నాగోలు: రెండో వివాహం చేసుకుని కులం పేరుతో భర్త, అతని కుటుంబ సభ్యుల దూషించడంతో ఓ మహిళ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్బీ నగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన ఎమ్ నాగలక్ష్మీ అలియాస్ రమ్య(27) ఎలక్ట్రిసిటీ డిపార్టెమెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. వివాహిత అయిన రమ్య భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో కూతురితో కలిసి నగరంలో నివాసం ఉంటోంది. కాగా, నల్లగొండకు చెందిన గట్టు సుమన్ బాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొత్తపేటలోని స్వర్ణకంచి షాపింగ్ మాల్ లో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్న సుమన్ రమ్యను పెళ్లి చేసుకుని ఆమెకు అండగా ఉంటానని చెప్పి నమ్మించి ఈ ఏడాది ఫిబ్రవరి 8న కంచీపురం లో వివాహం చేసుకున్నాడు.
మన్సూరాబాద్ లోని మల్లికార్జుననగర్ లో కుటుంబసభ్యులకు తెలియకుండా కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న సుమన్ కుటుంబసభ్యులు గట్టు ఉదయ్ కుమార్, లక్ష్మీలు ఇంటికి వచ్చి సుమన్ ను వదిలేసి వెళ్లిపోవాలని రమ్యను బెదిరించారు. ఈ క్రమంలో వీరు రమ్యను కులం పేరుతో దూషించారు. ఆ తర్వాత సుమన్ ఇంటికి రాకుండా ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న రమ్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకుని..
Published Thu, Jun 23 2016 9:36 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
Advertisement
Advertisement