entering
-
అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం.. అన్నతో సవాలుకు సిద్ధం!
అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా సోదరుడు ముఖేష్ అంబానీకి సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీకి సంబంధించిన ప్రణాళికలను ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతం ఏటా 2,50,000 వాహనాల ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యంతో ఈవీ ప్లాంట్‌ను నిర్మించడానికి అయ్యే ఖర్చు సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఏటా 7,50,000 వాహనాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ కార్లతో పాటు బ్యాటరీ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశీలిస్తోంది. 10 గిగావాట్ హవర్స్ (GWh) సామర్థ్యంతో ప్రారంభించి, వచ్చే దశాబ్దంలో 75 గిగావాట్ హవర్స్‌కి విస్తరించాలనేది కంపెనీ ప్రణాళిక అని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.దీనిపై కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ ఈ వార్తలు ఇప్పటికే ప్రభావం చూపాయి. రాయిటర్స్ కథనం తర్వాత, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు దాదాపు 2% పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమై ముందుకు సాగితే, ఇప్పటికే ఈవీ మార్కెట్లో పురోగతి సాధిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ప్రత్యక్ష పోటీని ఇవ్వవచ్చని భావిస్తున్నారు. -
జార్వో... దూసుకొచ్చాడు మళ్లీ!
ఇంగ్లండ్‌కు చెందిన తుంటరి అభిమాని జార్వో మళ్లీ హద్దు మీరాడు. టీమిండియా డ్రెస్ వేసుకొని హల్చల్ చేస్తున్నాడు. ఇది ఒకసారైతే సరదాగా అనిపించినా... పదేపదే మైదానంలోకి దూసుకొస్తుండటం, ఆటగాళ్లను చేరుకోవడం, తాకటం క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. లార్డ్స్, లీడ్స్ వేదికల్లో జార్వో భారత ఆటగాడి వేషంతో మైదానంలోకి దిగాడు. అతని చేష్టలెంతగా ఉన్నాయంటే జట్టు సభ్యుడే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇక ‘ది ఓవల్’లో అయితే అతని తుంటరితనం పరాకాష్టకు చేరింది. ఈసారి ఏకంగా బౌలింగ్ చేయడానికే వచ్చాడు. భౌతిక దూరం పాటించాల్సిన కరోనా కాలంలో ఇలా బయటి వ్యక్తులు ఆటగాళ్లను తాకడం ఏంటని పలువురు క్రికెటర్లు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జార్వో చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. అతనిపై ఫిర్యాదు చేయడంతో సౌత్ లండన్ పోలీసులు జార్వోను అరెస్టు చేసినట్లు సమాచారం. -
యజమాని ప్రాణాలను కాపాడిన పిల్లి.. నాలుగడుగుల పాముతో..
భువనేశ్వర్: సాధారణంగా కొంత మంది మూగజీవాలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే.. కుక్కలు, పిల్లులు.. తదితర జీవులను తమ ఇంట్లో పెంచుకొని కుటుంబంలో ఒకటిదానిలా చూసుకుంటారు. అవి మనుషుల కన్నా విశ్వాసంగా ఉంటాయని నమ్ముతుంటారు. అయితే, ఒక్కొసారి ఆ పెంపుడు జీవులు తమ యజమానికి ఏదైనా ఆపద సంభవిస్తే తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని కపిలేశ్వర్కు చెందిన సంపద్ కుమార్ పరిడా ఒక పిల్లిని పెంచుకున్నారు. దాన్ని ప్రేమతో చినుఅని పిలుచుకునే వారు. దాన్ని తమ కుటుంబంలో ఒకదానిగా చూసుకునేవారు. ఒకటిన్నర సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటున్నారు. అది ఇళ్లంతా తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు.. పెరడు నుంచి ఒక నాగుపాము ఇంట్లో ప్రవేశించడాన్ని చిను గమనించింది. వెంటనే అరుచుకుంటూ వెళ్లి పాముకు ఎదురుగా నిలబడింది. అంతటితో ఆగకుండా.. అరుస్తు పామును తన పంజాతో కొట్టసాగింది. పిల్లి అరుపులు విన్న సంపద్ కుమార్ అక్కడికి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అక్కడ నాలుగడుగుల పాముతో తమపిల్లి పోరాటం చేస్తుంది. అవి రెండు పరస్పరం దాడిచేసుకుంటున్నాయి. పాము ఎంత బుసలు కొడుతున్నా.. పిల్లి ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పామును చూసి భయపడిపోయిన సంపద్ వెంటనే స్నేక్ హెల్ప్ సోసైటీ వారికి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో, దాదాపు అరగంట పాముని ఇంట్లో ప్రవేశించకుండా.. చిను పోరాటం చేస్తునే ఉంది. సంపత్ కుమార్ పిల్లి, పాముల పోరాటాన్ని తన మొబైల్లో ఫోటోలు తీసుకున్నాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ సొసైటీవారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ తర్వాత తన ఆ క్లిప్పింగ్‌లను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ రోజు తాము ఉన్నామంటే దానికి తమ పెంపుడు పిల్లి చిను మాత్రమే కారణమని తెలిపాడు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది. -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 15 మంది గల్లంతు
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది పంజాబీ యువకులు గల్లంతయ్యారు. వీరిలో 6 మంది బహమాస్ ద్వీపం నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ గల్లంతుకాగా, మరో 9 మంది మెక్సికో–అమెరికా సరిహద్దు గుండా ప్రవేశించే ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాత్నం చాహల్ తెలిపారు. యువకులను అమెరికాకు పంపేందుకు ఢిల్లీలోని ఓ ఏజెంట్‌కు రూ. 19.5 లక్షలు ఇచ్చారని చాహల్ ఆరోపించారు. అమెరికా వెళ్లిన తర్వాత యువకులతో మాట్లాడేందుకు మరో రూ. 45 లక్షలు మరి కొంత మంది ఏజెంట్లకు ఇచ్చారని తెలిపారు. వారు మెక్సికో చేరిన తర్వాత నుంచి యువకుల నుంచి అసలు సమాచారమే లేదని తెలిపారు. వారిని కనుక్కునే ప్రయత్నం చేయాలంటూ చాహల్ భారత ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నమ్మలేక పోతున్నా
సరిగ్గా పదకొండేళ్ల క్రితం హీరో రామ్‌చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయ్యింది. అంటే రామ్‌చరణ్ ఇండస్ట్రీలో పదకొండు సంవత్సరాలను పూర్తి చేశారు. ‘మగధీర, ఎవడు, ధృవ, రంగస్థలం’ వంటి సినిమాలతో నటునిగా తనదైన పేరు సంపాదించుకున్నారు. ‘‘నేను సినిమా పరిశ్రమలోకి వచ్చి అప్పుడే పదకొండేళ్లు పూర్తయ్యా యంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే నటించడం స్టార్ట్ చేశాననే ఫీలింగ్ కలుగుతోంది. నా ఈ జర్నీలో భాగమైన నా దర్శకులు నిర్మాతలతో పాటు మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు రామ్‌చరణ్. అలాగే ఇప్పటి వరకు తను నటించిన సినిమాల పోస్టర్స్ అన్నింటినీ కలిపి ఓ ఫొటోలా తయారు చేసి, ఫేస్బుక్లో షేర్ చేశారు చరణ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. -
'పురుషులు వెళ్లే ప్రతి చోటికి.. మహిళలు వెళ్లొచ్చు'
ముంబై : మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్‌లో ఉన్న శనిదేవునిఆలయంలో మహిళల ప్రవేశంపై బాంబే హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. పురుషులు వెళ్లే ప్రతిచోటికి మహిళలు వెళ్లొచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. మహిళలను ఆలయాల్లో ప్రవేశించకూడదని చట్టంలో ఎక్కడాలేదని తెలిపింది. ఏప్రిల్ 1న శని సింగ్నాపూర్ విషయమై మరోసారి విచారణ చేపట్టనుంది. అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా తెలపాలని ఆదేశించింది. విద్యా బాల్, నీలిమా వార్త అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు మహిళల ఆలయ ప్రవేశ నిరాకరణపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమని, ఇలా చేయడం మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయిదొందల ఏళ్లకు పైగా చరిత్రగల ఈ ఆలయంలో శనిదేవునికి మహిళలు పూజలు చేయడం నిషేధం. దీన్ని ఇటీవల ఒక మహిళ ఉల్లంఘించి పూజలు చేయడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు