ఇందిరమ్మ గృహాలపై విచారణ
Published Thu, Nov 7 2013 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకొని వాటిని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందాయి. వారి ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను తీసుకొని స్కానింగ్ చేసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో ఇందిరమ్మ మొదటివిడతలో 515మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారని చెప్పారు. 45 గృహాల లబ్ధిదారులు వాటిని విక్రయించినట్లు జిల్లా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. వారి ఆదేశాల మేరకు సమగ్రంగా విచారణ జరిపి గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు నమోదుచేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు వర్క్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, అనిల్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
Advertisement