మాట్లాడుతున్న మాథ్యూస్ డీబీర్
ఆర్థిక సమస్యలతోనే ట్రాఫికింగ్
Published Thu, Aug 11 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
► అంతర్జాతీయ సదస్సులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు
అనంతపురం ఎడ్యుకేషన్ :
మానవ అక్రమ రవాణాకు ఆర్థిక అంశాలే మూలం అని మైచాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్లు వీవీఎన్ ఇసాక్ (ఆస్ట్రేలియా), మాథ్యూస్ డీబీర్ (దక్షిణాఫ్రికా) అన్నారు. ‘మానవ అక్రమ రవాణా – సవాళ్లు – ప్రమాణాలు’ అనే అంశంపై ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో గురువారం రెండో రోజు నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో వారు మాట్లాడారు.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులతోపాటు ఒడిస్సా రాష్ట్ర బర్హంపూర్‌లోని లింగరాజు లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ చరణ్ పట్నాయక్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.సంజీవరెడ్డి, ఎస్కేయూ ప్రొఫెసర్ అమర్‌నాథ్‌దాస్, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భానూజ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను రూపు మాపడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రంగస్వామి, సదస్సు కన్వీనర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి టీఎస్ శ్యామ్‌ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement