trafficking
-
విమానాల్లో వన్యప్రాణులు
సాక్షి, విశాఖపట్నం: మూఢ నమ్మకాలతో కొందరు..! హోదా కోసం మరికొందరు..! కారణమేదైనా అరుదైన వన్యప్రాణులు సంపన్నుల ఇళ్లల్లో తారసపడుతున్నాయి. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి విమానాల్లో ఖండాతరాలు దాటి వస్తున్నాయి. ఇవి స్మగ్లర్లకు కాసులు కురిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై కస్టమ్స్ నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్‌పోర్టులను అన్వేíÙస్తున్నారు. థాయ్‌లాండ్, మలేíÙయా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వన్యప్రాణుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఓడలలో వీటిని అక్రమంగా తరలించగా ఇప్పుడు వైమానిక మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు. వన్యప్రాణుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వైమానిక రంగాన్ని వినియోగిస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉండటంపై ఐక్యరాజ్యసమితి (యూఎన్ఈపీ) ఆందోళన వ్యక్తం చేసింది. చెన్నైలో అధికంవివిధ దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తుండగా పట్టుబడిన కేసుల్లో మూడొంతులు చెన్నై ఎయిర్‌పోర్టుల్లో నమోదైనవే కావడం గమనార్హం. ఇక్కడ నిఘా పెరగడంతో తాజాగా బెంగళూరు, హైదరాబాద్‌తో పాటు విశాఖ ఎయిర్‌పోర్టులను ప్రత్యామ్నాయాలుగా స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. చెన్నై, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులు అక్రమ రవాణాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆదాయం పెరుగుతుందనే మూఢ నమ్మకంతో..తాబేళ్లు, అరుదైన బల్లులను పెంచితే ఆదాయం పెరుగుతుందని కొందరి మూఢనమ్మకం. పాములను పెంచితే కష్టాలు తొలగిపోతాయని మరికొందరి విశ్వాసం. స్మగ్లర్లకు ఇది కాసులు కురిపిస్తోంది. ఇగ్వానాలు, మార్మోసెట్లు, కంగారూలు, విదేశీ తాబేళ్లు, విషపూరిత పాములు, యాలిగేటర్లు, అరుదైన పక్షులను కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వీటిని ఎలా పెంచాలనే విషయాలపై సోషల్ మీడియాలో సమాచారం సేకరిస్తున్నారు. బ్యాంకాక్, దుబాయ్, కౌలాలంపూర్, ఆ్రస్టేలియా, ఆఫ్రికా నుంచి ఎక్కువగా వీటి అక్రమ రవాణా జరుగుతోంది.యూఎన్ ఈపీ ట్రాఫిక్ తాజా నివేదిక ప్రకారం 2011– 2020 మధ్య 70,000 రకాల అరుదైన జీవజాతులు 18 భారతీయ విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరిగాయి. వీటిలో సరీçసృపాలు 46 శాతం ఉండగా 18 శాతం క్షీరదాలున్నాయి. ఇండియన్ స్టార్ టార్టాయిస్, బ్లాక్ పాండ్ తాబేళ్లు, జలగలు, ఇగ్వానాలు వీటిలో ఉన్నాయి. దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 2023–24లో అక్రమ రవాణాకు సంబంధించి 18 కేసులను నమోదు చేయగా 230 వన్యప్రాణుల్ని స్వా«దీనం చేసుకున్నారు.పాములు నుంచి బల్లుల దాకా సజీవంగా.. గతంలో ఏనుగు దంతాలు, పాంగోలిన్ పొలుసులు, పులి చర్మాలు, జంతు చర్మాలు, గోళ్లు అక్రమంగా తరలించగా ఇప్పుడు ఏకంగా సజీవంగా ఉన్న వన్య ప్రాణులనే స్మగ్లింగ్ చేయడం విస్తుగొలుపుతోంది. 2019లో చెన్నై విమానాశ్రయంలో స్వా«దీనం చేసుకున్న ఆఫ్రికన్ హార్న్ పిట్ వైపర్లు, ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన తాచుపాములు, విశాఖ ఎయిర్‌పోర్టులో లభ్యమైన ప్రమాదకరమైన బల్లులు.. ఇలా సజీవంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధపడుతున్నారు. కట్టుదిట్టంగా తనిఖీలు విమానాశ్రయంలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. బ్యాగేజ్ తనిఖీల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా అన్ని విభాగాల ఆధ్వర్యంలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వన్యప్రాణుల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. చెక్‌లిస్ట్‌లు, తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణికులకు అవగాహన కలి్పస్తున్నాం. – రాజారెడ్డి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో తల్లి మృతి
లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్‌గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలను కొన్న వారి పై కేసులు బయటపడ్డ ముఠా ఆడియో
-
పాపం పసివాళ్లు
-
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్.. 11 మంది భారతీయులకు విముక్తి!
నేపాల్ పోలీసులు మానవ అక్రమ రవాణా రాకెట్‌ను ఛేదించారు. ఈ ఉదంతంలో 11 మంది భారతీయులను రక్షించడంతో పాటు ఎనిమిది మంది భారతీయ మాఫియా ముఠా సభ్యులను, వారి నేపాలీ సహచరులను అరెస్టు చేశారు. ఈ ముఠా 11 మంది భారతీయ పౌరులను అమెరికాకు పంపుతామని చెబుతూ, రెండు వారాలకు పైగా బందీలుగా ఉంచినట్లు సమాచారం. ఈ ఉదంతం బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘డాంకీ’ చిత్రాన్ని పోలివుండడంతో నేపాల్ పోలీసులు దీనికి 'ఆపరేషన్ డాంకీ' అనే పేరు పెట్టారు. మాఫియా నుంచి రక్షణ పొందినవారు, ఇటు వారిని ఉచ్చులో బిగించినవారు భారత్‌లోని పంజాబ్, హరియాణాలకు చెందినవారు. ఖాట్మండు జిల్లా పోలీసు రేంజ్ బృందం ఫిబ్రవరి 14 రాత్రి నుండి ఈ ఆపరేషన్ ప్రారంభించింది. తెల్లవారుజాము వరకు దాడులు కొనసాగించింది. పక్కా సమాచారం మేరకు రాటోపుల్లోని ధోబిఖోలా కారిడార్‌లోని ఒక నేపాలీ పౌరుని నివాసంపై దాడి చేసి, 11 మంది భారతీయ పౌరులను రక్షించారు. వీరిని మెక్సికో మీదుగా అమెరికాకు పంపుతామని నమ్మించి బందీలను చేశారు. ఈ మానవ అక్రమ రావాణా ముఠా ముఖ్యంగా విద్యార్థులను అమెరికాకు పంపుతామని తప్పుడు హామీలిచ్చిందని జిల్లా పోలీసు చీఫ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భూపేంద్ర బహదూర్ ఖత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముఠా సభ్యులు తాము వల వేసినవారిని ఖాట్మండుకు తీసుకు వచ్చినప్పుడు వీసా రుసుముగా ఒక్కొక్కరి నుండి రూ.45 లక్షలతో పాటు అదనంగా మరో మూడు వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. నిందితులపై నేపాలీ చట్టం ప్రకారం కిడ్నాప్, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఆ ఏజెంట్లు తమను బందీలను చేసి, రెండు వారాలకు పైగా అద్దె ఇంట్లో ఉంచినట్లు తెలిపారు. తమను మానసికంగా, శారీరకంగా హింసించి బెదిరించారన్నారు. వారు తమకు ఇచ్చిన వీసాలు, బోర్డింగ్ పాస్‌లతో సహా అన్ని పత్రాలు నకిలీవేనని పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి పోలీసులు నకిలీ రబ్బరు స్టాంపులు, ఇతర నకిలీ పత్రాలతో పాటు బాధితుల పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
రాజన్న కోడెలు పక్కదారి!
వేములవాడ అర్బన్: వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న భక్తులు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోడెలను, ఆవులను అందజేస్తుంటారు. తమ కోరికలు నెరవేరితే కోడెమొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్న భక్తులు పలువురు కోడెలను ఆలయ గోశాలకు అప్పగిస్తుంటారు. ప్రధానంగా రైతులు తమ ఇంట్లో శుభకార్యాలు జరిగితే కోడెను తీసుకొచ్చి రాజన్న ఆలయానికి అప్పగించడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ కోడెలు, ఆవుల పోషణ ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ఇతర గోశాలల నిర్వాహకులకు కొన్ని కోడెలు, ఆవులను అందజేస్తున్నారు. వారు వాటిని పోషించడం లేదా రైతులకు అందజేయాల్సి ఉండగా.. కొందరు నిర్వాహకులు ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే అసలు లేని గోశాలల పేరిట కూడా కొందరు కోడెలు తీసుకెళ్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లో కోడెలతో వెళ్తున్న వ్యాన్ పట్టుబడడం, వారు చెప్పిన గోశాల అసలు లేనట్లు తేలడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. పోషణ భారం తగ్గించుకునేందుకు.. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలు స్థానిక తిప్పాపూర్‌లో ఒకటి, గుడిచెరువు కట్టకింద ఒకటి ఉన్నాయి. తిప్పాపూర్ గోశాలలో సుమారు 150 కోడెలు, వేములవాడ కట్టకింద గోశాలలో 150 కోడెలు, ఆవులు ఉన్నాయి. వేములవాడ కట్టకింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కుల కోసం తీసుకెళ్తుంటారు. ఆవులను స్వామి వారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి. ఇక్కడి కోడెలు ఎక్కువైనప్పుడు నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఇతర గోశాలలకు అప్పగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో భూమి పట్టా పాస్బుక్కు ఉన్న రైతులకు పెంచుకునేందుకు ఉచితంగా అందజేసేవారు. తర్వాత కాలంలో వేలం ద్వారా రైతులకే అమ్మేవారు. అయితే 2012 నుంచి తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖ తెచ్చుకున్నవారికి ఉచితంగా ఇస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో.. ఈనెల 2న తిప్పాపూర్ గోశాలలోని 20 కోడెలను ఫెడరేషన్ లేఖ తెచ్చుకున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బాతండాలోని శ్రీ సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి అందజేశారు. ఈ కోడెలతో బయలుదేరిన వ్యాన్‌ను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకుని తనిఖీ చేశారు. 20 కోడెలు ఉండాల్సి ఉండగా 24 కనిపించడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో దుబ్బాతండాలో ఈ పేరుతో గోశాల లేదని తేలింది. దీంతో ఈ వ్యాన్‌ను నేరుగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కోడెలను ధర్మసాగర్ మండలంలోని గోశాలకు తరలించారు. గోశాల ఫెడరేషన్ సూచించిన గోశాలలకు కోడెలను అప్పగిస్తున్న అధికారులు.. ఈ కోడెలు గోశాలలకు వెళ్తున్నాయా.. లేదా? అని పరిశీలించకపోవడంపై భక్తులు, స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై విచారణ చేపట్టాలి రాజన్న ఆలయ కోడెలను ఈ ప్రాంత రైతులకు అప్పగించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కోడెల అప్పగింతలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి. – గడప కిశోర్, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి ఫెడరేషన్ లెటర్ మేరకే ఇచ్చాం ఎప్పటిలాగానే తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుంచి వచ్చిన లేఖ మేరకే కోడెలను అందించాం. కానీ అక్కడ గోశాల ఉందో.. లేదో మాకు తెలి యదు. ఈ విషయం ఫెడరేషన్ వారు చూసుకోవాలి. – శ్రీనివాస్, రాజన్న ఆలయ ఏఈవో -
అక్రమ వలసల విపరిణామం
సుమారు 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో నిర్బంధించడం అంతర్జాతీయ వార్తగా మారింది. నికరాగ్వాకు వెళ్తున్న ఇలాంటి వాళ్లందరూ అక్కడి నుంచి తమ దేశంలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికా ఆరోపణ. ఫ్రెంచ్ అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికన్ నిఘా వర్గాలు న్యూఢిల్లీని మాత్రం చీకట్లో ఉంచాయి. ఈ వార్తను పతాక శీర్షికల్లో వచ్చేలా చేయడం ద్వారా అక్రమ వలస రాకెట్‌ను సమర్థంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. తమ అమెరికా కలల్ని నెరవేర్చే అక్రమ ముఠాలకు భారీగా డబ్బులు ముట్టచెబుతూ, జనాలు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్ని ఈ ఉదంతం సూచిస్తుంది. తమ వలస, జాతీయతా చట్టంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 21న ఒక నిబంధనను పొందుపర్చింది. నికరాగ్వాకు ప్యాసింజర్ విమానాల్లో రివాజుగా విదేశీయులను తీసుకెళ్తున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాలను విఫలం చేయడానికీ, అలాంటి వారిని శిక్షించడానికీ సంబంధించిన నిబంధన అది. విదేశీయులను ప్రమాదకరమైన భూభాగం, జలమార్గాల ద్వారా అమెరికాలోకి నెట్టడమే మానవ రవాణా చేస్తున్న వారి ఉద్దేశం అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ ప్రకటన, నాలుగు కీలక అంశాలను పేర్కొంది. ఒకటి, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు రాబోయే వలసదారుల కోసం కొత్త అక్రమ రవాణా కేంద్రంగా నికరాగ్వా ఉద్భవించింది. రెండు, నేరస్థ ముఠాలు వలస వచ్చేవారి నుండి ’భారీ–స్థాయిలో డబ్బు’ను వసూలు చేస్తు న్నాయి, వారిని తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. మూడు, అటు వంటి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించినా, ఎలాగైనా వారిని తమ తమ దేశాలకు అమెరికా తిప్పి పంపుతుంది. నాలుగు, నికరాగ్వా లోకి చార్టర్ విమానాలను పంపించే కంపెనీల యజమానులు, అధి కారులు, సీనియర్ అధికారులతో కఠినంగా వ్యవహరించడానికి అమె రికా పాలనాయంత్రాంగం సిద్ధమవుతోంది. అమెరికా చట్టంలోని సెక్షన్ 212 (ఎ)(3)(సి) ‘యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించడం లేదా తీవ్రమైన అమెరికన్ ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను కలిగి ఉన్న ఏ దరఖాస్తుదారుని అయినా సరే మినహాయించడానికి విదేశాంగ శాఖ మంత్రిని అమెరికా అనుమ తిస్తుంది’. నికరాగ్వా బడా ముఠాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహాయకులకు వ్యతిరేకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నిబంధనను ఉపయోగించడానికి పథక రచన చేశారని నవంబర్ ప్రకటన పేర్కొంది. నికరాగ్వాకు అలాంటి విమానాలను నడుపుతున్న వారినీ, అమెరికా–మెక్సికో సరిహద్దులోని చివరి గమ్య స్థానానికి వలసదారులను తీసుకువెళ్లేవారినీ వదిలిపెట్టబోమని అమె రికా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దురదృష్టవశాత్తు, వాషింగ్టన్ చేసిన ఈ రెండవ హెచ్చరిక కూడా భారతదేశం దృష్టిలోకి రాకుండా పోయింది. వందలాదిమంది అనుమానిత భారతీయులను తీసుకెళుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్(రొమేనియన్ సంస్థ) విమానం ఇంధనం నింపు కోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగుతోందన్న సమాచారాన్ని సేకరించిన అమెరికన్ ప్రభుత్వ నిఘావర్గాలు, వ్యవ స్థీకృత నేరాలపై పోరాడే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ విభాగానికి ఉప్పందించాయి. అట్లాంటిక్ సముద్ర ప్రాంతం పొడవునా నిఘా సమాచారాన్ని పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందన్నది దీని వెనుక ఉద్దేశం. కానీ ఇది కలవరపెట్టే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: అలాంటి నిఘా సమాచారాన్ని న్యూఢిల్లీతో ఎందుకు పంచుకోలేదు? అత్యవసర పరిస్థితుల కోసం తగినంతగా సన్నద్ధత లేని ఒక విమానాశ్రయంలో, నాలుగు రోజుల పాటు భారతీయ ప్రయాణికులు నిర్బంధించబడ్డారు. వాషింగ్టన్ లోని విశ్వసనీయ వర్గాల ప్రకారం, అమెరికన్ అధికా రులు ఆ విమానాన్ని ఎగరడానికి ముందే ఆపాలని అనుకోలేదు. పతాక శీర్షికల్లోకి వచ్చేలా చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో చర్యలు తీసుకునేలా అక్రమ వలస రాకెట్‌ను సమర్థవంతంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. ఎవరి తోడూ లేని మైనర్ ప్రయాణీకు లను కూడా కలిగి ఉన్న ఆ విమానం వాట్రీ విమానాశ్రయం వద్ద ముట్టడిలో ఉండగానే అది ప్రపంచవ్యాప్తంగా వార్తలను సృష్టించింది. యూరప్ టీవీల్లో అతిపెద్ద వార్తగా మారిన ఈ అసాధారణ సంఘటన కారణంగా, ఈశాన్య ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలకు, పారిస్‌లోని అధికా రిక వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ దేశాలకు వలస వచ్చే వారికోసం వేటాడే నేరస్థ ముఠాలు ఈ ఉదంతం కారణంగా, కనీసం కొంతకాలం అయినా ఇలాంటి విమాన వలసలకు ప్రయత్నించవు. అమెరికన్ విదేశాంగ శాఖ శిక్షా త్మకమైన వలస చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని వారాల ముందు, హైతీ తన రాజధాని నుండి నికరాగ్వాకు అన్ని విమానాలను నిలిపి వేసింది. భారతదేశంలాగే, ప్రస్తుతం హైతీ కూడా అక్రమ వలసలకు ఒక వనరుగా ఉందని అమెరికా పేర్కొంది. సంపన్న దేశాలకు తమను అక్రమంగా తరలించేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి నికరాగ్వాకు వెళ్లే విమానం ఎక్కుతున్నారు భారతీయులు. ప్రభుత్వం ఈ నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేసింది. ఎట్టకేలకు డిసెంబరు 21న ఆర్భాటంగా, ఆకర్షణీయమైన సంక్షిప్త నామంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం క్రమబద్ధమైన సహాయకరమైన వలసను ప్రోత్సహించే ‘ప్రయాస్’ కార్యక్రమం అది. అంతర్జాతీయ వలస చట్రానికి సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహనను ప్రోత్సహించడానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. నికరాగ్వాకు ఇటీవల కనీసం రెండు విమానాల్లో వెళ్లిన భారతీయులను ఎవరూ గుర్తించలేదని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. అనేక వందల మంది భారతీయ అక్రమ వలసదారులు దొరకకుండా తప్పించుకు పోతుండటాన్ని నాటకీయంగా చూపించే తమ ప్రయత్నంలో అమెరికా, ఫ్రెంచ్ ప్రభుత్వాల నేరనిరోధక ఏజెన్సీలు... ప్రధానంగా పంజాబ్, గుజరాత్ల నుండి యూరప్ గుండా పశ్చిమ అర్ధ గోళానికి వలసదారులను చేర్చడం కోసం పనిచేస్తున్న విస్తృత నేరస్థ నెట్వర్క్ గురించి భారతదేశాన్నే కాకుండా ఐక్యరాజ్యసమితిని కూడా చీకటిలో ఉంచాయి. ప్రయాస్ అనేది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వలస సంస్థ, భారతీయ అంతర్జాతీయ వ్యవహారాల మండలి... ఉమ్మడి ప్రాజెక్ట్. మరో విడ్డూరం ఏమిటంటే, లెజెండ్ ఎయిర్‌లైన్స్ చార్టర్ ఫ్లైట్ ఉదంతం వెలుగులోకి రావడానికి ఒక వారం ముందు, ‘నమోదు కాని రిక్రూట్మెంట్ ఏజెంట్ల వల్ల మోసపోతున్న విదేశీ ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరిగింది’ అని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై వేటు వేయడం ప్రపంచ స్థాయిలో జరుగుతోంది. ‘చాలా తూర్పు యూరోపియన్ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్లలో వీటికి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి’ అని హెచ్చరించింది. పార్లమెంట్‌లోని ప్రతి సెషన్ లోనూ, అక్రమ వలసల శాపం గురించి జీరో అవర్‌లో పెద్ద మొత్తంలో ప్రశ్నలు వస్తుంటాయి. భారత విదేశాంగ మంత్రి లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ఈ సమస్య సంక్లి ష్టత రీత్యా తాము నిస్సహాయంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ‘బహి ష్కరణ ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాలు చాలావరకు తమ తమ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వారి గురించి సమాచారాన్ని అందించవు’ అని చెప్పారు. ‘విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న లేదా పని చేస్తున్న భారతీయుల సంఖ్యపై మన దౌత్య కార్యాలయాల వద్ద ఎటువంటి విశ్వసనీయమైన డేటా లేదు’ అని అంగీకరించారు. ఇది షాకింగ్‌గా ఉందని చెబితే సమస్యను తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వాట్రీ విమానాశ్రయ ఘటన ఉదంతం, సమస్య తీవ్ర తనూ, సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్నీ సూచిస్తుంది. ఈ విషయంలో విఫలమైతే ఎక్కువ మంది భారతీయులు... అంత ర్జాతీయ నేరస్థ ముఠాల బాధితులుగా మారతారు. కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘హ్యూమన్ రైట్స్ హీరో-2023’గా హెరాల్డ్ డిసౌజా
ఇండియన్-అమెరికన్ లేబర్ ట్రాఫికింగ్ సర్వైవర్, యాక్టివిస్ట్ హెరాల్డ్ డిసౌజాను హ్యూమన్ రైట్స్ హీరో అవార్డు- 2023తో సత్కరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 17వ వార్షిక అంతర్జాతీయ మానవ హక్కుల యూత్ సమ్మిట్ సందర్భంగా హెరాల్డ్ డిసౌజా ఈ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సమ్మిట్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సంబంధించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. డిసౌజాతో సహా అంతర్జాతీయ వక్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు దీనిలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం సమానత్వం, గౌరవం, ఐక్యత థీమ్‌తో కార్యక్రమం జరిగింది. ‘ప్రతి బిడ్డకు మానవ హక్కులు తెలియజేయాలి’ డిసౌజా తన ప్రసంగంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు మానవ హక్కులకు సంబంధించిన 30 ఆర్టికల్స్ నేర్పించాలని అన్నారు. అవి 1948లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే పత్రంలో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తన ముందు ప్రేక్షకుల్లో కూర్చున్న ప్రతీ ప్రతినిధి నిజమైన హీరోనే అని డిసౌజా అభివర్ణించారు. మనుషుల అక్రమ రవాణా, తరలింపు నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించి, గౌరవించి, అవార్డు ఇచ్చినందుకు యూత్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మేరీ షటిల్వర్త్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మానవ అక్రమ రవాణాదారుని చేతిలో.. డిసౌజా హ్యూమన్ ట్రాఫికర్‌గా యుఎస్‌కి వచ్చారు. 18 నెలలకు పైగా ఆయన మానవ అక్రమ రవాణాదారుని చేతిలో దోపిడీకి గురయ్యారు. తన స్వేచ్ఛను కోల్పోయారు. నేడు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెరాల్డ్ డిసౌజా న్యాయవాది, పబ్లిక్ స్పీకర్. అతని చేదు అనుభవం అతనికి జీవితంలో కొత్త లక్ష్యాన్ని, అర్థాన్ని అందించింది. డిసౌజా ఐస్ ఓపెన్ ఇంటర్నేషనల్‌కు సహ-వ్యవస్థాపకుడు. ఈ సంస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారి సమాచార పరిశోధనకు సహకరిస్తుంది. బాధితులకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 2015లో యునైటెడ్ స్టేట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్‌లో సభ్యునిగా డిసౌజాను నియమించారు. ట్రాఫికింగ్‌ను పర్యవేక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫీస్‌కు నిపుణుల సలహాదారుగా కూడా డిసౌజా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అట్లాంటాకు చెందిన స్వచ్ఛంద సంస్థ శారీస్ టు సూట్స్ వ్యవస్థాపకుడు పట్టి త్రిపాఠి మాట్లాడుతూ డిసౌజా తన కుటుంబంతో కలిసి కార్మికుల అక్రమ రవాణాను అంతం చేయడానికి, దీనిపై మరింత అవగాహన పెంచడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భయం నుంచి స్వేచ్ఛకు.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 46 దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశంలోని మంగళూరుకు చెందిన డిసౌజా ప్రస్తుతం ఒహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. అతని జీవిత అనుభవాలు అతనిని.. బానిసత్వం నుండి క్రియాశీలతకు, బాధ నుంచి ఆనందానికి, భయం నుంచి స్వేచ్ఛకు.. ఇప్పుడు ‘హ్యూమన్ రైట్స్ హీరో అవార్డ్ 2023’అందుకునేందుకు సహకరించాయి. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తున్నారా? ఆ మాయలో పడకండి
సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్కు లోనై ‘లవ్’ పేరుతో ట్రాఫికింగ్ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్లైన్ లవ్ మాయలో పడొద్దు! ‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. కరోనా టైమ్‌లో ఆన్లైన్ క్లాసెస్ కోసం తండ్రి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్‌గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి. అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్ చేయకపోయినా, ఫోన్లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం. పెద్ద శిక్ష ♦ ఆన్లైన్లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. ♦ మైనర్ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. ♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్‌గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్‌కట్స్‌లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్ చూడద్దని, ఇంటర్నెట్ చూడద్దని, ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం. ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్ కేస్ కింద చూడం. కిడ్నాప్ కింద రిజిస్టర్ చేస్తాం. ట్రేస్ అవగానే రేప్ సెక్షన్స్ యాడ్ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ కింద కేస్ బుక్ అవుతుంది. మైనర్ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్ అయినా దానిని ట్రాఫికింగ్‌కు సంబంధించిన సెక్షన్స్ కింద కేస్ రిజిస్టర్ చేస్తాం. రూరల్, అర్బన్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్లైన్ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. – సుమతి, ఐపీఎస్, డీఐజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ ఇదొక వ్యసనం పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్సర్న్ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్ కెమికల్ అయిన ఫినైల్ ఇథైలమైన్ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్ పోర్న్ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్లైన్ రిలేషన్షిప్స్ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్ నెట్వర్కింగ్ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్షిప్స్’ డిజిటల్ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్,డి–అడిక్షన్ థెరపిస్ట్ లివింగ్ సోబర్, హైదరాబాద్ – నిర్మలారెడ్డి -
జంతు వధ, అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: జంతు వధ, అక్రమ రవాణా ను నిరోధించేందుకు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. జంతు వధ, అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫిర్యాదులు చేసేందుకు వీలుగా నోడల్ అధికారులను నియమించాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడురోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. నోడల్ అధికారుల ఫోన్ నంబర్లను, జంతుసంక్షేమ బోర్డు మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ప్రధాన పత్రికల్లో ప్రకటనలివ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీ జే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బక్రీద్ సందర్భంగా జంతు వధను, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యదర్శి గోపాలరావు, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజ న వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే ధర్మాసనం శుక్రవారం విచారించింది. జంతు హింసను అడ్డుకోవడానికి చర్యలు తీసుకోకపోవడం సరికాదు ఇదిలా ఉంటే.. జంతు అక్రమ రవాణా, గోవధ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని గుంటూరు మునిసిపల్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. జంతు హింసను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సరికాదంది. పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గుంటూరులో యథేచ్ఛగా గోవధ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గుంటూరు జిల్లా జంతుహింస నిరోధక కమిటీ సభ్యులు దాసరి రామమోహనరావు, జె.సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి న్యాయవాది జె.వి.ఫణిదత్ వాదనలు వినిపిస్తూ.. జంతు అక్రమ రవాణా, గోవధ నిషేధం విషయంలో చట్టనిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో యథేచ్ఛగా గోవధ జరుగుతోందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ విషయంలో పూర్తివివరాలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: బంగారం అక్రమ రవాణా పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం ఐదుగురు వేర్వేరు ప్రయాణికుల నుంచి అధికారులు 4.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్ నుంచి ఈకే–524 విమా నంలో వచ్చిన మహిళ తన తలకు ఉన్న హేర్ బ్యాండ్‌లో 234 గ్రాముల బంగారం తీసుకొచ్చింది. కువై ట్ నుంచి జె9–403 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీలో 855 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చారు. బిస్కెట్లు, గుండీల రూపంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఈకే –526 విమానంలో మరో ముగ్గురు మహిళా ప్రయాణికు లను అనుమానించిన అధికా రులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముగ్గురి లోదుస్తుల నుంచి 3283 గ్రాముల బంగారం పేస్టు ను బయటికి తీశారు. దీని విలువ రూ. 1.72 కోట్లు ఉంటుందని అధికా రులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Anti Drug Day: మత్తును ఆపకపోతే చిత్తే
‘మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు పూర్వపు జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్ర బిందువులుగా మారాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు అక్రమ రవాణా ప్రదేశాలలో ఉన్నాయి. అఫ్గానిస్తాన్, మయన్మార్, కొలంబియా, మెక్సికో, పాకిస్తాన్‌తో పాటు ఇండియాను మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వ నివేదిక గతంలో అభివర్ణించింది. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, యూకే జాతీయ నేర విభాగం, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల– దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలు భారత్ వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి. వాటి ఎజెండాను అమలు కానిస్తే, దేశానికి అంతకు మించిన విపత్తు ఉండదు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు. – డాక్టర్ ఎం.డి. ఖ్వాజా మొయినొద్దీన్ -
పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు సరైన రీతిలో బదులిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అమరులైన కల్నల్ అశుతోష్ శర్మతో పాటు మరో నలుగురు జవాన్ల పట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తరచుగాకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారత్‌లోకి ఉగ్రవాదులను రవాణా చేస్తోందని ఆరోపించారు. జనం ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై పోరాడాలన్న ఆసక్తి పాకిస్తాన్‌కు లేదని, ప్రస్తుతం దాని దృష్టి మొత్తం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడంపైనే ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్‌కు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. -
‘మత్తు’ వదలండి..!
మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని వయసుల వారు మహమ్మారి బారిన పడి సామాజిక అశాంతికి కారణమవుతుండటం కలవరపాటు కలిగిస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారన్న ఐక్యరాజ్యసమితి అంచనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రతీ యేటా రూ.300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోందన్న గణాంకాలు డ్రగ్స్ విస్తృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలైయ్యారని, ఏడాదికి 200 కిలోల కొకైన్ వినియోగిస్తున్నారన్న కఠోర వాస్తవాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని విపరిణామాలు తప్పవన్న ఆందోళన అన్ని దేశాల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది వీడియో చూడండి. -
1,125 నక్షత్ర తాబేళ్ల పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: మన రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 1,125 నక్షత్ర తాబేళ్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తాబేళ్లు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైలు విశాఖకు రాగానే దాడి చేసి 1,125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాబేళ్లను చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి సేకరించి కర్ణాటకలోని చెల్లూరు ప్రాంతం బాలెగౌడనహళ్లి గ్రామంలో అప్పగించారని, అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి.. రైలులో హౌరాకు, అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. -
అసలు గుర్తింపే ప్రశ్నార్థకం...!
మనుషుల అక్రమ రవాణా పద్ధతుల్లో మార్పులు పెనుసవాల్‌గా పరిణమిస్తున్నాయి. మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లల అక్రమ రవాణా సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. అక్రమ విధానాల్లో ఇది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుండడంతో కలకలాన్ని రేపుతోంది. స్త్రీలు, అమ్మాయిలను మాయమాటలు, తప్పుడు వాగ్దానాలతో మోసం చేసి ఇతరదేశాలకు తరలిస్తున్న అక్రమార్కులు కొత్త కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈ విధంగా తరలిస్తున్న వారి ప్రాథమిక గుర్తింపు, జాతీయత అనేవి కూడా తుడిచిపెట్టుకు పోయేలా చివరకు భారత్ పౌరులుగా వారి గుర్తింపు, మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా చేస్తున్నారు. గప్‌చుప్‌గా దాటించేస్తున్నారు.. దేశంలో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. విదేశాల్లో మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉందంటూ స్థానిక ఏజెంట్లు నమ్మించి మహిళలు, అమ్మాయిలను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. చైనా, థాయ్‌లాండ్, సింగపూర్, మయన్మార్ తదితర దేశాల్లో ఇళ్లల్లో పనిమనిషిగా లేదా చిన్న పిల్లల సంరక్షణ వంటి పనులు చేసే వారికి డిమాండ్ ఉందని, ఆహారంతో పాటు వసతి కల్పిస్తాంటూ మంచి జీతాన్ని ఎరగా చూపుతున్నారు. స్థానికంగా అంతగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ఈ మోసపు మాటల పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. ముందుగా ఈ ప్రాంతాల నుంచి వారిని మయన్మార్‌కు తీసుకెళుతున్నారు. మిజోరం బాలికలను సరిహద్దులోని మయన్మార్ గ్రామానికి, మణిపూర్‌కు చెందిన వారిని మరో పట్టణానికి తరలిస్తున్నారు. వీరిని అతి సులభంగా ద్విచక్రవాహనాలపై సరిహద్దు దాటించేస్తున్నారు. మారుపేర్లతో మయన్మార్ పాస్‌పోర్టులు... భారత్, మయన్మార్, గమ్యస్థాన దేశం ఇలా మూడు అంచెల్లో ఈ ఏజెంట్ల నెట్వర్క్ వ్యవస్థ పనిచేస్తోంది. వారు అక్కడకు చేరుకోగానే ఆధార్‌కార్డు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను ఏజెంట్లు తీసేసుకుంటున్నారు. యాంగాన్, తదితర చోట్లకు చేరాక ఈ అమ్మాయిలను వారి రూపురేఖల ఆధారంగా విభజిస్తున్నారు. అందంగా ఉన్న వారిని బ్యూటీపార్లర్లలో, ఇతరులను ఇళ్ల పనుల్లో శిక్షణ నిచ్చి అక్కడి నుంచి మరో దేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. సింగపూర్, థాయ్‌లాండ్‌లకు వెళ్లేందుకు వీలుగా బర్మా భాషలో వారికి శిక్షణనిచ్చి వారికి మారుపేర్లతో మయన్మార్ పాస్‌పోర్టులు సిద్ధంచేస్తున్నారు. మరో దేశానికి చేరిన వెంటనే ఏజెంట్లు వారి పాస్‌పోర్టులు సైతం లాగేసుకుంటున్నారు. బాధితులు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారనే విషయాన్ని కనుక్కోవడం కూడా వారి కుటుంబసభ్యులకు అసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ విధంగా తీసుకెళుతున్న మహిళలు లేదా బాలికల్లో అధికశాతం మందిని ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. అయినా బాధితులు తమ గుర్తింపును కోల్పోయి, కొత్త పేర్లతో చెలామణి అవుతుండడంతో అధికారులు దానిని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ విధంగా మిజోరం నుంచి సింగపూర్‌కు వెళ్లిన 17 ఏళ్ల మెర్సీ ఆత్మహత్యకు పాల్పడితే, ఆమె భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురాలేక పోయారు. ఆమె తల్లితండ్రులు కూడా పేదవారు కావడంతో అక్కడకు వెళ్లేందుకు డబ్బులతో పాటు పాస్‌పోర్టు లేక కనీసం చివరిచూపు కూడా దక్కించుకోలేకపోయారు. మెర్సీ మయన్మార్ పాస్‌పోర్టుపై అక్కడకు వెళ్లినట్టు అప్పుడే బయటపడింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మానవుల అక్రమ రవాణాలో చైనా రికార్డ్
బీజింగ్: ప్రపంచంలోకెల్లా చైనాలోనే మానవుల అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించి పోయిందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో మానవుల అక్రమ రవాణా, దాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను పరిగణలోకి తీసుకొని మానవుల అక్రమ రవాణా సూచికలో చైనాను ‘టైర్ 3’ కేటిగిరీగా ప్రకటించింది. వన్, టూలకన్నా మూడవ టైర్ 3 కేటగిరీ మరీ అధ్వాన్నమైన స్థానం. గత రెండేళ్ల క్రితమే చైనా ఈ కేటగిరీ కిందకు చేరినప్పటికీ దీన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావంతో అమెరికా విదేశాంగ ఉపేక్షించి ఇప్పుడు ఆ కేటగిరీని ప్రకటించింది. చైనాలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి మానవుల అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. ఇందులో పురుషులతోపాటు మహిళలు, పిల్లలు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. వారిని వెట్టి చాకిరీ కూలీలుగా, వ్యభిచారిణులుగా, భిక్షగాళ్లుగా బలవంతాన మారుస్తున్నారు. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేకపోవడం కూడా ఓ లోపమేనని అమెరికా నివేదికలో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని నివేదిక విడుదల సందర్భంగా ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది ప్రజలు అక్రమంగా రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలియజేస్తోంది. మానవుల అక్రమ రవాణాలో సూచికలో ‘టైర్ 3’ కేటగిరిలో చేర్చిన దేశంతో అమెరికా వాణిజ్య నెరపకుండా ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ దేశానికి అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. ఈ విషయమైన చైనా విదేశాంగ శాఖను మీడియా సంప్రతించగా, తాము మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అనవసరంగా అమెరికా తమపై నిందలు వేస్తోందని ఆరోపించారు. ప్రపంచ దేశాల మధ్య పరస్సర సహకారం ఉన్నప్పుడు ఈ మానవుల అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టగలమని అభిప్రాయపడింది. -
దమ్ము దమ్ములో ‘అక్రమం’!
సిటీలో విచ్చలవిడిగా విదేశీ సిగరెట్ల విక్రయాలు పన్ను ఎగ్గొడుతూ అక్రమంగా రవాణా ఇండోనేషియాలో తయారవుతున్న బ్రాండ్లు దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు... సిటీకి చెందిన ఘరానా ముఠా వ్యవహారం ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సిటీబ్యూరో: బంగారం...ఎలక్ట్రానిక్ వస్తువులు...మాదకద్రవ్యాలు. అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన ఓ ముఠా మాత్రం కొన్నాళ్ళుగా సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తోంది. సిగరెట్లలో ఏముందిలే...అనుకుంటున్నారా? ఈ గ్యాంగ్ ఏటా రూ.వందల కోట్ల విలువైన వాటిని ‘దిగుమతి’ చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతోంది. ఇటీవల చందానగర్, మియాపూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకుని, వివిధ బ్రాండ్లకు చెందిన అక్రమ సిగరెట్లు భారీగా స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు కొందరిని అరెస్టు చేసి భారీగా సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా ఆర్థిక నష్టంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటని భావిస్తున్న అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇండోనేషియా టు సిటీ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు డీఆర్ఐ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియాలో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలించకుండా...దుబాయ్ మీదుగా వస్తున్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఓసారి ఓడలు, మరోసారి విమానాలు... సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్ 2014లో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. 2015 నుంచి పంథా మార్చిన అదే గ్యాంగ్ ఇంజనీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా 2015 అక్టోబర్ 13న దాడి చేసిన డీఆర్ఐ రూ.51 లక్షల వలువైన 85,000 సిగరెట్లు స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను... ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులకు నష్టం కలిగించే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోని వెదజల్లుతోంది. రిటైలర్లకు కమీషన్లు ఎక్కువగా ఇస్తూ వారితో అమ్మకాలు చేపడుతోంది. భారీగా మార్కెట్లోకి వెళ్ళాకే... సిగరెట్ల స్మగ్లింగ్‌లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి డీఆర్ఐ, పోలీసు ఇతర అధికారులు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్లోకి వెళ్ళిపోయిన తరవాతే గుర్తించగలుగుతున్నారు. అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు... విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో, ఎయిర్కార్గొ కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. కస్టమ్స్ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్ కస్టమ్స్ తరఫున పని చేసే కస్టమ్స్ హోమ్ ఏజెంట్లు (సీహెచ్ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కట్టింది. ఎగుమతి, దిగుమతి చేస్తున్నట్లు బోగస్ కంపెనీల పేర్లతో లెటర్ హెడ్స్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటకు తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్యానికీ చేటనే అనుమానం... అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని డీఆర్ఐ అనుమానిస్తోంది. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి అధికారులు ఆయా సిగరెట్లు కాలుస్తున్న పొగరాయుళ్ళతోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిగరెట్లు ఎక్కువసేపు కాలతాయని, ఎంజాయ్మెంట్ ఎక్కువని చెప్పారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. -
లారీ.. ఏ దారి?
⇒గంజాయి లారీ గంగవరం పోర్టు వైపు వెళ్లడంతో అనుమానాలు! ⇒అక్రమ రవాణా ఎళ్లలు దాటుతున్నా దృష్టి సారించని అధికారులు ⇒‘డీఆర్ఐ’కు పట్టుబడిన సరకు విలువ రూ.కోటి పైమాటే ⇒కేసును తారుమారు చేసేందుకు యత్నాలు విశాఖపట్నం : ఏజెన్సీ నుంచి అనేక మార్గాల్లో.. అనేక విధాలుగా గంజాయి ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి విదేశాలకు అక్రమంగా రవాణా జరుగుతోంది. స్థానికంగా జరిగే రవాణాపై తప్ప విదేశాలకు జరిగే స్మగ్లింగ్‌పై ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పెద్దగా దృష్టి సారించింది లేదు. పోనీ స్థానికంగానైనా అడ్డుకుంటున్నారా అంటే.. మాటలు తప్ప పెద్దగా దృష్టి సారించింది లేదు. కలెక్టర్ దగ్గర్నుంచి అన్ని ప్రభుత్వ విభాగాల అధికార ప్రతినిధులు ప్రత్యేకంగా కమిటీగా ఏర్పడి సమీక్షలు జరిపినా ఆశించినంత ఫలితం కనిపించలేదు. అయితే గంజాయి అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) కొట్టిన దెబ్బ సంచలనమైంది. విశాఖ ఏజెన్సీ నుంచి జాతీయ రహదారి మీదుగా శనివారం రాత్రి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ లారీని షీలానగర్ సమీపంలో డీఆర్ఐ విశాఖ ప్రాంతీయ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లారీలో రూ.కోటిపైగా విలువైన 1,161 కిలోల గంజాయిని గుర్తించినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. స్మగ్లర్లు తెలివిగా ఎవరికీ అనుమానం రాకుండా 3 కిలోల చొప్పున 386 ప్యాకెట్లుగా చేసి లారీలో ఎక్కించారు. వాటిపై టార్పాలిన్ కప్పి, దానిపై గ్రావెల్ పోసేశారు. చూసిన వారెవరైనా గ్రావెల్ లారీగానే భావిస్తారు తప్ప లోపల గంజాయి ఉందనే అనుమానం ఏ మాత్రం రాదు. ట్రక్కుల్లో పైకి కనిపించని చోట, ఆటోల కింద, అంబులెన్సుల్లో, చివరికి మనిషి నడుం చుట్టూ కట్టుకుని కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్న ఉదంతాలు చాలానే వెలుగు చూశాయి. కానీ ఇంత భారీ స్థాయిలో రాళ్ల మాటున మత్తు మందు రవాణా సాగిస్తుండటం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇంత భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా వెనుక చాలా పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. విశాఖ ఏజెన్సీ నుంచి విదేశాలకు నేరుగా విశాఖ నుంచే స్మగ్లింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. గంజాయి లోడుతో లారీ గంగవరం పోర్టుకు వెళుతుండగా గంగవరం ఫ్లైఓవర్ వద్ద డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారని ముందుగా వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారిక ప్రకటనలో ఆ ప్రస్థావన లేదు. దీనికి తెరవెనుక పెద్దల మంత్రాంగం నడిపినట్లు సమాచారం. లారీతో పట్టుబడ్డ వ్యక్తిపై నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరి కోసం వేట ప్రారంభించామని డీఆర్ఐ చెబుతోంది. కానీ లారీ వెళ్లిన మార్గాన్ని బట్టి చూస్తే కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకు నుంచి గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఇక్కడి నుంచి బయలుదేరిన సరకు వయా పెందుర్తి, గోపాలపట్నం, ఎన్ఎడీ, షీలానగర్, గాజువాక మీదుగా విజయవాడ వైపు వెళ్లాలి. కానీ గాజువాక నుంచి యుటర్న్ తీసుకుని కొత్త గాజువాక వైపుగా బార్ చెరువు రోడ్డు నుంచి గంగవరం పోర్టుకు చేరుతుండగా ఫ్లైఓవర్ వద్ద డీఆర్ఐ అధికారులు లారీ పట్టుకున్నట్లు తెలిసింది. డీఆర్ఐ అధికారులు లారీని సరకుతో సహా షీలానగర్‌లోని ఓ గోడౌన్‌కు తరలించారు. ఆ సమయంలో సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గాజువాక పోలీసులను కూడా వారు గోడౌన్‌లోకి అనుమతించలేదు. ఆదివారం నాటి ప్రకటనలో మాత్రం లారీని షీలానగర్ సమీపంలో పట్టుకున్నామని మాత్రమే చెప్పారు. మిగతా విషయాలు దాచిపెట్టడం వెనుక బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఏజెన్సీ నుంచి ఇంత భారీ స్థాయిలో సరుకు గంగవరం పోర్టు వైపు వెళ్లడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసు ఆధారంగా పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు గంజాయి స్మగ్లింగ్ జరిగే అవకాశాలపై డీఆర్ఐ అధికారులు లోతుగా పరిశోధన చేసే అవకాశం ఉంది. -
లైంగికదాడి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
-
లైంగికదాడి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
గౌహతి : లైంగిక దాడి కేసులో మేఘాలయ ఎమ్మెల్యే జూలియస్ డార్పాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రి కుమారుడితో పాటు నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తనను గెస్ట్‌హౌస్‌కు పిలిపించి దాడికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను గౌహతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను షిల్లాంగ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా జూలియస్ డార్పాంగ్ మౌహతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన ఆయన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక దందా
అదే అధికార పార్టీ నేతల పంథా నదీ పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చోడవరం ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఇసుక రవాణా బెల్లం పెనాల్లో నది నుంచి ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్న ఇసుకాసురులు నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు, శిక్షలు వేసినా ఆగని దందాలు.. ఇసుక మాఫియా ఎక్కడా తగ్గడంలేదు.. దీనికి కారణం కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్ శారద, మైనర్ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. అనుమతి లేకుండా ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇసుక రీచ్‌లను అక్రమంగా ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. చోడవరం :ఇసుకాసులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. చోడవరం, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, మాడుగుల, అనకాపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట, నక్కపల్లి, కశింకోట మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ఈ ఇసుక మాఫియాకు పరోక్షంగా అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో ఇసుక రీచ్‌లపై అధికారులు దాడులు చేయడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒత్తిడి చేసి వారిని విడిపించుకెళ్లడం పరిపాటిగా జరుగుతుంది. ఇటీవల చోడవరం వ ముద్దుర్తి, గవరవరం, జుత్తాడ, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్‌లలో వందలాది క్యుబిక్ మీటర్ల ఇసుకను అధికారులు పట్టుకున్నారు. వీటిలో బుచ్చెయ్యపేట మండలంలో పట్టుకున్న కొన్ని లారీలను స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేర అధికారులు వదిలేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద మళ్లీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు ఇసుకాసురులు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు అన్ని చోట్ల నదుల్లో జేసీబీలు, ఇతరత్ర రూపాల్లో ఇసుకను తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ఇక్కడ మాత్రం బెల్లం తయారుచేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, యడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు అంటున్నారు. ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం సంగమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఇసుక తవ్వకాలపై ఇప్పటికే దాడులు చేశాం. మళ్లీ ఈ రేవుతోపాటు మిగతా రీచ్‌లపై కూడా దాడులు చేస్తాం. కొత్త నిబంధనల ప్రకారం దొరికిన లారీకి రూ.లక్షకు పైగా జరిమానా, రెండేళ్లు జైలు కూడా పడుతుంది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. వెంటనే తవ్వకాలు ఆపకపోతే కేసులు నమోదు చేస్తాం. –రామారావు, తహసీల్దార్, చోడవరం -
నలుగురు మావోయిస్టుల లొంగుబాటు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దళ సభ్యులైన నీలగుణి పద్మనాభ, భారతీ దంపతులతో పాటు రాజు, రిజ్వాన్‌బేగం అలియాస్ కల్పన దంపతులు మంగళూరు కలెక్టర్ సత్యవతి, ఎస్పీ అణ్ణామలై, పంచాయతీ సీఈవో రాగప్రియ సమక్షంలో లొంగిపోయారు. నీలగుణి పద్మనాభపై అయుధాల అక్రమ రవాణా, భౌతిక దాడులు, పేలుడు పదార్థాల వినియోగం తదితర విషయాలకు సంబంధించి 19 కేసులు, రిజ్వాన్‌బేగంపై రెండు కేసులు ఉన్నారుు. భారతి, రాజులపై కేసులు నమోదు కాకపోరుునా మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారు. పద్మనాభపై రూ.5 లక్షలు, భారతి, రిజ్వాన్ బేగంపై రూ.లక్ష రివార్డులు ఉండేవి. వీరు న్యాయక్కాగినావు సంస్థ సభ్యులైన గౌరి శంకర్, ఏకే సుబ్బయ్య తదితరుల చొరవ వల్ల లొంగిపోయారు. ఈ నలుగురూ కొన్నేళ్లుగా బెంగళూరులోనే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారని సమాచారం. -
ప్రాణం తీసిన బెల్లం అక్రమ రవాణ
కురవి : బెల్లం అక్రమ రవాణా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన మండలంలోని నేరడ శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరడ శివారు కాకులబోడు తండాకు చెందిన బానోత్ లాల్‌సింగ్(22), గుగులోత్ రెడ్డి, గుగులోత్ నరేష్ రెండు ద్విచక్రవాహనాలపై బెల్లం బస్తాలు తెచ్చేం దుకు మహబూబాబాద్ మండలంలోని చోక్లాతండాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయినిపట్నం క్రాస్ రోడ్ వద్ద ఓ వాహనం వెళ్తుండడాన్ని చూసి పోలీ సులుగా భావించి తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పక్కన ఆపారు. బెల్లం బస్తాలు పక్కన పడేసి సమీపంలోని మిరపతోటలోకి వెళ్లారు. కాగా, తోటలో ఉన్న మరో వ్యక్తి వీరిని చూసి ‘దొంగలు..దొంగలు..’ అని అరిచాడు. దీంతో ఆ ముగ్గురూ పరుగుతీశారు. ఈ క్రమంలో బానోత్ లాల్‌సింగ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. రెడ్డి, నరేష్ రోడ్డుపైకి వచ్చి తమ బైక్‌పై కాకులబోడు తండాకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక లాల్‌సింగ్ బావిలో పడ్డాడని, అందులో వెతకాలని బంధువులకు ఫోన్ చేశారు. తండాలోని కొందరు వ్యక్తులు బావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్లతో వెతికినా కనిపించలేదు. ఈలోగా మిరప తోటలోని వ్యక్తి సమాచారం అందించడంతో రాత్రి 12 గంటలకు పోలీసులు వచ్చి బెల్లం బస్తాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బావిలో వెతికి లాల్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
8 నెలలు.. 356 మిస్సింగ్ కేసులు
ఇంకా దొరకని 47 మంది ఆచూకీ అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలు అదృశ్యంతో కుటుంబాల్లో విషాదం పెరుగుతున్న మిస్సింగ్ కేసులు జిల్లాలో మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలువురి ఆచూకీ దొరుకుతుండగా.. మరికొందరేమో మాయమై ‘పోతున్నారు’.. ఇంకొందరి ఆచూకీ అసలే దొరకడం లేదు. ఎనిమిది నెలల్లో 356 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిల్లల నుంచి యువత వరకు మిస్ అవుతున్నారు. అదృశ్యమవుతున్న వారిలో 18 ఏళ్ల లోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోజురోజుకూ మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. చిన్నపెద్ద తేడా లేకుండా అదృశ్యమవుతున్నారు. ఇంటి నుంచి మాయమై.. సొంత వారికి దూరమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 356 మిస్సింగ్ కేసులు నమోదుకాగా 309 కేసులను గుర్తించారు. ఇంకా 47 మంది ఆచూకీ దొరకలేదు. 2014 సంవత్సరంలో 336 కేసులు నమోదుకాగా 299 మందిని గుర్తించారు, 37 మంది ఆచూకీ తెలియలేదు. 2015 సంవత్సరంలో 504 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 427 మందిని గుర్తించారు. 77 మంది ఆచూకీ దొరకలేదు. మొత్తం మూడేళ్లలో 162 మంది ఇంకా అదృశ్యంలోనే ఉన్నారు. దీంతో తమవారు కనిపించక అదృశ్యమైన వారి కుటుంబాలు శోకసంద్రంలో ఉండిపోయాయి. అదృశ్యమైన వారిలో 18 సంవత్సరాల్లోపు బాలబాలికలు, మహిళలు, పురుషులు ఉన్నారు. వీరంతా అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటీవల అక్రమ రవాణాకు సంబంధించి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్ కేసులు పెరిగిపోవడం కలకలంరేపుతోంది. పోలీసు స్టేషన్లలో బాధిత కుటుంబాలు తమవారు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాన్ని మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తున్నారు. ఇందులో ఇంటి నుంచి పారిపోయారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, మరేదైనా కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయారా అనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు. పెళ్లి చేసుకుంటున్నారు.. యువతుల మిస్సింగ్ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే ఎక్కువ. సాధారణంగా యువతులు అదశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెడుతున్నారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనార్టీ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమవివాహం చేసుకున్నారా లేదా ఎక్కడైనా వేధింపులకు గురవుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా చేతికొచ్చిన పిల్లలు అందకుండా పోతున్నారనే బాధ తల్లిందుడ్రుల్లో నెలకొంటుంది. ఒకవేళ అదశ్యమై పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇంటికి రాకుండా బయటే ఉండే పిల్లల గురించి తల్లిదండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనతోనే మరి కొంత మంది గడుపుతున్నారు. మిస్సింగ్ కేసులపై గాలిస్తున్నాం.. ప్రస్తుతం మిస్సింగ్ కింద నమోదైన కేసుల్లో చాలా వరకు పురోగతి ఉంది. ఎప్పటికప్పుడు కేసును దర్యాప్తు చేసి అదృశ్యమైన వారికోసం గాలిస్తున్నాం. కొంత మంది యువతులు ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేస్తున్నాం. కానీ వారు కొన్ని రోజుల తర్వాత ప్రేమవివాహాం చేసుకుని వస్తున్నారు. ఇకా పిల్లల అదృశ్యంపై పోలీసు నిఘా ఉంచాం. - సత్యనారాయణ, వన్‌టౌన్ సీఐ పిల్లల అక్రమ రవాణా.. జిల్లాలో అదృశ్య కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అదృశ్యమైన వారిలో 10 శాతం మంది ఆచూకీ దొరకడం లేదు. ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో చిన్నపిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు తిరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబాయి, నాగ్‌పూర్‌లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడేళ్లలో ఇప్పటి వరకు 60 మంది పిల్లల ఆచూకీ తెలియలేదు. బాలబాలికల్లో కొంత మంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతో ఇంటిని విడిచివెళ్లిపోగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇలా అదశ్యమైన వారిలో కొంత మంది ఇంటికి తిరిగివస్తుండగా మరికొందరి ఆచూకీ దొరకడం లేదు. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం చేసుకుంటున్నారని, కొంత మందిని లైంగిక వేధింపులకు గురిచేసి మళ్లీ తిరిగి ఇక్కడ వదిలేసి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక మహిళలకు డబ్బులు ఎరవేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై. ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గళ్లీలో ఆడుకుంటున్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలపై నిఘా పెట్టాలి. ఐసీడీఎస్, పోలీసులు ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మిస్సింగ్ కేసుల కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్ కరీంనగర్లో ఉంది. పోలీసులతో పాటు ఈయూనిట్ బృందం కూడా మిస్సింగ్ కేసులపై గాలించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్‌రోడ్ ప్రాంతానికి చెందిన చల్లవార్ పుష్ప ( 72) అనే వృద్ధురాలు 2015 ఆగస్టు 7న సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె అదృశ్యమై ఏడాది గడుసున్నా ఇంకా ఎలాంటి వివరాలు తెలియలేదు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన సంతోష్ కుమారుడు వినోద్ (7), కూతురు రాధ ( 5) గత ఏడాది డిసెంబర్ 22న సాయంత్రం ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లిన వీరు ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సంతోశ్ వన్టౌన్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియలేదు. జిల్లా కేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన నన్నెపు సంపత్‌రాజ్ ( 26) ఈ ఏడాది జూలై 3న ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకి వెళ్తున్నాని చెప్పి బయల్దేరాడు. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇంక ఛేదనలోనే ఉంది. సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన బోరె సురేశ్ ( 21) ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి కనపించడం లేదు. మెకానిక్‌గా పనిచేస్తున్న సురేశ్ 23 నుంచి ఇంటిని వదిలి వెళ్లి ఇప్పటికీ కనిపించకుండా పోయాడు. -
అక్రమ వ్యాపారానికి అడ్డగా ఉందని..
అమీర్‌పేట: అక్రమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుందని భావించిన కొందరు వ్యక్తులు కుక్కపై రాళ్లతో దాడి చేశారు. చికిత్స పొందుతూ శనివారం ఆ కుక్క మృతి చెందింది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం...బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన దయానంద్‌కు కుక్కలంటే ప్రేమ. తన ఇంట్లో 7 సంవత్సరాల వయసుగల ల్యాబ్‌రా జాతికి చెందిన జిమ్మీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. ఇంటికి కాపలాగా కూడా ఉంటున్న జిమ్మీ రాత్రి వేళ ఎంతో అప్రమత్తంగా ఉండేది. కాగా స్థానికంగా కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలు (గాంజాయి) విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు అర్థరాత్రి సమయంలో పలువురు రాజ్‌నగర్‌కు వచ్చి తిష్టవేస్తుండగా...వారిని చూసి జిమ్మీ మొరిగేది. దీంతో తమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుంది భావించిన కొందరు వ్యక్తులు...యజమాని ఇంట్లో లేని సమయంలో దానిపై రాళ్లతో దాడిచేశారు. కళ్లు, తలపై తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. దీన్ని గమనించిన యజమాని దయానంద్ చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జిమ్మీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యజమాని దయానంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అక్కడి వైద్యులు జిమ్మీ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఆర్థిక సమస్యలతోనే ట్రాఫికింగ్
► అంతర్జాతీయ సదస్సులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు అనంతపురం ఎడ్యుకేషన్ : మానవ అక్రమ రవాణాకు ఆర్థిక అంశాలే మూలం అని మైచాయిస్ ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్లు వీవీఎన్ ఇసాక్ (ఆస్ట్రేలియా), మాథ్యూస్ డీబీర్ (దక్షిణాఫ్రికా) అన్నారు. ‘మానవ అక్రమ రవాణా – సవాళ్లు – ప్రమాణాలు’ అనే అంశంపై ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో గురువారం రెండో రోజు నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో వారు మాట్లాడారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులతోపాటు ఒడిస్సా రాష్ట్ర బర్హంపూర్‌లోని లింగరాజు లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ చరణ్ పట్నాయక్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.సంజీవరెడ్డి, ఎస్కేయూ ప్రొఫెసర్ అమర్నాథ్దాస్, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భానూజ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను రూపు మాపడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్ ఎన్. రంగస్వామి, సదస్సు కన్వీనర్ ఏసీఆర్ దివాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి టీఎస్ శ్యామ్‌ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
నకిరేకల్ః హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో అధిక ఫీజులు నియంత్రించాలని కోరుతూ కళాశాల ముందు నిరసన తెలుపుతున్న పీడీఎస్‌యూ విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి జీడి ప్రవీణ్ డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ నకిరేకల్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు నోముల సతీష్, శ్రవణ్, నాగరాజు, ఉపేందర్, వెంకటేష్, హిమబిందు, మౌనిక, సమత, సౌజన్య, సైదులు, అనీల్ ఉన్నారు. -
గంజాయి కేసూ గల్లంతే
సూత్రధారులకు పసుపు ముసుగు చివరికి డ్రైవర్ బలిపశువయ్యాడు కేసు మాఫీకి రాజకీయ పైరవీలు అతీగతీ లేని గంజాయి రవాణా కేసు అధికార పార్టీలోకి వెళ్లగానే తప్పులు ఒప్పులవుతాయా?.. అదేలా.. తప్పు తప్పే కదా!.. ఎక్కడున్నా కేసు కేసే కదా!! అంటారా.. అరకులో ఇటీవల పార్టీలు జంప్ చేసిన నేతలను అడగాల్సిందే. అప్పుడుగానీ.. ఎప్పుడు తప్పో.. ఎప్పుడు ఒప్పో.. మీకు తెలిసిరాదు.. లేదంటే ఈ కథనం చదవండి.. మీకే అర్థం అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు ఉన్నారు. వీరంతా ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లగానే ఆ కేసును ఎక్సైజ్ పోలీసులు అటకెక్కించేశారు. గంజాయి తరలిస్తున్న వాహనం డ్రైవర్‌ను మాత్రం బలి చేసి కేసును నిర్వీర్యం చేసేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి. విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు, అక్రమ రవాణాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాలకు టీడీపీ నేతలే అండదండలు అందిస్తున్నారు. పొరపాటున పోలీసుల దాడుల్లో పట్టుబడితే చిన్న చేపలను బలిచేసి కేసులను నీరుగార్చేస్తున్నారు. 2014 ఆగస్టు 10న నమోదైన గంజాయి రవాణా కేసును పరిశీలిస్తే.. మన్యంలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో సుమారు 350 కిలోల గంజాయిని జి.మాడుగుల-పాడేరు ప్రధాన మార్గంలో రాత్రి వేళ తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వేర్వేరుగా ఆ రోడ్డులో మాటు వేశారు. పోలీసులను చూసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయిన అంబులెన్స్‌ను ఎట్టకేలకు పాడేరు- సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు. డ్రైవర్ పరారు కాగా, సుమారు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో గంజాయి తరలింపు వెనుక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు దళారుల హస్తం ఉందన్న వాదనలు వినిపించాయి. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముందుగా అంబులెన్స్ డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. సూత్రధారులు తమ నాయకుడైన ఓ ప్రజాప్రతినిధితో ఒత్తిడి తేవడంతో పోలీసులు కేసును పట్టించుకోవడం మానివేశారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు.. అసలేం జరుగుతోంది.. అన్న కోణంలో అధికారుల దర్యాప్తు సాగలేదు. పట్టుబడిన అంబులెన్స్‌కు ముందు పెలైట్‌గా వెళుతున్న బైక్‌ను అప్పట్లో జి.మాడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నడిపిన వ్యక్తి మాత్రం పరారయ్యాడు. ఇప్పటికీ ఆ నిందితుడు ఎవరనేది పోలీసులు కనిపెట్టలేదు. బైక్ మాత్రం నేటికీ జి.మాడుగుల స్టేషన్లోనే ఉంది. స్థానికసంస్థల ప్రజాప్రతినిధి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి నేతగా హల్చల్ చేస్తుండటంతో ఇక ఆ కేసు ఊసు కూడా పోలీసులు ఎత్తడం లేదు. గంజాయి రవాణా వ్యవహారంలో ఒక్క డ్రైవర్‌ను మాత్రమే బలిచేసి కేసును దాదాపుగా మూసేశారు. అసలు నిందితులు తప్పించుకున్నారు.. -డ్రైవర్ మత్స్యరాజు ఆరోపణ ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని గోమంగి ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ మత్స్యరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజు ఉదయం ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఉంచి పాడేరులోని తమఇంటికి వెళ్లిపోయాయనని.. అయితే మరుసటి రోజు అంబులెన్స్ గంజాయితో దొరికిందంటూ తనపై కేసు పెట్టారని చెప్పారు. తాను గంజాయి లోడ్‌తో అంబులెన్స్‌ను నడపలేదని చెప్పినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిందితులు తప్పించుకొని, తాననొక్కడినే బలి చేశారని చెప్పారు. ఆ కేసులో వాస్తవంగా ఎవరెవరు ఉన్నారనేది పోలీసులకు తెలుసునని వ్యాఖ్యానించాడు. ఆరోపణలు వచ్చాయి.. కానీ..: ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర అప్పట్లో ఆ వాహనాన్ని తానే పట్టుకున్నానని ప్రస్తుతం గాజువాకలో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న ఉపేంద్ర చెప్పారు. ‘ఇప్పటివరకు డ్రైవర్ ఒక్కరినే అరెస్టు చేశాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది దీని వెనుక సూత్రధారులని ఆరోపణలు వచ్చాయి. కానీ.. పక్కా ఆధారాలు లభించలేదు. మరో ముగ్గురు నిందితులపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం’.. అని ఆయన చెప్పారు. కేసును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారన్న వాదనలపై మాట్లాడుతూ తాను అప్పట్లో పాడేరులో మొబైల్ పార్టీ సీఐగా మాత్రమే పనిచేశానన్నారు. నిందితులను పట్టుకుని అప్పజెప్పడం మినహా దర్యాప్తులో తమ పాత్ర ఉండదన్నారు. ఈ కేసు విషయమై ప్రస్తుత పాడేరు ఎక్సైజ్ సీఐ కె.రాజారావుతో ‘సాక్షి’ మాట్లాడగా, తాను ఇటీవలే బదలీపై వచ్చానన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుని నిష్పక్షపాతంగా విచారణ చేపడతానని చెప్పారు. దోషులు అధికార పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదన్నారు. ఎమ్మెల్యే రాజీనామాకు సీపీఎం డిమాండ్ ఆనంతగిరి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని అనంతగిరి ఎంపీటీసీ సభ్యుడు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డి.గంగరాజు, సీపీఎం మండల కార్యదర్శి మొస్యాలు డిమాండ్ చేశారు. వారు బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో డీ ఫాం భూముల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్నారు. పాడేరు సబ్ కలెక్టర్ మంగళవారం బహిరంగ విచారణ చేసిన సమయంలో నడిమివలస, పందిరివలసకు చెందిన బాధితులు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి డబ్బులు ఇచ్చి తమ పట్టాలు తీసుకున్నారని తమ దృష్టికి తీసుకుని వచ్చారన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ!
పోలీసులను ఆయుధంగా మార్చుకున్న దేశం రాజ్యాంగేతరశక్తిగా ముఖ్యనేత, ఆయన తనయుడు జిల్లాలో కొనసాగుతున్న అణచివేత...అరాచకాలు ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు చెప్పిందే శాసనం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉంటూ సమాజంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్న వైనంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నా మరో వైపు అణచివేత, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేత, ఆయన తనయుడు రాజ్యాంగేతరశక్తిగా మారి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. పోలీసులను ఆయుధంగా మలచుకొని తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం. కన్ను పడితే కబ్జానే.. వ్యాపారమైనా, భవన నిర్మాణమైనా, చివరకు లాటరీ తగిలినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు. - సాక్షి, గుంటూరు గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత, ఆయన తనయుడు సాగిస్తున్న అరాచక పాలన చూస్తే భీతిల్లాల్సిందే. దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అక్రమ రవాణా, నెలవారీ వసూళ్లు ఇలా పలు రకాల నియంతృత్వ పోకడలు అనుసరిస్తూ వివిధ వర్గాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. వీరి వ్యవహారశైలికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయకంపితులవుతున్నారు. వ్యాపారులు సైతం కలవరపాటుకు గురవుతున్నారు. నరకాసుర కోటగా .... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నరసరావుపేటను సరకాసుర కోటగా మార్చేశారు. సత్తెనపల్లిని సర్వ నాశనం చేసేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎవరైనా సరే ముఖ్యనేత తనయుడు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఆయనకు కావాలంటే సొంత భూమినైనా వదిలేసి వెళ్లాల్సిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో కేబుల్ నెట్వర్క్ నడుపుతున్న వారిని బెదిరించి తమ కనెక్షన్లు మాత్రమే ఉండాలంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నరసరావుపేట పట్టణంలో ఏడాది కిందట జీసీవీని తనకు అప్పగించాలంటూ ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో తన గూండాలను పంపి దాడులకు తెగబడ్డారు.కార్యాలయంపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. నేటికీ ఆ కేసులో ఒక్క నిందితుడిని కూడా గుర్తించని పరిస్థితి. ఎన్‌సీవీని నిర్వీర్యం చేయాలనే... పట్టణంలో నడుస్తున్న ఎన్‌సీవీని సైతం నిర్వీర్యం చేసి తన చానల్ మాత్రమే ఉండాలనే పథక రచన చేశారు. ఎన్సీవీ నుంచి కనెక్షన్లు తీసుకుంటున్న కేబుల్ ఆపరేటర్లను ఒక్కొక్కరినీ బెదిరిస్తూ తమ వైపున కు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిత్యం కేబుల్ వైర్లు కట్ చేయడం.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత చేసినా ఎన్సీవీ యాజమాన్యం లొంగకపోవడంతో సోమవారం సాయంత్రం ఎన్సీవీ కార్యాలయంపై తన గూండాలతో దాడి చేయించి వైర్లు కట్ చేయడమే కాకుండా కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు విన్నవిస్తున్నారు. -
చీకట్లో ‘చిట్టి’ తమ్ముడి దోపిడీ!
దూసి ర్యాంపులో ఆగని ఇసుక అక్రమ రవాణా ర్యాంపు మూసివేస్తూ కలెక్టరు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు శ్రీకాకుళం: ఇసుకాసురలు పేట్రేగిపోతున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ పనిని కానిచ్చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇసుక ముఠా దూసి గ్రామానికి వరద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నా స్థానికులు ప్రశ్నించలేకపోతున్నారు. అడిగితే దాడి చేయడం లేదంటే సంక్షేమ పథకాలు అందకుండా వేధింపులకు గురిచేయడం సర్వసాధారణమైపోయింది. అధికార పార్టీ నాయకుల అడ్డగోలు దోపిడీపై జిల్లా ఉన్నతాధికారులే తూతూమంత్రపు చర్యలతో సరిపెడితే సామాన్యులం తామేమి చేయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస మండలం దూసి ర్యాంపులో 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి నాలుగు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే సొంత తమ్ముడే దూసి ర్యాంపుపై కన్నేశాడు. గుంటూరు ముఠాతో చేతులు కలిపి యథేచ్ఛగా దోపిడీకి తెరతీశాడు. ప్రభుత్వం విధించిన పరి మితిని మించి ఇసుక అక్రమ తరలింపు నిన్నా మొన్నటి వరకూ కొనసాగుతూనే ఉంది. దీనిపై ‘సాక్షి’ కథనం ఇవ్వడంతో తాత్కాలికంగా తెరపడింది. అయితే నాగావళి వరద వస్తుందని ఊహించిన ఈ ముఠా ముందస్తుగా వేల మీటర్ల ఇసుక తవ్వేసి నది ఒడ్డున గుట్టలుగా వేసింది. ఇక ర్యాంపులో ఎలాంటి తవ్వకాలు కానీ, ఇసుక రవాణా కానీ చేయకూడదని స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టరు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ రాత్రిపూట ఆ ఇసుకను లారీలకు ఎత్తేసి ఆ ముఠా నిర్భయంగా తరలించేస్తోంది. మిగిలిన ఇసుకనైనా సీజ్ చేసి ప్రజావసరాలకు ఉపయోగించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికే భయపడిపోతున్నారు. ఈ విషయమై ఆమదాలవలస తహసీల్దారు తారకేశ్వరి వద్ద ప్రస్తావించగా.. స్థానిక వీఆర్వోను అలెర్ట్ చేశామని చెప్పారు. అయితే ర్యాంపు వద్దకు వెళ్లడానికి పోలీసు సహాయం కోసం బుధవారం ఉదయం నుంచి ఫోన్లో ఎస్సైను సంప్రదించడానికి ప్రయత్నించామని, కానీ స్పందన రాలేదన్నారు. ఈ విషయమై సీఐ డి.నవీన్‌కుమార్ వివరణ కోరగా... ఎస్సై స్థానికంగానే ఉన్నారని, అయితే రెవెన్యూ అధికారులు ఎవ్వరూ తమను రక్షణ కోరలేదని సమాధానం ఇచ్చారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టరు ఇచ్చిన ఆదేశాలు కూడా సరిగా అమలుకాలేదంటే ఎమ్మెల్యే గారి ‘చిట్టి’ తమ్ముడి హవా ఏమిటనేదీ అర్థం చేసుకోవచ్చు. మరో దోపిడీకి ఏర్పాట్లు! ఇప్పటికే 20 మీటర్ల లోతున ఇసుక తవ్వేసి దూసి ర్యాంపును దోచుకున్న సదరు ముఠా... మరోచోట దోపిడీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. దూసి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని రైల్వే క్వార్టర్ల పక్క నుంచి కొత్తగా మార్గం చేసుకొంటోంది. ఇప్పటికే భారీ లారీల వల్ల ప్రాణభయంతో ఉన్న స్థానికులు ఇప్పుడు ఏకంగా నివాసాల మధ్యనుంచే మార్గం ఏర్పాటు చేస్తున్నా నోరెత్తలేని పరిస్థితి. -
ఇసుక దుమారం
ఇసుక అక్రమ రవాణాపై మండలిలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం అరికట్టలేమని అధికారులే చేతులెత్తేశారు మంత్రుల కుమారులే అక్రమార్కులు ! మండలిలో కే.ఎస్ ఈశ్వరప్ప సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తే సహకార రుణాల వడ్డీ మాఫీ : మంత్రి మహదేవ బెంగళూరు: శాసన మండలిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అధికార విపక్షాల మధ్య మంగళవారం తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సభా కార్యక్రమాల్లో భాగంగా మండలి విపక్ష నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ... మైసూరు, కోలారు జిల్లా పర్యటనలో భాగంగా ఇసుక అక్రమ రవాణా విషయమై అక్కడి కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రశ్నించానని తెలిపారు. ఇందుకు వారు తాము నిస్సాహాయులమని చేతనైతే చట్టసభల్లో ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయండని పేర్కొన్నారన్నారు. దీంతో అక్కడే ఉన్న ఇందన శాఖ మంత్రి డీ.కే శివకుమార్ ‘మీరు మంత్రులుగా పనిచేశారు. ఏ అధికారైనా అలా మాట్లాడుతారా? మీరు కల్పించుకుని చెప్పకండి!’ అని పేర్కొన్నారు. ఇందుకు ప్రతిస్పందించిన కే.ఎస్ ఈశ్వరప్ప ‘అమ్మతోడు జిల్లా అధికారులే అలా అన్నారు. మంత్రుల కుమారులు కూడా కొంతమంది ఈ ఇసుక అక్రమ రవాణా దందాలో భాగస్వాములై ఉన్నారు.’ అని పేర్కొన్నారు. ఇందుకు విపక్ష ఎమ్మెల్సీలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సమయంలో అధికార విపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. చివరికి సభాపతి డీ.హెచ్ శంకరమూర్తి కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇక శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా ఉభయ సభల్లో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన ప్రశ్నలు అందుకు సంబంధిత మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి... టోల్గేట్లలో అంబులెన్స్, వీఐపీ వ్యక్తులకు సంబంధించిన వాహనాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రయాణం చేయడానికి వీలుగా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప తెలిపారు. రాష్ట్రంలోని వివిధ సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు అసలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని మహదేవప్ప పరిషత్‌కు తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన పౌరకార్మికుల సేవలను క్రమబద్ధం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి ఈశ్వర్ఖండ్రీ తెలిపారు. రైతులపై ఒత్తిడి తీసుకువచ్చి వారి బలవన్మరణాలకు పాల్పడడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 1,332 మందిపై కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ఆన్లైన్లో వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే విషయమై ప్రణాళికలు రచిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ప్రతి తాలూకా కేంద్రంలో పశువుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి ఏ.మంజు పేర్కొన్నారు. -
22 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 22.45 క్వింటాళ్ల గంజాయిని హయాత్‌నగర్ పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నగరానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారంతో హయాత్‌నగర్ పోలీసులు అబ్దుల్లామెట్ వద్ద కాపు కాశారు. గంజాయి లోడుతో వచ్చిన డీసీఎం వ్యానును ఆపి అందులోని 22.45 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
రెండు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
