసే 17టన్నుల రేషన్ బియ్యం 340 బ్యాగుల్లో ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మహబూబ్‌బాషాను విచారించగా బుధవారం మార్టూరు నుంచి సమీప గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని లారీలో లోడుచేసినట్లు అంగీకరించాడు. డ్రైవర్‌తోపాటు, యజమాని షేక్ హుస్సేన్, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన తోట ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, శివారెడ్డిలపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదుచేసి జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఎదుట హాజరు పరుస్తున్నట్లు విజిలెన్స్ తహశీల్దార్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఖాళీ లారీని అప్పగించారు. దాడులో సీటీడీటీ కుటుంబరావు, సిబ్బంది పాల్గొన్నారు.