అర్వపల్లి, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ పథకంతో పాటు రచ్చబండ ద్వారా ఇళ్లు మంజూరై నిర్మిం చుకున్న లబ్ధిదారులకు నెలరోజుల్లో బిల్లులు చెల్లించనున్నట్లు గృహ నిర్మాణశాఖ సూర్యాపేట డివిజన్ ఈఈ ఏ. కృష్ణయ్య తెలిపారు. మండలంలోని తిమ్మాపురం, కొమ్మాల, వర్ధమానుకోట, కుంచమర్తి, అర్వపల్లి, కాసర్లపహడ్, లోయపల్లి, అడివెంల, కొత్తపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీ లించారు.
అలాగే స్థానిక ఏఈ కార్యాలయంలో రికార్డులు పరి శీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట డివిజన్‌లో ఇంది రమ్మ పథకంతో పాటు మూడో విడత రచ్చబండ ద్వారా 90 వేల 418 ఇళ్లు మంజూరు కాగా 50వేల 808 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. 19,391 ఇళ్ల నిర్మాణం మొదలు కావాల్సి ఉందన్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి 35 వేల 387 ఇళ్లు మంజూరు కాగా 19 వేల 223 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. డివిజన్‌లో 13మండలాలకు సూర్యాపేట, పెన్‌పహడ్, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో ఏఈ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం దొరకలేదని మిగిలిన మండలాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఈ నందీష్ కుమార్, ఏఈ సురేంద్రనాథ్ పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ లబ్ధిదారులకు నెల రోజుల్లో బిల్లులు’
Published Sat, Sep 7 2013 3:00 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement