ఇళ్లపట్టా కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ.. నిరుపేదలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆశ్రయించారు. ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఇళ్ల పట్టా కోసం రూ200 డిమాండ్ చేస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం డివిజన్ సుందర్ నగర్ లో సోమ వారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇళ్ల పట్టా కోసం వీఆర్వో డబ్బు డిమాండ్ చేయడంతో మహిళలు వైఎస్పార్ సీపీ నేత సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని కోరారు.