నెల్లూరు (దర్గామిట్ట), రాష్ట్ర ప్రభుత్వ పాలనను చూస్తుంటే పలు పథకాలను ఎత్తివేసేలా కనిపిస్తోంది. పొమ్మనలేక పొగబెడుతున్న చందంగా ఒక్కో పథకానికి ఒక్కో విధంగా ముడిపెడుతూ లబ్ధిదారులకు కత్తెరపెడుతోంది.
తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్ కార్డులను అనుసంధానం చేసింది. ఇకపై లబ్ధిదారులు ఇంటికి దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను కూడా జతపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా హౌసింగ్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.
జిల్లా వ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఆధార్‌కార్డు నంబర్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్‌కార్డు నంబర్ తప్పనిసరి కాదని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ రానున్న రోజుల్లో మాత్రం ఆధార్‌తో లింక్ చేయనున్నట్టు తెలిసింది. జిల్లాలో మొత్తం 2.90 లక్షల మంది ఇందిరమ్మ లబ్ధిదారులు ఉన్నారు.
వీరిలో లక్షకు పైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేదు. మరో 30 వేల మంది లబ్ధిదారుల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీరంతా తప్పని సరిగా తమ దరఖాస్తుల్లో