సాక్షి, బెంగళూరు: గతేడాది తరహాలోనే మరోసారి బెంగళూరు నగరంలో మహిళల లో దుస్తులు చోరీ కావడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో మహారాణి కాలేజీ లేడిస్ హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు చొరబడుతూ విద్యార్థినుల లోదుస్తులు చోరీ చేసేవారు. తాజాగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్) ఉద్యోగుల క్వార్టర్స్‌లో తమ లో దుస్తులు చోరీకి గురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి.
జనవరి 11న బపనహల్లి పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. బాధితురాలు మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో అలికిడి కాగా వరండాలోకి వెళ్లి చూశాను. ఓ గుర్తు తెలియని వ్యక్తి లోదుస్తుల పక్కన తచ్చాడుతుండటం చూసి అనుమానం రావడంతో.. ఎవరు నువ్వు అంటూ ధైర్యం తెచ్చుకుని పశ్నించాను. తాను వాచ్‌మెన్ అని నమ్మించాలని చూసిన వ్యక్తి, ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో బెదిరించినట్లు చెప్పారు. లోదుస్తులు వాసన చూసి తర్వాత వాటిని చోరీచేసి పారిపోతూ తాను దొంగనని ఆ వ్యక్తి బదులిచ్చినట్లు మహిళా ఉద్యోగిని పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment