Three indians
-
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. పట్టుబడ్డ భారతీయులు
వాషింగ్టన్: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు భారతీయులు సహా నలుగురు అక్కడి అధికారులకు పట్టుబడ్డారు. కెనడాలో గూడ్స్ రైలెక్కిన వీరు ఈ నెల 12న సరిహద్దులు దాటాక బఫెలో నగరంలోని ఇంటర్నేషనల్ రైల్రోడ్ బ్రిడ్జి వద్ద కదులుతున్న రైలు నుంచి కిందికి దూకారు. ఆ క్రమంలో నలుగురిలో ఒక మహిళ గాయపడింది. ఆమెతోపాటు మిగతా ముగ్గురినీ అనంతరం సరిహద్దు గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. వీరు ఎలాంటి పత్రాలు లేని అమెరికాయేతర పౌరులని చెప్పారు. ఇందులో మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు భారతీయ పౌరులు కాగా, నాలుగో వ్యక్తిని డొమినికల్ రిపబ్లిక్ దేశస్తుడిగా గుర్తించామన్నారు. -
చేపల పడవలో దేశాలే దాటారు
ముంబై: పరాయి దేశంలో పడరాని పాట్లు పడి, యజమాని పెట్టే హింసలు భరించలేక స్వదేశం వెళ్లే సాహసం చేశారు ముగ్గురు భారతీయులు. అనుకున్నదే తడవుగా యజమాని పడవనే తమ ప్రణాళికకు ప్రధాన ఆయుధంగా వాడుకున్నారు. ఎవరికీ చెప్పకుండా దొంగచాటుగా కువైట్ నుంచి బయల్దేరి సముద్ర మార్గం గుండా నేరుగా ముంబై తీర ప్రాంతానికి చేరుకున్నారు. పుట్టినగడ్డపై కాలుమోపేలోపే పోలీసులు అరెస్ట్‌చేశారు. ముగ్గురు తమిళనాడు వ్యక్తుల సాహసోపేత అక్రమ అంతర్జాతీయ సముద్ర ప్రయాణ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో అరేబియా సముద్ర జలాల మీదుగా ముంబైలో అడుగుపెట్టిన పాక్ ముష్కరులు మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో సముద్రజలాల మీద గస్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం ఉదయం ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. సంబంధిత వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. జనవరి 28న ప్రయాణం షురూ తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల విజయ్ వినయ్ ఆంటోనీ, 29 ఏళ్ల జె.సహాయట్ట అనీశ్, రామనాథపురానికి చెందిన 31 ఏళ్ల నిట్సో డిటోలు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. వీరి వృత్తి చేపలుపట్టడం. కువైట్‌లోనూ అదే పనిచేసేవారు. కేరళలోని త్రివేండ్రమ్ నుంచి వీరు కువైట్‌కు వెళ్లారు. యజమాని నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. భారత్‌కు రానీయకుండా వారి పాస్‌పోర్టులను దాచేశాడు. ఎలాగైనా కువైట్ నుంచి బయటపడాలని నిర్ణయించుకుని అందుకు ఓనర్ చేపల బోటును ఎంచుకున్నారు. జనవరి 28వ తేదీన ప్రయాణం మొదలెట్టి సౌదీ అరేబియా, ఖతర్, దుబాయ్, మస్కట్, ఒమన్, పాకిస్తాన్ మీదుగా భారత జలాల్లోకి ప్రవేశించారు. రంగంలోకి నేవీ, పోలీసులు మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ముంబైలోని యెల్లో గేట్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేపట్టారు. ససూన్ డాక్ ప్రాంతంలో వీరి రాకను గమనించారు. ఈ చేపల పడవ నిర్మాణం భారతీయ పడవలతో పోలిస్తే విభిన్నంగా ఉండటంతో అనుమానమొచ్చి అడ్డుకున్నారు. అందులోని ముగ్గురికీ మరాఠా, హిందీ అస్సలు రాకపోవడం, పొడిపొడిగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నేవీ అధికారులతోపాటు పోలీసులు మూడు పడవల్లో హుటాహుటిన చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది సైతం రప్పించి తనిఖీలు చేయించారు. పేలుడుపదార్థాలు ఏవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించారంటూ పాస్‌పోర్టు సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదుచేసి అరెస్ట్‌చేశారు. ముంబైలోని కోర్టులో హాజరుపరచగా ఫిబ్రవరి 10వ తేదీదాకా పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. విదేశీ గడ్డపై వీళ్లు ఏదైనా నేరానికి పాల్పడ్డారో తెల్సుకోండని పోలీసులకు సూచించారు. పడవలో జీపీఎస్ స్వాధీనం చేసుకున్న పడవను బాంబు స్వా్కడ్ క్షుణ్ణంగా తనిఖీచేసింది. ఒక జీపీఎస్‌ను గుర్తించారు. సువిశాల సముద్రంలో దారి తప్పకుండా ఉండేందుకు వారు జీపీఎస్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీళ్లను కువైట్‌కు తీసుకెళ్లిన ఏజెంట్‌ను కెప్టెన్ మదన్‌గా పోలీసులు గుర్తించారు. ‘‘అబ్దుల్లా షర్హీద్ అనే మాస్టర్ దగ్గర పనిచేసేవాళ్లం. జీతాలు సరిగా ఇచ్చేవాడు కాదు. అదేంటని అడిగితే చితకబాదేవాడు. ఇదే విషయమై కువైట్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. ఇండియన్ ఎంబసీలోనూ మా గోడు వెళ్లబోసుకున్నాం. ఫలితం శూన్యం. అందుకే ఇలా పారిపోయి వచ్చాం’’అని ఈ ముగ్గురు పోలీసులకు చెప్పారు. వీళ్ల కుటుంబీలకు ఇప్పటికే వీరి రాక సమాచారం చేరవేశామని పోలీసులు వెల్లడించారు. -
కోవిడ్ మృతులు 1,500
బీజింగ్/టోక్యో/న్యూఢిల్లీ: చైనాలో ప్రమాదకర కోవిడ్–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్న హుబే ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. అదేవిధంగా, చైనాలోని 31 ప్రావిన్స్‌ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్‌లోనివే కావడం గమనార్హం. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య గురువారానికి 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా ప్రకటించింది. జపాన్ ఓడలో ముగ్గురు భారతీయులకు.. కోవిడ్–19 వైరస్ అనుమానంతో జపాన్ తీరంలో నిలిపేసిన ఓడలోని 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని కోవిడ్ నెగటివ్‌గా నిర్ధారించిన 11 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్ అధికారులు శుక్రవారం బయటకు పంపించారు. టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్‌తో మృతి చెందినట్లు జపాన్ తెలిపింది. భారత్‌లో పరిస్థితి అదుపులోనే.. దేశంలో కోవిడ్ (కరోనా) వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు. చైనాలోని వుహాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
-
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్‌ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్‌కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు. పీజీ చదువుతున్న ఆన్సీ.. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్‌తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్‌చర్చ్‌లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్‌కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. -
ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ట్రంప్ ముందుగానే ప్రకటించినప్పటికీ, నామినేషన్లను బుధవారమే శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు పంపారు. ఇప్పటికవరకు మొత్తంగా ట్రంప్ 35 మందికి పైగా భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు. బరన్వాల్ కొత్త బాధ్యతల్లో భాగంగా అణు ఇంధన కార్యాలయ పాలనా వ్యవహారాలతో పాటు, అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి విభాగం, మౌలిక సదుపాయాల విభాగ యాజమాన్య బాధ్యతలు కూడా చూడాల్సి వుంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ డైరెక్టర్‌గా, మెటీరియల్స్ టెక్నాలజీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. అమెరికా నౌకాదళ రియాక్టర్లకు అవసరమైన అణు ఇంధన మెటీరియల్‌పై పరిశోధన జరిపారు. ఇక యేల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆదిత్యకు సివిల్ ప్రొసీజర్, పాలనాపరమైన శాసనాలు, ఫెడరల్ కోర్టులు, జాతీయ భద్రతా చట్టం, కంప్యూటర్ సంబంధిత నేరాలపై బోధన జరిపిన, రచనలు చేసిన అనుభవముంది. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ అంటోనిన్ స్కలియా వద్ద, అప్పీల్స్ కోర్టు (ఆరవ సర్క్యూట్) జడ్జి జెఫ్రీ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా న్యాయశాఖలో అటార్నీ అడ్వయిజర్‌గా, ప్రైవేటు రంగంలో అప్పిలేట్ అటార్నీగా కూడా పని చేశారు. మూడో వ్యక్తి బిమల్ పటేల్ ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వ వ్యవహారాల పర్యవేక్షణ మండలికి సంబంధించిన ట్రెజరీలో డిప్యూటీ అసిస్టెంటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పలు సంస్థలకు సలహాలిచ్చిన అనుభవముంది. తొలి దక్షిణాసియా వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో చోటు దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ కమిటీ బాధ్యత. కృష్ణమూర్తి (45) ప్రస్తుతం ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణమూర్తిని కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్లు సభాపతి న్యాన్సీ పెలోసీ బుధవారం ప్రకటించారు. కృష్ణమూర్తి ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయనకు మూడు మాసాల వయసున్నప్పుడే ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలో స్థిరపడింది. -
భారతీయులకు గోల్డెన్ చాన్స్
ముగ్గురు భారతీయులకు బ్రహ్మాండమైన గోల్డెన్ చాన్స్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన విద్యావేత్తలు, సామాజికంగా నిబద్ధత కలిగిన 55 మందిని ఎంపిక చేసి వారికి ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్షిప్స్ ప్రకటించగా, ఆ జాబితాలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. సాగ్నిక్ దత్తా, సంపూర్ణ చక్రవర్తి, మాళవికా నాయర్.. ఈ ముగ్గురికీ ఆ స్కాలర్షిప్ లభించింది. 30 దేశాలకు చెందిన 55 మంది విజేతలు 68 యూనివర్సిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం విజేతల్లో 36 మంది మహిళలు కాగా, 19 మంది మాత్రమే పురుషులున్నారు. సాగ్నిక్ దత్తా ఆరేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేసి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో చదువుతున్నారు. ఆమె ఇప్పుడు ఈ స్కాలర్‌షిప్‌తో రాజకీయాలు, అంతర్జాతీయ పరిశోధనలో పీహెచ్డీ చేస్తారు. సంపూర్ణ చక్రవర్తి ఫార్మకాలజీలో పీహెచ్డీ చేయనున్నారు. ప్రధానంగా ఆర్థరైటిస్ నొప్పులకు మందు కనుక్కోవడంపై ఆమె దృష్టిపెడతారు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చేసేంఉదకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో మాళవికా నాయర్ చేరారు. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్డీ చేయనున్నారు. -
3 మృతదేహాలు ఢీల్లీకు తరలింపు
-
అమెరికా స్కాంలో ముగ్గురు భారతీయులు
న్యూయార్క్: ఆరోగ్యబీమా కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులను అమెరికా ఫెడరల్ జ్యూరీ దోషులుగా నిర్ధారించింది. 2008 జూలై నుంచి 2011 సెప్టెంబర్ మధ్యకాలంలో చోటుచేసుకున్న సుమారు 15మిలియన్ డాలర్ల కుంభకోణంలో వైద్యవృత్తిలో ఉన్న షహజాద్ మీర్జా, జిగర్ పటేల్ అనేవ్యక్తులతోపాటు వైద్యుడిగా ప్రాక్టీస్ చేయడానికి తగిన లెసైన్స్‌లేని శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తులకు ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ అయిందని సహాయ అటార్నీ జనరల్ డేవిడ్ ఓనిల్ తెలిపారు. ఆరోగ్యబీమా సంస్థకు వీరు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారన్నారు. వీరిలో శ్రీనివాసరెడ్డి రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందించినట్టు తప్పుడు క్లెయిమ్‌లు సమర్పించారన్నారు. పటేల్, మీర్జాలు వైద్యసేవలు అందించకుండానే తప్పుడు క్లెయిమ్‌లతో నిధులు రాబట్టుకునేవారని, ఇందులో పటేల్ ఎంఐ హెల్త్‌కేర్ అనే తన సంస్థద్వారా మోసాలకు పాల్పడ్డారని డేవిడ్ ఓనిల్ వివరించారు.