డిఫెన్స్ మద్యం స్వాధీనం | Defense possession of alcohol | Sakshi
Sakshi News home page

డిఫెన్స్ మద్యం స్వాధీనం

Published Mon, Mar 17 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM

డిఫెన్స్ మద్యం స్వాధీనం

డిఫెన్స్ మద్యం స్వాధీనం

వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : అక్రమంగా విక్రరుుస్తున్న డిఫెన్స్ మద్యాన్ని హన్మకొండ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ ఎక్సైజ్ సీఐ గండ్ర దేవేందర్‌రావు కథనం ప్రకారం.. హన్మకొండ కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలోని ఒక ఇంట్లో డిఫెన్స్ మద్యం అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు పక్కాసమాచారం అందింది.
 
 దీంతో వారు ఆకస్మికంగా ఆ ఇంటిపై దాడులు చేసి, రూ.35 వేల విలువైన 40 ఫుల్‌బాటిళ్ల డిఫెన్స్ మద్యం పట్టుకున్నారు. దాడిలో పట్టుబడిన కాశిబుగ్గకు చెందిన పల్లె రాజును విచారించగా, హన్మకొండ కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీకి చెందిన తాటికొండ శ్రీనివాసులుతో కలిసి డిఫెన్స్ మద్యం ను అమ్ముతున్నట్లు వెల్లడించాడు. రక్షణ శాఖ వ్యక్తుల వద్ద నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు.
 
 డిఫెన్స్ మద్యం అక్రమంగా కలిగి ఉండడం, అమ్మడం నేరమని సీఐ తెలిపారు. ఈ మద్యంపై ప్రభుత్వానికి రావాల్సిన సుంకం రానందున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంగా పరిగణిస్తామని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
 
 దాడుల్లో సీఐ సిఐ గండ్రదేవేందర్‌రావుతోపాటు ఎస్సైలు రామకోటేశ్వర్‌రావు, సీతారామరాజు, సిబ్బంది రవీందర్, ఖలీ ల్, సత్తయ్య, సురేష్, రమేశ్ పాల్గొన్నారు. ఎన్‌డీపీ మద్యం సమాచారం తెలిస్తే 0870-2422652 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు.
 
 
 భీమారంలో మరో 55 మద్యం బాటిళ్లు..
 భీమారం : భీమారంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థావరాలపై కేయూసీ పోలీసులు  శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 55 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. భీమారానికి చెందిన ఉక్కు ప్రేమ్‌సాగర్ తనకు పరిచయస్తులైన ఆర్మీ జవాన్ల నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసేవాడు.
 
 ఇలా 55 బాటిళ్లు నిల్వ చేశాడు. అతడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారంతో కేయూసీ సీఐ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడులు చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 35 రాయల్ స్టాగ్, 15 బ్లెండర్ స్ప్రైడ్, 5 సిగ్నిచర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయదారుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement