గాజువాక : స్టీల్‌ప్లాంట్ నిర్వాసిత కాలనీల్లో ఇళ్లు, స్థలాల క్రయ విక్రయాలకు సంబంధించిన ఫైలు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన జాయింట్ కలెక్టర్ దృష్టి సారించకపోవడంతో ఆర్నెల్లుగా ఆయన వద్దే తిష్టేసింది.
ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా జిల్లా అధికారులు స్పందించకపోవడంతో నిర్వాసిత కాలనీల్లోని స్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అవసరాల నిమిత్తం వాటిని అమ్ముకొందామని నిర్ణయించుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల పునఃప్రారంభంపై అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్‌లకు ఎప్పుడు పంపుతారోనన్న ఆశతో కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు.
స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో తమ భూములతో పాటు ఇళ్లను కూడా కోల్పోయిన నిర్వాసితులకు అగనంపూడి, వడ్లపూడి, దువ్వాడ, పెదగంట్యాడ, గంగవరం కాలనీల్ల పునరావాసం కల్పించిన విషయం తెలిసిందే. ఈ కాలనీల్లో స్థలాల కేటాయింపులకు సంబంధించి నకిలీ ఆర ్డర్లు వెలుగు చూడడం, బ్రోకర్లు పెద్ద సంఖ్యలో బయల్దేరిన దరిమిలా స్థలాలపై వివాదాలు చోటు చేసుకోవడం తో అగనంపూడి, దువ్వాడ కాల నీల్లో 2008 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగా, మిగిలిన పునరావాస కాలనీల్లో 2012 నుంచి నిలిపివేశారు. పునరావాస కాలనీల్లో స్థలాలను విక్రయించరాదని లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లో నిబంధన ఉండడంతో దాని ఆధారం గా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. ఇళ్లను వదులుకోవడంవల్ల పరిహా రంగా ఇచ్చిన స్థలాలంటూ నిర్వాసితులు నిర్వహించిన ఆందోళనల ఫలితంగా గత ప్రభుత్వం సానుకూలంగా స్పం దించింది.
ఆర్నెల్లుగా కదలని రిజిస్ట్రేషన్ల ఫైలు
Published Wed, Aug 27 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement