indiramma
-
డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులెవ్వరూ బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దని, ఈ ఏడాది డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో కొల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, పార్లమెంటులో నోరు తెరవకపోయినా కేసీఆర్‌ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని, అయినా పాలమూరు ప్రజలను కేసీఆర్ వంచించారని విమర్శించారు. పాలమూరు ప్రజానీకం ఈసారి జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, పాలమూరులో 14కు 14 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 100 స్థానాలు ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి ప్రతి తలుపు తట్టాలని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.500కే మహిళలకు వంటగ్యాస్ సిలెండర్ అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. -
సమస్యల్లో ఇందిరమ్మ
కావలిఅర్బన్: పట్టణంలోని ముసునూరులో ఇందిరమ్మ పేరుతో కాలనీ ఉంది. గొప్ప నాయకురాలి పేరు మీద ఉన్న ఈ కాలనీ ప్రజలు మాత్రం నిత్యం సమస్యల చుట్టూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు గడచిన ఐదేళ్లుగా కాలనీ అభివృద్ధిపై కనికరం కూడా చూపలేదు. ముసునూరులోని ఇందిరమ్మ కాలనీలో సుమారు 5 వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాలనీలో సుమారు 15,00 మంది ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టణంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అన్ని కాలనీలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఆయన అకాల మరణం చెందారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వారిపైన నిర్లక్ష్యం ప్రదర్శించాయి. రూ. కోట్లాది మున్సిపల్ నిధులను అధికారపార్టీ ప్రజాప్రతినిధుల వార్డులలో వెచ్చించుకుంటున్నారు. బాగున్న రోడ్లపైనే రోడ్లు వేసుకుంటూ ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చూపారు. మౌలిక వసతుల కొరత కాలనీ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు దాటుతున్నా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదు. ఇళ్లు కట్టుకుని ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఇళ్లలోకి కాపురాలు వచ్చారు. కాని ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని కుటుంబాలు అక్కడ జీవించలేక తిరిగి కావలికి వెళ్లి బాడుగ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాలనీలో రోడ్లు నిర్మించాలని స్థానికులు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అదేవిధంగా తాగునీరు కల్పించాలని కోరారు. డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం, శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని కోరారు. కాలనీలో ఒక బోరు మాత్రమే పనిచేస్తుంది. దాని నుంచి అనేక కుటుంబాల ప్రజలు నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి ఆ నీరు కూడా రాదని అంటున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు దక్షిణ బజారులో ఒక బోరు నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఇంకా అనేక వసతులు కల్పించాలని మొర పెట్టుకున్నా అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదు. మరమ్మతుకు నోచుకోని బోర్లు కాలనీలో కొన్ని బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వలన విషసర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న కాలనీలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాటు చేయాల్సి ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సున్నా కాలనీలో నివశిస్తున్న నిరుపేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంజూరు చేయడంలేదు. ఇందిరమ్మ కాలనీలో ఉన్నవారికి వీటిని వర్తింపజేయడంలేదంటూ వాపోతున్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు పథకాలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న వార్డులలో మాత్రమే అభివృద్ధి పథకాలను అందజేస్తున్నారంటూ వాపోతున్నారు. అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గకుండా అర్హులైన పేదలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించాలని కోరారు. రోడ్లు నిర్మించండి ఇందిరమ్మ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీధులు గుంతలమయంగా ఉన్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు నిర్మించి ఆదుకోండి. – పోట్లూరు రవి, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి దక్షిణ బజారులో బోరు నిర్మించండి కాలనీలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. భూగర్భ జలాలు అడుగంటుతాయి. తాగునీటి సరఫరా అంతంత మాత్రం గానే ఉంటుంది. దక్షిణ బజారులో బోరు నిర్మిస్తే కొంతవరకు తాగునీటి సమస్య తొలగుతుంది. –ఎస్కే ఖాలీబీ, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, కావలి -
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
సాక్షి,నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ పట్టణంలోని 15వ వార్డులో గల సతీష్‌నగర్, క్రాంతినగర్, గొల్లగూడ ప్రాంతాల్లో పర్యటించారు. ఓటర్లను పలకరిస్తూ తనకు ఓటేసి గెలిపిం చా లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రావడం ఖాయమని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నిం టినీ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే మున్సిపాటీల్లో అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటికి పైసా నిధులను ఇవ్వడంలేదని విమర్శించారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యమై గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 40శాతం ప్రాజెక్టులు పూర్తి చేశామని నాపై ఉన్న కోపంతో సీఎం కేసీఆర్ ఎస్ఎల్బీసీ సొరంగం, బి.వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదన్నారు. ఇంది రమ్మ రాజ్యంలోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుం దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, కౌన్సిలర్ అల్లి నర్సమ్మ, కేసాని కవతి, మందడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అల్లి సుభాష్, వేణు, కంచి మధు, జూలకంటి శ్రీనివాస్, చింతమల్ల వెంకటయ్య శంకర్, షమీ, సతీష్, వంశీ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ బిల్లులు చెల్లించేలా కృషి
వెల్మగూడెం(పెద్దవూర) : ప్రభుత్వం మెడలు వంచైనా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు ఇప్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో విషయాన్ని లేవనెత్తి రెండు, మూడు నెలల్లో చెల్లించేలా కృషి చేస్తానని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని వెల్మగూడెంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి సగంలో ఆగిపోయిన ఇళ్ల బిల్లులు చెల్లించమంటే ఈ ప్రభుత్వం సాకులు చెబుతూ డబుల్, త్రిబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామంటూ దాటవేస్తుందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు దేవుడెరుగు పెండింగ్‌లో ఉన్న బిల్లులనైనా చెల్లించాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రాంతంలో కొందరు స్వప్రయోజనాలకో, వ్యక్తిగతంగానో, కసి కోసమో, కక్ష కోసమో తగవులు పెట్టడానికి చూస్తున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా యువత గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నాటి సీఎం ఎన్టీ రామారావును ఒప్పించి, మెప్పించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్, తాగు, సాగునీటితో పాటు 80 శాతం ఇళ్లు నిర్మాణం చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లోనెలకొల్పిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వెల్మగూడెంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాచిరెడ్డి మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ కురాకుల అంతయ్యయాదవ్, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, డీవీఎన్‌రెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, నరాల కొండయ్య, నారాయణరెడ్డి, కిషన్‌రావు, సీహెచ్. వెంకటేశ్వర్లు, ఇంద్రకిరణ్, దేవేందర్‌రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, దినేష్‌నాయక్, సక్రు, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ బిల్లు బకాయిలకు లైన్‌క్లీయర్
కర్నూలు(అర్బన్): ఇందిరమ్మ గహ నిర్మాణ పథకం మూడు విడతలు, రచ్చబండ, జీఓ నెంబర్ 171 కింద నిలిచి పోయిన గహ నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని గహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ రాజశేఖర్ తెలిపారు. వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు రూ.5.09 కోట్లు పెండింగ్‌లో ఉండగా ఆగష్టులో రూ.4.71 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. మిగతా మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. బీఎల్, బీబీఎల్ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ జాబితాలో 27,473 నిర్మాణాలున్నాయని, వీటికి దాదాపు రూ.14.96 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి 10రోజుల్లోగా అర్హుల జాబితా రూపొందించి పంపితే బిల్లు మంజూరవుతుందని పీడీ తెలిపారు. -
రూ.250 కోట్ల భారం
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు బ్రేక్ అర్ధాంతరంగా 39,336 ఇళ్లు పూర్తి కావాలంటే రూ.250 కోట్లు అవసరం అప్పులు, ఆర్థిక ఇబ్బందుల్లో లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ముకరంపుర: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతో లబ్దిదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. సొంతింటిపై ఆశతో ఆస్తులు అమ్మి, అప్పుల చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా జిల్లాలో మంజూరైన 39,336 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటికోసం గతంలో మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులు లబ్దిదారులకు చెల్లించకుండా పెండింగ్‌లోనే ఉంచారు. ప్రస్తుతం ఆయా ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావాలంటే రూ.450 కోట్లు అవుతుందని అధికారుల అంచనా. ఈ నిధులను మంజూరు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు కన్పిస్తుండడంతో ఆ భారమంతా లబ్దిదారులపైనే పడే అవకాశముంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, ఇతర వర్గాలకు రూ.75వేలుగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లాలో 2006 నుంచి 2014 వరకు వివిధ దశల్లో 3,16,538 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 1,78,491 ఇళ్లు పూర్తికాగా, మరో 39,336 ఇళ్లు నిర్మాణ దశలో వున్నాయి. ఇప్పటి వరకు 98,711 ఇళ్లు ప్రారంభానికే నోచుకోలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభానికి నోచుకోని 98,711 ఇళ్లను రద్దు చేసింది. కానీ నిర్మాణ దశలో ఉన్న 39,336 ఇళ్లను పూర్తి చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది. ఇప్పటికే కొన్ని ఇళ్లకు ఒక బిల్లు, ఇంకొన్ని ఇళ్లకు రెండు బిల్లులు, మరికొన్ని ఇళ్లకు మూడు బిల్లులు వచ్చి ఆగిపోయాయి. ఇంకొంత మంది లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఒక్క బిల్లు కూడా రాలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులు మంజూరు చేయాలని లబ్దిదారులు గత కొన్ని నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సిమెంట్, స్టీల్, కూలీ ధరల పెంపు కారణంగా ఇళ్ల నిర్మాణాలు లబ్దిదారులకు తలకు మించిన భారమయ్యాయి. అవినీతిపై నివేదికలేవి? ఇందిరమ్మ ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని తెలంగాణ ప్రభుత్వం సీఐడీతో విచారణ నిర్వహించింది. విచారణ పూర్తయినప్పటికీ నివేదికలు బహిర్గతం కాలేదు. మరోవైపు పేదలకు 125 గజాల స్థలంలో రూ.4లక్షలతో డబుల్ బెడ్రూంతో కూడిన ఇంటిని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లింపు విషయమై వెనుకడగు వేస్తోంది. అయితే సీఐడీ విచారణ పూర్తయినప్పటికీ అటు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, ఇటు తమకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తుండడం పట్ల లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలు డబుల్బెడ్రూం కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామ సందర్శన, మన ఊరు ప్రణాళికలతో పాటు ప్రజావాణితో కలిపి జిల్లాలో లక్షకు పైగా దరఖాస్తులు సమర్పించారు. ఈ విషయమై హౌసింగ్ పీడీ నర్సింగరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ బిల్లులు ఆగిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రభుత్వం నిధులిస్తే లబ్దిదారులకు బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. మాకు వెలిచాల, మల్కాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. పుస్తెలమ్మి, అప్పులు తెచ్చి ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టినం. బిల్లులు సక్కర రాక, సొంతంగా కడుదామంటే పైసల్లేక మధ్యలోనే ఆపేసినం. సొంతిండ్లు లేక కరీంనగర్లో వేల రూపాయలు పెట్టి కిరాయి ఇండ్లళ్ల ఉంటున్నం. కూలీనాలి చేసుకునేటోళ్లం.. కిరాయిలు కట్టలేకపోతున్నం. మేం కట్టుకున్న ఇండ్ల దగ్గర తాగటానికి నీళ్లు లేవు. కరెంటు లేదు. అవన్నా ఇస్తే అక్కడనే ఉండడానికి సిద్ధంగా ఉన్నం. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టు తిరుగవట్టి ఐదేండ్లయితుంది. మాకు మిగిలిన బిల్లులు మంజూరు చేస్తే ఇండ్లు పూర్తి చేసుకుంటం. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామంటున్న సర్కారు మధ్యలో ఆగమైన మా బతుకుల గురించి పట్టించుకోవాలె. - ఇదీ ఇందిరమ్మ లబ్దిదారుల గోడు... గ్రీవెన్స్‌సెల్‌లో పలువురు మహిళలు కలెక్టర్‌కు విన్నవించుకున్న తీరు. -
‘ఇందిరమ్మ’ అవినీతిపై విచారణ
తిమ్మాపూర్ (చందంపేట) : ఇందిరమ్మ పథకం కింద 2004 - 2009 సంవత్సరాల మధ్య లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపులో జరిగిన అవినీతి ఆరోపణలపై మంగళవారం సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం తిమ్మాపూర్ గ్రామంలో విచారణ జరిపింది. ఇక్కడ 590 ఇళ్లు మంజూరు కాగా 247 ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులున్నాయి. కానీ అందులో 44 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గతంలోనే గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 44 ఇళ్లకు చెల్లింపులు జరిపారన్న అంశంపై ఇంటింటికీ వెళ్లి విచారణ చేశారు. పాత ఇళ్లకు మరమ్మతులు చేయడం, నూతన గృహాలు నిర్మించకపోవడం తదితర లోపాలను గుర్తించారు. బృందంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. హాలియా : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై మండలంలోని చల్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు నేతృత్వంలోని అధికారుల బృంద మంగళవారం విచారణ చేపట్టింది. లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇళ్లు కట్టుకున్నారాలేదా? హౌసింగ్ అధికారులు ఎంత బిల్లు, ఎన్ని బస్తాల సిమెంట్ ఇచ్చారన్నది ఆరా తీసున్నారు. -
కుప్పకూలిన సంకీర్ణ సర్కార్ మళ్లీ గద్దెనెక్కిన ఇందిరమ్మ!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అకృత్యాలను సహించలేక భారతీయ ఓటర్లు భారీ మెజారీటీతో గద్దెకెక్కించిన సంకీ ర్ణ ప్రభుత్వం ముడేళ్ల ముచ్చటే అయ్యింది. రాజకీయ అస్థిరతను సహించలేని దేశవాసులు 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో కూడా ఒక్క స్థానంలో మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అటల్ బిహారీ వాజపేయి విజయం సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1977లో ప్రజలు గెలిపించిన జనతా ప్రభుత్వం నేతల స్వార్థ రాజకీయాలకు బలైంది. ప్రధానమంత్రి పదవి కోసం మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్, జగ్జీవన్రామ్ల మధ్య జరిగిన తగవులాటలతో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా కొనసాగలేకపోయారు. భారతీయ జన్‌సంఘ్ సంకీర్ణం నుంచి బయటకు రావడంతో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయి మెరార్జీదేశాయ్ రాజీనామా చేశారు. ఇతర మిత్రపక్షాల సహాయంతో చరణ్‌సింగ్ ప్రధానమంత్రి సింహాసనం అధిష్టించారు. కానీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని మాటిచ్చిన కాంగ్రెస్ వెనుకడుగు వేయడంతో చరణ్‌సింగ్ పార్లమెంటును ఎదుర్కోకుండానే రాజీనామా చేయవలసివచ్చింది. అధికార పక్షంలోని వైరుధ్యాలను తనకు అనుకూలంగా మలచుకోవడంతోపాటు ప్రభుత్వం వేధింపులకు గురైన నేతగా ప్రజలకు తనను చూపించుకోవడంలో ఇందిరాగాంధీ సఫలమయ్యారు. సానుభూతి పవనాలతోపాటు సమర్థనాయకత్వం కోరుకున్న ప్రజలు ఇందిరాగాంధీకి పట్టం కట్టారు. ఢిల్లీవాసులు కూడా జనతా ప్రభుత్వం కీచులాటలతో విసిగిపోయారు. కాంగ్రెస్‌నే మళ్లీ గెలిపించారు. న్యూఢిల్లీలో మాత్రం అటల్ బిహారీ వాజపేయి కాంగ్రెస్ అభ్యర్థి సి.ఎం. స్టీఫెన్‌ను ఓడించారు. చాందినీ చౌక్, ఔటర్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సదర్, సౌత్ ఢిల్లీ, కరోల్ బాగ్ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటువేశారు. చాందినీ చౌక్‌లో భికూ రామ్‌జైన్, కరోల్‌బాగ్‌లో ధరమ్‌దాస్ శాస్త్రీ, సదర్ నుంచి జగ్దీశ్ టైట్లర్ విజయం సాధించారు. సౌత్ ఢిల్లీలో చరణ్‌జీత్ సింగ్, బీజేపీ నేత విజయ్‌కుమార్ మల్హోత్రాను ఓడించారు. ఈస్ట్ ఢిల్లీలో కిషోరీలాల్పై హెచ్‌కేఎల్ భగత్ విజయం సాధించారు. ఔటర్ ఢిల్లీ నుంచి సజ్జన్‌కుమార్ అనూహ్యంగా టికెట్ సాధించడమే కాక, చౌదరి బ్రహ్మప్రకాశ్ వంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సజ్జన్‌కుమార్ గెలుపుతో ఢిల్లీలో జాట్ రాజకీయాలు బలం పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని 30 లక్షల మంది ఓటర్లలో దాదాపు 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు స్థానాలకు 168 మంది అభ్యర్థులు తలపడ్డారు. వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. -
