నర్సీపట్నం, న్యూస్‌లైన్ : విభజన నిర్ణయం ఇందిరమ్మ లబ్ధిదారుల పాలిట గుదిబండగా మా రింది. గృహనిర్మాణశాఖ ఉద్యోగులం తా సమ్మె బాట పట్టడంతో పూర్తయిన ఇళ్లకు చెల్లింపులకు బ్రేక్ పడింది. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, పూర్తయిన వాటికి చెల్లింపులు జరగకపోవడంతో పల్లెల్లో హౌసింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఇ న్నాళ్లూ లబ్ధిదార్ల చుట్టూ ఆ శాఖ ఉద్యోగులు తిరిగేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఇళ్లు పూర్తి చేశాం.. బిల్లులు చెల్లించండి మహాప్రభో!
అంటూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చెల్లింపులకు నిధుల కొరత లేకపోయినా పక్షం రోజులుగా హౌసింగ్ అధికారులు, సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమబాట పట్టడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. ఇళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంది. సమ్మెతో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో జిల్లాలో ఇళ్ల లబ్ధిదార్లకు ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.10 కోట్ల వరకూ నిలిచిపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నిర్మాణంలో 3.66 లక్షల ఇళ్లు..
ఇందిరమ్మ మూడు దశలతో పాటు రచ్చబండ ఇళ్ల ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. వీటిలో 29,829 ఇళ్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభించలేదు. పునాదుల్లో 22,125, లింట ల్ స్థాయిలో 6831, ఆర్‌సీ స్థాయిలో 2,14,778 ఇళ్లు ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ స్థాయిలో మరో 64,690 వెరసి మొత్తం 3,66,318 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఉండేది కాదు. ప్రస్తుతం వీటి ధరలు తగ్గి నిర్మాణాలు ఊపందుకున్నా అధికారులు బిల్లులు చెల్లించడం లేదు. వాస్తవానికి పూర్తి చేసినవాటికి అధికారులు చెల్లింపులు చేపట్టాకే, లబ్ధిదారులు తరువాత స్థాయి పనులు చేపడుతుంటారు. ప్రస్తుతం పూర్తి చేసిన స్థాయికి బిల్లులు నిలిచిపోవడంతో తరువాత స్థాయికి వెళ్లేందుకు లబ్ధిదారులు వెనుకంజవేస్తున్నారు.
‘ఇందిరమ్మ’కు బ్రేక్..!
Published Fri, Sep 6 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement