
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
పెద్దపల్లి: పెద్దపల్లి నుంచి గజ్వేల్‌కు అక్రమంగా తరలిస్తున్న 19 ఆవులను గోమాత రక్షక్ సేన సభ్యులు పట్టుకున్నారు. డీసీఎం వ్యానులో మొత్తం 19 ఆవులు ఉండగా రెండు ఆవులు మృతిచెందాయి. మరో మూడు ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. వీటిని వదశాలకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గోమాత రక్షక్ సేన సభ్యులు పోలీసులకు చేరవేశారు.