
అగర్తల: బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురిని త్రిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీయులను ఆదివారం త్రిపురా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్‌స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు.
‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ ప్రారంభించాం. వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు.
అరెస్ట్ అయిన ఐదుగురు బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి డివిజన్‌లోని చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లా పౌరులు భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment