జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహ ని ర్మాణ పనులను వేగవం తం చేసేందుకు గ్రా మీణ ప్రాంతాల్లో ప్రతి లబ్దిదారుడిని వ్యక్తిగతం గా కలవాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ హౌ సింగ్ అధికారులను ఆదేశించారు. ఇం దుకుగా ను ‘గ్రామ దర్శనం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ట్లు తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మంది రం లో గృహ నిర్మాణ శాఖ పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులను చైతన్యవంతం చేసేందుకు నెల రో జుల పాటు ప్రతిగ్రామాన్ని సందర్శించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇందులో భా గంగా అధికారులు ఒక్కో రోజు ఒక గ్రామంలో గడపాలని సూచించారు. ఇందుకుగాను ముం దుగానే షెడ్యుల్ రూపొందించుకోవాలన్నారు. ఈ ఏడాది 42 వేల ఇళ్ల నిర్మానం పూర్తి చేయా ల్సి ఉన్నందున, ప్రతి నెల కనీసం 6 వేల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా ఎంచుకుని వచ్చే ఫిబ్రవరిలోగా 100 శాతం లక్ష్యాన్ని సాధిం చాల న్నారు. ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఎస్సీ, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఇతరులకు రూ. 70వేలకు పెం చి నందున నిధులు సరిపోకపోవడమనే సమస్య లేదన్నారు.
ఈనెల 6, 7 తేదీల్లో ‘గ్రామ దర్శనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టి పెలైట్ ప్రాజెక్టుగా రెండు గ్రామాల్లో ఏఈ లు, వర్క్ ఇన్‌స్పెక్టర్ లబ్దిదారులతో మా ట్లాడి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు అన్ని గ్రామాలను సందర్శించి లబ్దిదారుల సమస్యలు తెలుసుకొని వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 23 వేల ఇళ్లు రూఫ్ లెవల్‌లో, 7 వేల ఇళ్లు లెంటల్ లెవల్లో ఉన్నందున లబ్దిదారులను చైతన్యవంతం చేస్తే రెండు నెలల్లో 30 వేల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉందన్నా రు. ఇందుకుగాను డివిజన్ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
అచ్చం పేట, కొల్లాపూర్, కల్వకుర్తి, బల్మూర్, ఉప్పునంతల, వీపనగండ్ల, పానగల్, వెల్లండ, ఆత్మకూర్, వడ్డెపల్లి, అమ్రాబాద్ మండలా ల్లో పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇంజనీరింగ్ అధికారులు నిర్ధేశించిన సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేజ్-1 నుంచి ఫేజ్ 3 వరకు ఇంకా నిర్మాణం చేపట్టని ఇళ్లను గ్రామాల వారిగా గుర్తించి వివరాలు అందజేయాలన్నారు. వీటిని రద్దు చేసి కొత్తవారికి అవకాశం కలిపించాలని సూచించారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడానికి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బలరాం, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ వేగవంతానికి ‘గ్రామదర్శనం’
Published Wed, Sep 4 2013 4:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM
Advertisement
Advertisement