
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది పంజాబీ యువకులు గల్లంతయ్యారు. వీరిలో 6 మంది బహమాస్ ద్వీపం నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ గల్లంతుకాగా, మరో 9 మంది మెక్సికో–అమెరికా సరిహద్దు గుండా ప్రవేశించే ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాత్నం చాహల్ తెలిపారు. యువకులను అమెరికాకు పంపేందుకు ఢిల్లీలోని ఓ ఏజెంట్‌కు రూ. 19.5 లక్షలు ఇచ్చారని చాహల్ ఆరోపించారు. అమెరికా వెళ్లిన తర్వాత యువకులతో మాట్లాడేందుకు మరో రూ. 45 లక్షలు మరి కొంత మంది ఏజెంట్లకు ఇచ్చారని తెలిపారు. వారు మెక్సికో చేరిన తర్వాత నుంచి యువకుల నుంచి అసలు సమాచారమే లేదని తెలిపారు. వారిని కనుక్కునే ప్రయత్నం చేయాలంటూ చాహల్ భారత ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment