
ఇంగ్లండ్‌కు చెందిన తుంటరి అభిమాని జార్వో మళ్లీ హద్దు మీరాడు. టీమిండియా డ్రెస్ వేసుకొని హల్‌చల్ చేస్తున్నాడు. ఇది ఒకసారైతే సరదాగా అనిపించినా... పదేపదే మైదానంలోకి దూసుకొస్తుండటం, ఆటగాళ్లను చేరుకోవడం, తాకటం క్రికెటర్ల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది. లార్డ్స్, లీడ్స్ వేదికల్లో జార్వో భారత ఆటగాడి వేషంతో మైదానంలోకి దిగాడు. అతని చేష్టలెంతగా ఉన్నాయంటే జట్టు సభ్యుడే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఇక ‘ది ఓవల్’లో అయితే అతని తుంటరితనం పరాకాష్టకు చేరింది. ఈసారి ఏకంగా బౌలింగ్ చేయడానికే వచ్చాడు. భౌతిక దూరం పాటించాల్సిన కరోనా కాలంలో ఇలా బయటి వ్యక్తులు ఆటగాళ్లను తాకడం ఏంటని పలువురు క్రికెటర్లు భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జార్వో చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. అతనిపై ఫిర్యాదు చేయడంతో సౌత్ లండన్ పోలీసులు జార్వోను అరెస్టు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment