రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్ధిదారులకు, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్‌బీటీ నగర్‌లో 7,000 మందికి సీఎం కేసీఆర్ స్వయంగా ఇళ్ల పట్టాలను అందజేయనున్నా రు.
క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 3,43,537 దరఖాస్తులు అందగా, వీరిలో రెవెన్యూశాఖ లక్షా 30 వేల మందిని అర్హులుగా గుర్తించింది. కాగా, ఇప్పటివరకు 1,17,236 మందికి పట్టాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను రెవెన్యూశాఖ ఆదేశించింది.