ఇందిరమ్మకూ ఆధార్
నెల్లూరు (దర్గామిట్ట), రాష్ట్ర ప్రభుత్వ పాలనను చూస్తుంటే పలు పథకాలను ఎత్తివేసేలా కనిపిస్తోంది. పొమ్మనలేక పొగబెడుతున్న చందంగా ఒక్కో పథకానికి ఒక్కో విధంగా ముడిపెడుతూ లబ్ధిదారులకు కత్తెరపెడుతోంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసింది. ఇకపై లబ్ధిదారులు ఇంటికి దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను కూడా జతపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా హౌసింగ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. జిల్లా వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఆధార్‌కార్డు నంబర్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్‌కార్డు నంబర్ తప్పనిసరి కాదని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ రానున్న రోజుల్లో మాత్రం ఆధార్‌తో లింక్ చేయనున్నట్టు తెలిసింది. జిల్లాలో మొత్తం 2.90 లక్షల మంది ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో లక్షకు పైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేదు. మరో 30 వేల మంది లబ్ధిదారుల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీరంతా తప్పని సరిగా తమ దరఖాస్తుల్లో -
ఇందిరమ్మకు యాక్షన్ ప్లాన్
ఫిబ్రవరి నెలాఖరులోగా 13,606 పూర్తికి లక్ష్యం రచ్చబండలో మంజూరైన ఇళ్లను కూడా గ్రౌండింగ్‌కు చర్యలు త్వరలో హౌసింగ్, బ్యాంక్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయలోపంతో లబ్ధిదారులను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏళ్ల క్రితం మంజూరైన గృహాలు ఇప్పటికీ పునాదులకు కూడా నోచుకోలేదు. దీంతో వచ్చే నెలాఖరులోగా నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిర్ణయించారు. త్వరలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా 2006 నుంచి ఇప్పటి వరకు 3,78,440 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 3,11,870 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంకా 66,570 గృహాల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,73,966 నిర్మాణాలు పూర్తయ్యాయి. సమన్వయ లోపమే సమస్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ‘ఇందిరమ్మ’ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇళ్లను గ్రౌండ్ చేయాలంటే తప్పని సరిగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ (ఎల్పీసీ) ఇవ్వాల్సి ఉంది. అయితే ఎల్పీసీ మంజూరు విషయంలో తీవ్రజాప్యం జరుగుతున్న కారణంగా నిర్మాణాలను ప్రారంభించలేకపోతున్నామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమస్యలు కూడా ఉండడంతో మరింత జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ బ్యాంకర్లు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎల్పీసీల సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే హౌసింగ్ కార్యాలయంలో కూడా ఎల్పీసీల విషయంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం చర్చించనున్నారు. పూర్తయ్యేదెప్పుడు? జిల్లాలో ప్రస్తుతం 37,904 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బేస్మెంట్ పూర్తయినవి 15,229, బేస్మెంట్ స్థాయిలో 3,647, లింటల్ స్థాయి పూర్తయినవి 5,422, రూఫ్ స్థాయిలో 13,606 ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగా ముందుగా రూఫ్ స్థాయిలో ఉన్న వాటినైనా పూర్తి చేసేందుకు కలెక్టర్ కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఏజెన్సీలో 8 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఆస్బెస్టాస్ రేకులు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది. ఆ విషయాన్ని కలెక్టర్ హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు రచ్చబండలో వచ్చిన దరఖాస్తుదారులకు మంజూరైన 34,523 గృహాలను కూడా వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు కలెక్టర్ హౌసింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. -
అవినీతిలో వెరీ‘గుడ్డు’
త్రీ సంక్షేమ శాఖలో కొను‘గోల్మాల్’ గువ్వగుడ్లను పోలిన నాసిరకం కోడిగుడ్లే సరఫరా గుడ్డు 30గ్రాములకు మించడం లేదు కాంట్రాక్టర్లకు దాసోహం కమీషన్ల కక్కుర్తి లక్షల్లోనే స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో కోడిగుడ్లకొనుగోళ్లు సీడీపీవోలకు సిరులు కురిపిస్తున్నాయి. నాణ్యతలేని గుడ్లను కొనుగోలు చేసి అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారు. పేదవాళ్ల నోరు కొడుతున్నారు. చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్:జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలో 3,640 అంగన్వాడీలు, 976 మినీ అంగన్వాడీలు ఉన్నారుు. వీటిలో మహిళలు, పిల్లలు, యుక్త వయసున్న బాలి కల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపడుతోంది. వాటిలో మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ అమృత హస్తం, సబల (కిశోర బాలికా సంరక్షణ పథకం), గర్భిణులకు పౌష్టికాహారం పథకాలు ప్రధానమైనవి. ఇంది రమ్మ అమృతహస్తం పథకం తప్ప మిగిలిన వాటికి సీడీపీవోలే కోడిగుడ్లను స్థానికంగా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 3-6 ఏళ్ల లోపున్న పిల్లలు 87,277 మంది లబ్ధిపొందుతున్నారు. వీరికి వారానికి నాలుగు చొప్పున ఏడాదికి 1.67 కోట్ల కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు. సబల పథకం కింద 11 నుంచి 14 ఏళ్లలోపు బడిమానేసిన, 15 నుంచి 18 ఏళ్లలోపున్న కిషోరబాలికలు 91,181 మంది ఉన్నారు. వీరికి కూడా వారానికి నాలుగు గుడ్లు చొప్పున నెలకు 16 ప్రకారం ఏడాదికి 1.76 కోట్ల కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం కింద పది ప్రాజెక్టుల పరిధిలో 32,774 మంది లబ్ధిదారులున్నారు. వీరికి రోజూ ఒక గుడ్డు చొప్పున ఏడాదికి 1.18 కోట్ల కోడిగుడ్లను అందిస్తున్నారు. ఇవిమాత్రం స్థానికంగా ఉన్న మహిళా సంఘాలకు చెందిన వీవోలు కొనుగోలు చేస్తున్నారు. ఇవికూడా నాసిరకంగానే ఉంటున్నాయి. గర్భిణుల సంరక్షణ పథకం కింద మిగిలిన 11 ప్రాజెక్టుల పరిధిలో 29,349 మంది లబ్ధిదారులున్నారు. వీరికి కూడా నెలకు 30 చొప్పున ఏడాదికి 360 ప్రకారం 1.06 కోట్ల కోడిగుడ్లను సీడీపీవోలే కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. జిల్లా కమిటీ నిర్ధేశించిన ప్రకారం 50 గ్రాములకు తక్కువగా లేని కోడిగుడ్లను 3.5 పైసలకు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అది జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం 30 గ్రాముల బరువుకూడా లేని నాసిరకం గుడ్లనే కొనుగోలు చేసి వాటినే పంపిణీ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లలో లక్షలాది రూపాయల కమీషన్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పథకాలకు కలిపి 5.66కోట్ల కోడిగుడ్లను కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పనిచేసే 21 మంది సీడీపీవోల్లో అత్యధికమంది ఆయా ప్రాంతాలకు చెందినవారే కావడంతో కాంట్రాక్టర్లతో లాలూచీ పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇదేమని ప్రశ్నించే అంగన్వాడీలపై కక్షగట్టడం, లబ్ధిదారులైతే ఏదోఒక విధంగా నోరునొక్కేయడం లాంటివి చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నా రుు. ఈ ఏడాదికి సంబంధించి కాంట్రాక్ట్‌కు గడువు మరో నెలమాత్రమే ఉంది. నాణ్యతను పాటించకపోతే వారి కాంట్రాక్టును రద్దుచేసే అధికారం ఐసీడీఎస్ పీడీకి ఉంది. ఇప్పటివరకు అలాంటి దాఖలాలు లేవు. -
ఇందిరమ్మ గృహాలపై విచారణ
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకొని వాటిని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందాయి. వారి ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను తీసుకొని స్కానింగ్ చేసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో ఇందిరమ్మ మొదటివిడతలో 515మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారని చెప్పారు. 45 గృహాల లబ్ధిదారులు వాటిని విక్రయించినట్లు జిల్లా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. వారి ఆదేశాల మేరకు సమగ్రంగా విచారణ జరిపి గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు నమోదుచేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు వర్క్ ఇన్స్పెక్టర్లు కిరణ్, అనిల్, మున్సిపల్ అధికారులు ఉన్నారు. -
‘గృహ’ అక్రమాల పై విచారణ
సాక్షి, చిత్తూరు: గృహనిర్మాణ శాఖ పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గృహనిర్మాణాల్లో చోటుచేసుకున్న అవతవకలు, వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్ దృష్టిసారించారు. ప్రస్తుతం రచ్చబండలో వచ్చిన ఇంటి నిర్మాణ అర్జీలు 20వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ఇందిరమ్మ ఫేజ్-3 ఇళ్ల నిర్మాణం సాగుతోంది. ఈ క్రమంలో మండల స్థాయిల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇల్లు కట్టకనే బిల్లు శాంక్షన్ చేసుకుని స్వాహా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరగనుంది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్లో దామినేడు గృహనిర్మాణశాఖ కాలనీ నిర్మాణం, కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై దృష్టిపెట్టారు. ఈ వ్యవహారంలో లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ ఆదేశాలు జారీచేయటంతో ఈ వ్యవహారంలో మరోసారి విచారణ ప్రారంభం కానుంది. దామినేడు అక్రమాలపై .. తిరుపతి రూరల్‌మండలం దామినేడులో మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రజల కోసం 288కి పైగా ఇళ్లను తొమ్మిది బ్లాక్‌లుగా నిర్మించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చిం చారు. ఈ గృహనిర్మాణాలలో అనర్హులకు ఇళ్ల కేటాయింపు,ఇళ్లు అనధికారికంగా అమ్మేసినవి, రెండవ ఫేజ్‌లో గృహ కేటాయింపుల్లో కింది స్థాయి సిబ్బంది చేతి వాటం చూపారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇది వరకే ఒక కార్పొరేషన్ క్లర్కును సస్పెండ్ చేశారు. దీనిపై కమిషనర్ ఉత్తర్వుల మేరకు అప్పట్లో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య విచారణ జరిపి నివేదిక తయారు చేశారు. అప్పట్లో వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి విచారణ జరపాలంటూ గృహనిర్మాణ శాఖ ఎండీ నుంచి జిల్లా ప్రత్యేక అధికారి ప్రసాద్‌కు ఆదేశాలు అందాయి. ఇప్పటికే దీనిపై విచారణ జరిపి కార్పొరేషన్ కమిషనర్ నివేదిక సమర్పించి ఉన్నం దున, ఆ విచారణలో తేలిన అంశాలు ఏమిటి, ఏఏ వివరాలు అధికారులు అప్పట్లో సేకరించారనేది అధ్యయనం చేసి దాన్ని గృహానిర్మాణ శాఖ ఎండీకి పంపనున్నారు. 1985 నాటి ఇళ్ల నిర్మాణంపైలోకాయుక్త ఆదేశం పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలం పల్లవోలు గ్రామంలో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహనిర్మాణ కాలనీ నిర్మాణంలో అవతవకలు జరిగాయనే దానిపై వేసిన పిటి షన్‌పై విచారణ జరిపి వివరాలు సమర్పించాలని రాష్ట్ర లోకాయుక్త ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని ప్రత్యేక అధికారి సంబంధిత డీఈ, ఏఈలను ఆదేశించారు. 1985 నాటి ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై ఇప్పుడు లోకాయుక్త వి చారణకు ఆదేశించడం ఒక రకంగా చర్చనీ యాంశంగా మారింది. ఇల్లు కట్టకనే బిల్లులు కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఇల్లు కట్టకనే బిల్లులు శాంక్షన్ చేయించుకుని స్వాహా చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లో విచారణ జరపనున్నారు. సంబంధిత ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు, ఫిర్యాదు చేసిన వారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలి పించాల్సిందిగా డీఈకి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇందిరమ్మ స్థలాల గొడవ పుత్తూరు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల మధ్య వివాదం తలెత్తింది. ఇక్కడ ఫేజ్-2 ఇందిర్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్నే తిరిగి ఫేజ్-3 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధ్దిదారులకు కూడా కేటాయించినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపైన పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా సంబంధిత ఏఈ, డీఈలను ప్రత్యేక అధికారి ఆదేశించారు. -
నత్తనడకన ఇందిరమ్మ
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటిం టా సౌభాగ్యం..’ నినాదంతో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో మూడు విడతల్లో 3 లక్షల 829 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 1,88,142 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇంకా 1,12,687 ఇళ్లు పూర్తి కావాల్సి ంది. పథకం అమల్లోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. మొదటి దశలో మంజూరయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడం భాధాకరం. కాగా, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అసలు ఇంతవరకు నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఇళ్లు మంజూరయినప్పటికీ ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేవంటూ అధికారులు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం వల్లే ఇంకా నిర్మాణం ప్రారంభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో పొందుపరచిన వివరాల ప్రకారం.. మొదటి దశలో 13, 644 ఇళ్లు ఇంకా మొదలు పెట్టనేలేదు. రెండో దశలో 24,079, మూడో దశలో 29,589 ఇళ్లు మంజూరుకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాం తాల్లో పునాదిలోనే ఇళ్ల నిర్మాణం ఆగిపోగా, మరికొన్ని ఇళ్లు సన్‌సైడ్, స్లాబ్ లెవెల్లో నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలున్నాయి. జిల్లాలో అన్ని ప్రాం తాల్లో ఏఈలతో పాటు అవసరమైన చోట్ల డీఈలు ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆయా ప్రాం తాల్లో ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్లకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించే బాధ్యతలు అప్పగించాలి. కానీ ఆయా అధికారుల్లో సరైన కమాండింగ్ లేకపోవడంతో వర్క్ ఇన్స్పెక్టర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. జిల్లాలో వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సిన దాని కన్నా 22 మంది ఎక్కువగానే ఉన్నారు. అయినా ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు గుండాల మండలంలో పరిశీలిస్తే.. ఒక ఏఈ నెలలో 32 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలనే లక్ష్యం ఉంటే.. ఆయన ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేయించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుక, స్టీల్ సకాలంలో సరఫరా కావడం లేదని, అందుకే ఆలస్యమవుతోందని మండల స్థాయి అధికారులు చెపుతున్నప్పటికీ.. తొమ్మిదేళ్ల క్రితం మంజూరైన ఇళ్లకు కూడా ఇంకా సరఫరా కాలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రచ్చబండ రెండో విడతలోనూ అంతంతమాత్రమే... రచ్చబండ రెండో విడతలో మంజూరయిన 19, 273 ఇళ్లలో ఇప్పటివరకు 3,454 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 15,819 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇందిరమ్మ మూడు విడతలతో పాటు రచ్చబండలో మంజూరైన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు నెల రోజుల్లో బిల్లులు’
అర్వపల్లి, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ పథకంతో పాటు రచ్చబండ ద్వారా ఇళ్లు మంజూరై నిర్మిం చుకున్న లబ్ధిదారులకు నెలరోజుల్లో బిల్లులు చెల్లించనున్నట్లు గృహ నిర్మాణశాఖ సూర్యాపేట డివిజన్ ఈఈ ఏ. కృష్ణయ్య తెలిపారు. మండలంలోని తిమ్మాపురం, కొమ్మాల, వర్ధమానుకోట, కుంచమర్తి, అర్వపల్లి, కాసర్లపహడ్, లోయపల్లి, అడివెంల, కొత్తపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీ లించారు. అలాగే స్థానిక ఏఈ కార్యాలయంలో రికార్డులు పరి శీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట డివిజన్లో ఇంది రమ్మ పథకంతో పాటు మూడో విడత రచ్చబండ ద్వారా 90 వేల 418 ఇళ్లు మంజూరు కాగా 50వేల 808 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 19,391 ఇళ్ల నిర్మాణం మొదలు కావాల్సి ఉందన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి 35 వేల 387 ఇళ్లు మంజూరు కాగా 19 వేల 223 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. డివిజన్లో 13మండలాలకు సూర్యాపేట, పెన్పహడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో ఏఈ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం దొరకలేదని మిగిలిన మండలాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఈ నందీష్ కుమార్, ఏఈ సురేంద్రనాథ్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’కు బ్రేక్..!
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : విభజన నిర్ణయం ఇందిరమ్మ లబ్ధిదారుల పాలిట గుదిబండగా మా రింది. గృహనిర్మాణశాఖ ఉద్యోగులం తా సమ్మె బాట పట్టడంతో పూర్తయిన ఇళ్లకు చెల్లింపులకు బ్రేక్ పడింది. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన వాటికి చెల్లింపులు జరగకపోవడంతో పల్లెల్లో హౌసింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఇ న్నాళ్లూ లబ్ధిదార్ల చుట్టూ ఆ శాఖ ఉద్యోగులు తిరిగేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఇళ్లు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి మహాప్రభో! అంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చెల్లింపులకు నిధుల కొరత లేకపోయినా పక్షం రోజులుగా హౌసింగ్ అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమబాట పట్టడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. ఇళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చేయాల్సి ఉంది. సమ్మెతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో జిల్లాలో ఇళ్ల లబ్ధిదార్లకు ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.10 కోట్ల వరకూ నిలిచిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిర్మాణంలో 3.66 లక్షల ఇళ్లు.. ఇందిరమ్మ మూడు దశలతో పాటు రచ్చబండ ఇళ్ల ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. వీటిలో 29,829 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభించలేదు. పునాదుల్లో 22,125, లింట ల్ స్థాయిలో 6831, ఆర్సీ స్థాయిలో 2,14,778 ఇళ్లు ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ స్థాయిలో మరో 64,690 వెరసి మొత్తం 3,66,318 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండేది కాదు. ప్రస్తుతం వీటి ధరలు తగ్గి నిర్మాణాలు ఊపందుకున్నా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. వాస్తవానికి పూర్తి చేసినవాటికి అధికారులు చెల్లింపులు చేపట్టాకే, లబ్ధిదారులు తరువాత స్థాయి పనులు చేపడుతుంటారు. ప్రస్తుతం పూర్తి చేసిన స్థాయికి బిల్లులు నిలిచిపోవడంతో తరువాత స్థాయికి వెళ్లేందుకు లబ్ధిదారులు వెనుకంజవేస్తున్నారు. -
ఇందిరమ్మ వేగవంతానికి ‘గ్రామదర్శనం’
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ ని ర్మాణ పనులను వేగవం తం చేసేందుకు గ్రా మీణ ప్రాంతాల్లో ప్రతి లబ్దిదారుడిని వ్యక్తిగతం గా కలవాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ హౌ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇం దుకుగా ను ‘గ్రామ దర్శనం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ట్లు తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మంది రం లో గృహ నిర్మాణ శాఖ పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులను చైతన్యవంతం చేసేందుకు నెల రో జుల పాటు ప్రతిగ్రామాన్ని సందర్శించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భా గంగా అధికారులు ఒక్కో రోజు ఒక గ్రామంలో గడపాలని సూచించారు. ఇందుకుగాను ముం దుగానే షెడ్యుల్ రూపొందించుకోవాలన్నారు. ఈ ఏడాది 42 వేల ఇళ్ల నిర్మానం పూర్తి చేయా ల్సి ఉన్నందున, ప్రతి నెల కనీసం 6 వేల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా ఎంచుకుని వచ్చే ఫిబ్రవరిలోగా 100 శాతం లక్ష్యాన్ని సాధిం చాల న్నారు. ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఎస్సీ, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఇతరులకు రూ. 70వేలకు పెం చి నందున నిధులు సరిపోకపోవడమనే సమస్య లేదన్నారు. ఈనెల 6, 7 తేదీల్లో ‘గ్రామ దర్శనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టి పెలైట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల్లో ఏఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లబ్దిదారులతో మా ట్లాడి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు అన్ని గ్రామాలను సందర్శించి లబ్దిదారుల సమస్యలు తెలుసుకొని వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 23 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో, 7 వేల ఇళ్లు లెంటల్ లెవల్లో ఉన్నందున లబ్దిదారులను చైతన్యవంతం చేస్తే రెండు నెలల్లో 30 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉందన్నా రు. ఇందుకుగాను డివిజన్ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. అచ్చం పేట, కొల్లాపూర్, కల్వకుర్తి, బల్మూర్, ఉప్పునంతల, వీపనగండ్ల, పానగల్, వెల్లండ, ఆత్మకూర్, వడ్డెపల్లి, అమ్రాబాద్ మండలా ల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇంజనీరింగ్ అధికారులు నిర్ధేశించిన సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేజ్-1 నుంచి ఫేజ్ 3 వరకు ఇంకా నిర్మాణం చేపట్టని ఇళ్లను గ్రామాల వారిగా గుర్తించి వివరాలు అందజేయాలన్నారు. వీటిని రద్దు చేసి కొత్తవారికి అవకాశం కలిపించాలని సూచించారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బలరాం, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు అమ్మబడును
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : ‘నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తాం..’ ఇదీ ప్రభుత్వ నినాదం.. కానీ, ‘ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించండి లేదా అమ్ముకోవడానికి అనుమతివ్వండి’ అని లబ్ధిదారుడు రోడ్డెక్కాడు..! ఇదేమి చోద్యం అనుకుంటున్నారా.. ఇదీ పచ్చినిజం..! ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, అధికారులు డబ్బులు చెల్లించకపోవంతో ఓ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లునే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన కాగజ్‌నగర్ డివిజన్లో చోటు చేసుకుంది. బెజ్జూర్ మండలం బొంబాయిగూడకు చెందిన పగిడాల భువనేశ్వర్‌కు 2007లో రెండో విడతలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు రూ.28,500 ఇస్తానని చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం అధికారులు 30 బస్తాల సిమెంట్, రూ.11 వేలు ఇంటి నిర్మాణం కోసం అధికారులు మంజూరు చేశారు. మిగతా డబ్బులు ఆరేళ్లు గడిచినా ఇవ్వడం లేదు. ఇంటి నిర్మాణం కోసం ప్రైవేలుగా రూ.30 వేలు అప్పు తీసుకొచ్చాడు. మండలంలోని గృహనిర్మాణ శాఖ అధికారులను అడిగితే రేపుమాపూ అంటు తిప్పించుకుంటున్నారు. ఇల్లు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇందిరమ్మ ఇల్లును అమ్మకానికి బెట్టాడు. బిల్లులు చెల్లించక పోవడాన్ని నిరసిస్తూ గురువారం కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫ్టెక్సీతో బైఠాయించాడు. దాదాపు అరగంటపాటు రోడ్డుపై బైఠాయిచడంతో కాగజ్‌నగర్ పట్టణ గృహ నిర్మాణ శాఖ ఏ సంజీవ్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. గురువారం సెలవుదినం కావడంతో శుక్రవారం కార్యాలయానికి వస్తే రికార్డులు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న బిల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బైఠాయింపును విరమించాడు. బిల్లులు ఇవ్వం మీ దిక్కున్నచోట చెప్పుకో అంటున్నారు.. - పడిడాల భువనేశ్వర్, బాధితుడు ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదు. బిల్లులు ఇవ్వం నీ దిక్కున్నచోట చెప్పుకో. గత వర్షాలతో చాలా నష్టపోయాను. ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేదు. అందుకే ఇంటిని అమ్మాలని నిర్ణయించాను. అధికారులు ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలి. అన్ని బిల్లులు చెల్లించాం - సజీయోద్దిన్, ఇన్చార్జి హౌసింగ్ ఏఈ, బెజ్జూర్ ఇందిరమ్మ రెండవ విడతలో ఇల్లు మంజూరైన విషయం వాస్తవమే. ఇంటి నిర్మాణానికి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు. -
25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆ ఇళ్ల నిర్మాణ ప్రారంభం కోసం ‘పునాదుల మహోత్సవం’ కార్యక్రమం కింద ప్రతీ రోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తారని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, నియోజకవర్గానికి రెండు వేల చొప్పున పది నియోజకవర్గాలకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, స్టేట్ రిజర్వు నుంచి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు. వీటిలో పాలేరు, మధిర, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు వెయ్యి ఇళ్లచొప్పున మంజూరు చేశామని అన్నారు. ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు రూ.1.5 లక్షలు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు రూ.70 వేల చొప్పున ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశాల మేరకు ఈనెలలో పునాదుల మహోత్సవ కార్యక్రమం కింద ప్రతిరోజు డీఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పునాదులు నిర్మించుకోనేందుకు అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లాలోని పినపాక, చింతకాని మండలాల్లో రూ.2.1 కోట్లతో మినీ స్టేడియాలు మంజూరయ్యాయని, వీటికి టెండర్లు వేశామన్నారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం నిర్మిత కేంద్రాలలో సిమెంట్ బ్రిక్‌లు, రింగులు తయారు చేస్తారని, 15 రోజుల్లో ఈ నిర్మిత కేంద్రాలు పనులు ప్రారంభమవుతాయని అన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఖమ్మం, పాల్వంచలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కొత్తగూడెంలో ప్రభుత్వ స్థలాలు పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనంగా మరుగుదొడ్లు మంజూరు చేస్తామని అన్నారు. మరుగుదొడ్లకు రూ.9,100 చెల్లిస్తామని తెలిపారు. జిల్లాకు 21,758 మరుగుదొడ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈనెల 21న పినపాక, 22న మధిర, పాలేరు, 27న భద్రాచలం ఇలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికారులతో సమావేశాలు పెట్టి ఇళ్ల నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఈఈ మహేశ్వర్, డీఈ మల్లికార్జున్‌రావు, ఏఈ ఆర్.జయ సింహా పాల్గొన్నారు.