♦ ఎడపల్లి కేంద్రంగా ఢిల్లీకి రవాణా ♦ ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు, పరారీలో ఒకరు ♦ రూ. 7.12 లక్షలు స్వాధీనం, కారు సీజ్ నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంగా అక్రమ రవాణా చేస్తున్న ఎండు గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రెండు క్వింటాళ్ల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 7.12 లక్షలు ఉంటుంది. ఒకరు తప్పించుకోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలను ఎస్పీ విశ్వప్రసాద్ శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరించారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్‌పోర్టు రాజ్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్ పదేళ్లుగా విశాఖపట్నం జిల్లా నుంచి గంజాయిని తీసుకెళ్లి ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఇతనికి సహాయకులుగా ఢిల్లీలోని జై చాపల్ ఆర్కే పురం సబ్జి మార్కెట్ ప్రాంతానికి చెందిన ఎస్.విజయ్‌పాల్, అమిత్‌సింగ్(కారుడ్రైవర్)లు ఉన్నారు. విశాఖపట్నం జిల్లా నర్సిపట్నంలో కిలో గంజాయి రూ. 5 వేలకు కొనుగోలు చేసి ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు నోయిడా, ఆగ్రాలలో రూ. 40 వేల నుంచి 50 వేల వరకు విక్రయించేవాడు. వర్ని మండలం శ్రీనగర్‌కు చెందిన జడిగే శంకర్ కూడా నర్సిపట్నం నుంచి గంజాయిను తీసుకువచ్చి మహారాష్ట్ర ప్రాంతానికి సరఫరా చేసేవాడు. ఇతనిపై 2006 సంవత్సంలో కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంత రం బయటకు వచ్చిన శంకర్‌పై పోలీసులు నిఘా పెట్టలేదని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో శంకర్‌కు ఢిల్లీకి చెందిన వారితో విశాఖపట్నంలో పరిచయం ఏర్పడింది. శంకర్ పెద్దఎత్తున గంజాయిని కొనుగోలు చేస్తుండడంతో ఢిల్లీకి చెందిన వారు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు వచ్చే బదులు నిజామాబాద్‌లో శంకర్ వద్ద నుంచి గంజాయిను కొనుగోలు చేస్తే దూర భారం తగ్గుతుందని భావించారు. అందులో భాగంగా గతనెల 29న ఢిల్లీ నుంచి రాజ్‌కుమార్, విజయ్‌పాల్, అమిత్సింగ్లు హోండా సిటీ డీఎల్ 4సీ ఎన్ఏ 1853 నంబరు కారులో రూ. 7.12 లక్షలు తీసుకుని బోధన్‌కు వచ్చారు. వారికి శంకర్ బోధన్‌లోని గౌతమి లాడ్జ్‌లో ఓ ప్రత్యేక గది తీసుకుని ఆశ్రయం కల్పించాడు. అనంతరం మరుసటి రోజు గతనెల 30న ఉదయం లాడ్జ్‌లోనే గంజాయి అమ్మకానికి సంబంధించి లావాదేవీలు జరిగాయి. మొత్తం రెండు క్వింటాళ్లకు రూ. 5,32 లక్షలు చెల్లించాలని శంకర్ తెలపడంతో రాజ్‌కుమార్ చెల్లించాడు. మిగతా రూ. 1.80 లక్షలు ఖర్చుల నిమిత్తం ఉంచుకున్నాడు. శంకర్ ఎడపల్లిలో అద్దెకు తీసుకున్న పౌల్ట్రీఫారంలో డంపుచేసి పెట్టిన గంజాయిను ఢిల్లీ స్మగ్లర్లకు అప్పగించాడు. పట్టుబడ్డారిలా... ఎడపల్లిలోని పౌల్ట్రీఫారం నుంచి రెండు క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లను కారులో వేసుకుని నిందితులు ఢిల్లీకి బయలు దేరారు. ఎడపల్లి నుంచి కారు నిజామాబాద్‌కు వస్తుండగా కారు వెనుక బైక్‌పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తులకు గంజాయి వాసన రావడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో జన్నేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు కారును వెనక్కి పోనిచ్చేందుకు ప్రయత్నించి విఫలమై పోలీసుల వద్దకు అనుమానంగా చేరుకున్నారు. పోలీసులు కారును చుట్టుముట్టగా కారును నడుపుతున్న అమిత్‌సింగ్, గంజాయి విక్రయించిన శంకర్లు కారులో నుంచి దిగి పారిపోయారు. కారులో ఉన్న రాజ్‌కుమార్, విజయ్పాల్లు పోలీసులకు చిక్కారు. పోలీసులు వీరిద్దరితో పాటు కారును రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైడ్రామా నడుమ శంకర్ అరెస్టు జన్నేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద రూరల్ పోలీసులు ఢిల్లీకి బయలుదేరిన కారును పట్టుకోగానే అందులో ఉన్న శంకర్ పోలీసులను ఏమార్చి తప్పించుకున్నాడు. వెంటనే పోలీసులు వైర్లెస్ సెట్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్సైలను అప్రమత్తం చేశారు. శంకర్ ఓ ఆటోలో వర్నివైపు వెళ్తుండగా వర్ని మండలం అక్బర్‌నగర్ వద్ద వర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 5.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్ అమిత్‌సింగ్ కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురి స్మగ్లర్ల నుంచి నాలుగు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అక్రమ గంజాయి రవాణ కేసులో మరో ముగ్గురి పాత్ర ఉందని వారి గురించి ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి కేసును చేధించిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై చందర్‌రాథోడ్, ఏఎస్సై గురువప్పా, కానిస్టేబుల్స్ శ్రీకాంత్, కృష్ణ, పోచయ్య, హోంగార్డులను ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులను ప్రదానం చేశారు. -
మహిళల అక్రమ రవాణా అతిపెద్ద సమస్య
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ హైదరాబాద్: మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా భారతదేశంతోపాటు ప్రపంచదేశాలన్నీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ అన్నారు. ఈ అంశంపై శనివారం ఇక్కడ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్(టీఐపీ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది అక్రమ రవాణా కు గురవుతున్నారని, 15.50 బిలియన్ డాలర్ల వ్యా పారం జరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారని చెప్పారు. మనదేశంలో ఏటా 40 వేలమంది చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. అక్రమ రవాణాకు గురైనవారిలో కొం దరిని వేశ్యవృత్తిలోకి, మరి కొందరు కట్టుబానిసలుగా, ఇంకొందరి అవయవాలను అమ్ముకునే విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా నుంచి బయటపడినవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. సామాజిక , ఆర్థిక సమస్యల పర్యవసానంగానే మహిళలు వేశ్యవృత్తిలోకి వెళుతున్నారని, వారిని చెడుప్రవర్తన కలిగినవ్యక్తులుగా చూడకుం డా సాయం అందించేవిధంగా న్యాయవ్యవస్థ కూడా తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలన్నారు. బాధితులను ఆదుకునేందుకు న్యాయ, స్త్రీ, శిశు సం క్షేమం, పోలీసు శాఖల సమన్వయంతో ప్రవేశపెట్టిన ‘నల్సా-2015 పథకం’ పోస్టర్‌ను జస్టిస్ రామసుబ్రమణియన్ ఆవిష్కరించారు. ప్రభుత్వ శాఖ లు సమన్వయంగా పనిచేస్తే బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయమందుతుందని సీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా అన్నారు. -
ఎర్రచందనంతో దొరికితే కఠిన చర్యలు
♦ బెయిల్ కూడా దొరకడం కష్టం ♦ ఎర్రచందనం కేసు విచారణకు ప్రత్యేక కోర్టులు ♦ సాక్షితో ఓఎస్డీ సత్య ఏసుబాబు సాక్షి,కడప: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ బి.సత్య ఏసుబాబు హెచ్చరించారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ప్రత్యేకంగా 1967 చట్టంలో కొన్ని సవరణలు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇష్టానుసారంగా బెయిల్ ఇచ్చేందుకు కూడా వీలు లేదని.. ఒకవేళ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైన పక్షంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులు కానీ, బెయిల్ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చట్టాన్ని కఠినతరం చేశారన్నారు. గతంలో పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశంతోపాటు ఎక్కువ శాతం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారికి శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. అక్రమంగా తరలించినా, ఎర్రచందనం దుంగలు కొట్టివేస్తున్నా పదేళ్ల శిక్షతోపాటు రూ.10లక్షలు జరిమానా విధించేలా చట్టం వచ్చిందన్నారు. మొదటిసారి తరలిస్తూ దొరికితే 5ఏళ్ల శిక్షతోపాటు రూ.3లక్షల జరిమానా, రెండవ సారి పట్టుబడితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారని ఆయన వివరించారు. ఎవరైనా వాహనంలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు యజమానిపై కూడా కేసు పెడతామని హెచ్చరించారు. -
స్పెషల్ దందా
► పోలీస్ విభాగంలోస్పెషల్ బ్రాంచ్పైవిమర్శల వెల్లువ ► వారి కనుసన్నల్లోనేఅసాంఘికకార్యకలాపాలు ► అక్రమ సంపాదనకు అలవాటుపడిన సిబ్బంది అర్బన్ జిల్లా పరిధిలో స్పెషల్ బ్రాంచ్ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనే విమర్శలు తీవ్రమయ్యాయి. చేయి తడపందే ఏ పనీ ఆ విభాగంలోని పోలీసులు చేయడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ప్రత్యేకించి పాస్‌పోర్టు జారీ విషయంలో దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెట్టి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. కొందరుబాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పలువురు పోలీసులనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన ఘటనలు ఉన్నాయి. - సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు : అర్బన్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, వ్యభిచార గృహాలు, సింగిల్ నంబర్ లాటరీ, పేకాట, రేషన్ అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల కనుసన్నల్లోనే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులు పోలీస్ అధికారులతో కుమ్మక్కై ప్రతిదానికీ ఒక రేటును ఫిక్స్చేసి మరీ యథేచ్ఛగా తమ పను లు చక్కబెట్టుకుంటున్నారు.గుంటూరు నగరంలో వీరి హవా ఏ స్థాయిలో ఉందంటే రియల్ఎస్టేట్, కుటుంబ కలహాల కేసులూ వీరే సెటిల్మెంట్లు చేసి భారీ స్థాయిలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధులివీ... హత్యలు, భూ కబ్జాలు, చోరీలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి మఫ్టీలో తిరుగుతూ వీటిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు నేరుగా సమాచారం అందించాలి. పోలీసు అధికారుల పనితీరుపై సైతం నిఘా ఉంచడం వీరి కర్తవ్యంలో ఓ భాగం. అన్ని రకాల సమాచారం వీరు సేకరించి నేరాల నివారణలో తోడ్పాటునందించాలి. పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు చుక్కలు..... పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి అక్కడికక్కడే విచారణ పూర్తి చేసి సమాచారాన్ని పాస్‌పోర్టు కార్యాలయానికి అప్లోడ్ చేసి మెరుగైన సేవలందించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రణాళిక రూపొందించారు. ఎస్బీ సిబ్బందికి ట్యాబ్‌లను అందించి త్వరితగతిన పాస్‌పోర్టు వెరిఫికేషన్ పూర్తి చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. దీనిని కొందరు ఎస్బీ సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుని పాస్‌పోర్టు దరఖాస్తు దారుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే పాస్‌పోర్టు రాకుండా చేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగుతుండడంతో ఏం చేయాలో తెలియని కొందరు వారు అడిగినంత ఇచ్చి పంపుతున్నారు. అర్బన్ పరిధిలో ఇప్పటికే పలువురు ఎస్బీ సిబ్బంది ఏసీబీ వలలో చిక్కారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి అర్బన్‌లో స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎస్బీ సిబ్బంది చేస్తున్న పనులివీ... పోలీస్ అధికారుల అవినీతిని ఉన్నతాధికారులకు చెప్పే విషయం అటుంచితే, ఎక్కడ నుంచి ఎంతెంత నెలవారీ మామూళ్లు వస్తాయో వారికి తెలియజేసి వాటాలు పంచుకోవడానికి అలవాటు పడ్డారు. నెలకు లక్షల్లో ఆదాయం చూపిస్తుండడంతో ఎంత నిజాయతీగా డ్యూటీ చేయాలని వచ్చిన సీఐ అయినా సరే డబ్బెవరికి చేదు అన్న చందాన వీరి మాయలోపడి మలినమైపోతున్నారు. స్పెషల్ బ్రాంచ్ కాస్తా ప్రస్తుతం ఇన్స్పెక్టర్లకు డబ్బులు వసూలు చేసిపెట్టే బ్రాంచ్‌లుగా మారిపోయాయి. -
సంగీత పేల్చిన ‘గన్’..!
► తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ► ఆలిండియా తుపాకీ లెసైన్సులు ► బుల్లెట్ సురేష్‌కు రూ.7 లక్షలకు పిస్టల్ విక్రయం ► పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో సంగీత స్పష్టీకరణ ► బుల్లెట్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె చెప్పిన వివరాల మేరకు పోలీసులు చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్‌పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ జైలులో ఉండగా సంగీత అన్నీ తానై వ్యాపారాన్ని యథేచ్ఛగా నడిపింది. అంతేగాక స్మగ్లర్లకు రూ.10 కోట్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పోలీసులు పశ్చిమబెంగాల్లో సంగీతను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావాలనుకున్నారు. కోల్‌కతాలో స్థానిక పరిస్థితులు అనుకూలిం చలేదు. దీంతో ఆమె అరెస్టును అక్కడే చూపించి ఒక రోజు జైలు ఉంచి తర్వాత బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. సంగీత చటర్జీని అరెస్టు చేసిన సమయంలో ఆమె నుంచి పోలీసులు కన్ఫెక్షన్ స్టేట్మెంట్ (నేర అంగీకార పత్రం)ను తీసుకున్నారు. ఇందులో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, తప్పుడు గన్లెసైన్సుల వివరాలు బయటపడ్డాయి. నలుగురి వద్ద లెసైన్సులు ఎర్రచందనం స్మగ్లింగులో అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగిన లక్ష్మణ్ రెండో భార్య సంగీత ఇచ్చిన సమాచారంతో చిత్తూరు పోలీసులు దర్యాప్తును లోతుగా చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాకులు విచ్చలవిడిగా దొరుకుతాయి. వీటికి గన్లెసైన్సులు పొందడానికి లక్ష్మణ్, సంగీత చటర్జీ, సెల్వరాజ్, బుల్లెట్ సురేష్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్టు విచారణలో తేలింది. వాటితో గన్‌లెసైన్సు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నలుగురు ఎర్రచందనం స్మగ్లింగులో అరెస్టయిన వాళ్లే. చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ నాగాలాండ్‌లోని తిమ్మాపూర్‌లో నివాశముంటున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి గన్‌లెసైన్సు తీసుకున్నాడని, ఇతను లక్ష్మన్ నుంచి రూ.7 లక్షలు వెచ్చించి ‘కామా’ పిస్టల్‌ను కొనుగోలు చేశాడని సంగీత చటర్జీ పోలీసులకు చెప్పింది. అక్కడి పోలీసు స్టేషన్లలో ఎలాంటి కేసులు లేవని ఎన్వోసీ తీసుకుని ఆలిండియా గన్‌లెసైన్సు పొందినట్లు పేర్కొంది. నాగాలాండ్ గన్‌లెసైన్సు ఉన్నప్పటికీ పిస్టోలు తనతోపాటు ఉంచుకోవాలంటే తప్పనిసరిగా స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) అనుమతి ఉండాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. బుల్లెట్ సురేష్‌కు అలాంటి అనుమతి లేదని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినందుకు మరో కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్‌పై వచ్చిన బుల్లెట్ సురేష్‌కు సంగీత చటర్జీ కొత్త కేసుల్ని తెచ్చిపెట్టింది. -
రెండు కోట్ల ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: మండలంలోని ఎం.కొంగరవారిపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు, టిప్పర్‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐ అశోక్‌కుమార్ కథనం మేరకు.. ముందుగా అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలు భాస్కర్, వాసు తమ బృందంతో గురువారం తెల్లవారుజామున ఎం.కొంగరవారిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో దాడి చేశారు. సుమారు 80 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను టిప్పర్‌లో లోడ్ చేస్తుండగా దాడి చేశారు. కూలీలు దుంగలను పడేసి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. టిప్పర్, సుమారు రెండు టన్నుల బరువు గల 63 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. డీఐజీ కాంతారావు పరిశీలన ఎం.కొంగరవారిపల్లి సమీపంలో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పారిపోయిన కూలీలను పట్టుకోవడానికి అదనపు బలగాలను రప్పించామన్నారు. పోలీసులకు ఆయుధాలు ఇవ్వాలి చంద్రగిరి:ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేం దుకు ప్రయత్నిస్తున్న పోలీసు అధికారులకు వెంటనే అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని సినీ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తెలిపారు. ఎం.కొంగరవారిపల్లి సమీపంలో రూ.రెండు కోట్ల ఎర్రచదనం దుంగలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన భాద్యత జిల్లాలోని ప్రజలందరిపైనా ఉందన్నారు. ఎక్కడైనా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించి సహాయ పడాలని కోరారు. -
కండీషన్ తప్పుతోంది
తిరుపతి: పోలీసులకు పట్టబడ్డ తర్వాత కూడా ‘ఎర్ర’ స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేసి స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవేశించి స్మగ్లింగ్‌లో కొత్త దార్లు వెదుకుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలను వాహనాల్లో ఉంచి ఫ్యామిలీ ప్రయాణం తరహాలో ఎర్ర దందా సాగిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోమవారం మామండూరు సమీపంలో ఖరీదైన హోండా కారులో దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడిచేశారు. కారుతో పాటు, మూడు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఏడుగురు పరారయ్యారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతను తమిళనాడు విల్లుపురానికి చెందిన రాజా గుర్తించారు. గత సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన రాజా మూడు నెలలు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కండీషన్ బెయిలు పొందాడు. అతను నిర్ణీత సమయంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాలి. ఇతను సంతకం పెట్టేందుకు వచ్చి అటునుంచి అటే అడవికి వెళ్లిపోయి యథావిధిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారికి సులభంగా బెయిలు వచ్చేందుకు కొంతమంది స్థానిక న్యాయవాదులు సహాయపడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాజా తరహాలోనే వందలాది మంది కండీషన్ బెయిలుపై బయట ఉండి మళ్లీ ఎర్ర దందాలు పాల్గొంటున్నట్టు సమాచారం. అడవికి నిప్పు పెట్టి.. అడవి నరికి పెట్టిన ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కళ్లుగప్పి తరలించేందుకు కూలీలు కొత్త ఎత్తుగడ వేస్తున్నారని తెలిసింది. అడవికి నిప్పుపెట్టి అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పక్కదారి పట్టించి దుంగలు తరలిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో నిఘా మరింత పెంచారు. మరోవైపు అడవికి నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని అటవీశాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు
ఎర్రచందనం అక్రమ రవాణాలో పెలైట్లుగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతుండగా, మరొకరు బీకాం విద్యార్థి. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ఓ హోంగార్డు కూడా అరెస్టయ్యాడు. అతను పోలీస్ దుస్తులు ధరించి ఎర్రచందనం తరలించే వాహనంలో ముందు కూర్చునే వాడు. అదేవిధంగా చిత్తూరు పోలీసులు గుడిపాల-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు చేస్తుండగా పోలీసు దుస్తులు ధరించి స్మగ్లింగ్‌లో పాల్గొనే ఇంకో వ్యక్తి కూడా దొరికాడు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు లో సుమారు రూ.49 లక్షల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, బొలేరో, లారీ, హుండయ్ కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే 19 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. తిరుపతి సిటీ: తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రూ.34 లక్షల విలువైన 63 ఎర్రచందనం దుంగలు, హుండయ్ కారు, లారీని స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్ట్ చేసినట్టు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి వై.యోగయ్య తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుచానూరు చైతన్యపురం వద్ద హుండయ్ కారులో తరలిస్తున్న రూ.14 లక్షలు విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పది మంది కూలీలను అరెస్టు చేశామన్నా రు. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఒక హోంగార్డు ఉన్నారని తెలిపారు. అలాగే ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం చెరువు వద్ద రూ.10 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. తిరుమల ఆలిండియా రేడియో స్టేషన్ వద్ద రూ.10 లక్షల విలువ చేసే 10 దుంగలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది కూలీలను అరెస్ట్ చేశామని చెప్పారు. రేణిగుంట వద్ద అదేవిధంగా రేణిగుంట సమీపంలోని ముళ్లపొదల్లో తనిఖీలు చేయగా లారీలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిం చామని పేర్కొన్నారు. దుండగులు పారిపోయారని, వాహనంతో పాటు 470 కేజీలున్న 20 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాహనం, ఎర్రచందనం దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో వేలూరు జిల్లాకు చెందిన సతీష్, కర్ణాటక కటికనహళ్లికి చెందిన తాజుద్దీన్ ప్రధాన స్మగ్లర్లుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. నింది తుల్లో ఉన్న ముగ్గురు విద్యార్థులు పెలైట్లుగా వ్యవహరించారని తెలిపారు. తమిళనాడు వేలూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డు రమేష్ పోలీసు డ్రస్‌లో టోల్గేట్ల వద్ద వాహనాలను పంపుతుండేవాడని పేర్కొన్నారు. అతని నుంచి ఐడీ కార్డుతో పాటు యూనిఫాం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూతలపట్టు మండలంలో.. చిత్తూరు(గిరింపేట): పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేంద్ర బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు పశ్చిమ శాఖ అటవీ రేంజ్ అధికారి నారాయణస్వామి తెలిపారు. దండగులు పారిపోయారని పేర్కొన్నారు. వాహనాన్ని, 433 కేజీలు గల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు పశ్చిమ రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ తనిఖీల్లో సుభాష్, రమేష్, హరికుమార్, హరిబాబు, సతీష్ పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల ‘ఎర్ర’దందా
తిరుపతి : జిల్లాలో ఎర్ర స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చంద్రగిరి, కుప్పం, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలను కేంద్రాలుగా చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం వందల టన్నుల ఎర్రబంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తూ జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులే కీలకం ఎర్రచందనం స్మగ్లింగ్‌లో టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రి ఇలాకాల్లోని ఆ పార్టీనేతలు కొందరు కూలీలను సమకూర్చుకుని ఎర్రబంగారాన్ని తరలించేపనిలో నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది. టాస్క్‌ఫార్స్ ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. మొదట్లో ఈ బృందం హడావిడి చేసినా ఆపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. లారీ దుంగలు పట్టుబడితే ఆ దుంగలనే రోజూ ఏదో ఒకచోట పట్టుబడినట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఎర్రస్మగ్లింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న వారిని వదిలి వేరే రా ష్ట్రాలకెళ్లి కొంత మందిని తీసుకొచ్చి బడా స్మగ్లర్లంటూ ప్రచారం చేసుకోవడం రివాజుగా మారుతోంది. రూటు మార్చిన ఎర్ర దొంగలు. ప్రధాన స్మగర్లపైనే పోలీసులు దృష్టి సారించడంతో వారి కదలికలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. వారి స్థానంలో ఇంతకు మునుపు గ్రామాల్లో ఎర్రస్మగ్లర్లకు ఇన్ఫార్మర్లుగా, డ్రైవర్లుగా, కీలకపాత్ర పోషించిన యువకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఓ ప్రధాన స్మగ్లర్ స్థానంలో పది మంది ద్వితీయశ్రేణి స్మగర్లు పుట్టకొచ్చినట్లు చర్చ సాగుతోంది. పెద్ద మొద్దులను చిన్నచిన్న దుంగలుగా కట్‌చేసి బ్యాగుల్లో పార్సిల్చేసి ఖరీదైన కార్లలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు నిద్దరోవడం విమర్శలకు తావిస్తోంది -
చిన్నారులను అమ్మేసిన వ్యక్తికి ఉరిశిక్ష
22 మంది శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో అమ్మేసిన వ్యక్తిని చైనాలో శుక్రవారం ఉరితీశారు. సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో ఉరి శిక్ష అమలు చేసినట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్పీసీ) శుక్రవారం వెల్లడించింది. 2008 నుంచి 2013 వరకు టాన్ యాంగ్జీ (69) మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి పిల్లలను కొనుగోలు చేసి హెనన్ ప్రావిన్స్‌లో అమ్మేశాడు. ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేసినట్టు తేలింది. 2014లో ఉరిశిక్ష విధించిన సమయంలో తాను తప్పేమీ చేయలేదని, పిల్లలు లేనివారికి మంచే చేశానని టాన్ సమర్థించుకున్నాడు. మగ శిశువులను 30,000 యువాన్లకు, ఆడ శిశువులను 16,000 యువాన్లకు కొనుగోలు చేసేవాడు. వారిని వెయ్యి నుంచి మూడు వేల యువాన్ల లాభంతో అమ్మేసేవాడని తేలింది. గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాలో మహిళలు, పిల్లల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో ఇలాంటి కేసుల్లో మొత్తం 1,362 మందికి జైలుశిక్ష విధించారు. ఇది 2012తో పోల్చితే 50 శాతం తక్కువ. -
హైదరాబాదీల పాస్పోర్ట్స్తో గుజరాతీల విదేశీయానం
అబుదాబీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కిన ‘జంట’ బలవంతంగా అహ్మదాబాద్ తిప్పిపంపిన వైనం కటకటాల్లోకి పంపిన అక్కడి సర్దార్‌నగర్ కాప్స్ కేసులో కీలకంగా మారిన ‘హైదరాబాద్ కోణం’ సిటీబ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్‌పోర్ట్‌లతో కెనడా వెళ్లడానికి యత్నించిన గుజరాతీ ‘జంట’ను అబుదాబి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మరొకరి పాస్పోర్ట్స్పై తమ ఫొటోలు అతికించి ప్రయాణిస్తున్నారని గుర్తించి బలవంతంగా అహ్మదాబాద్‌కు తిప్పి పంపారు. ఇరువురినీ అరెస్టు చేసిన అక్కడి సర్దార్‌నగర్ పోలీసులు ‘హైదరాబాద్ కోణం’పై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. పాస్పోర్ట్స్ కలిగిన అసలు వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపిస్తున్నారు. అక్రమ వలసలు పెరిగిపోతున్నాయనే కారణంగా కెనడా, అమెరికా దేశాలు గుజరాతీయులకు వీసాలు జారీ చేడయం దాదాపు ఆపేశాయి. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వారు ఆయా దేశాలకు వెళ్లడానికి నకిలీ పాస్పోర్ట్స్ వినియోగిస్తుండటం పరిపాటిగా మారింది. 2007లో వెలుగులోకి వచ్చి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనుషుల అక్రమ రవాణా కుంభకోణం సైతం ఈ కోవకు చెందినదే. దీని మూలాలు హైదరాబాద్‌లోనూ బయటపడ్డాయి. కెనడా వెళ్లేందుకు అడ్డదారి... గుజరాత్‌లోని కల్లోల్ ప్రాంతానికి చెందిన నేమిష్ పటేల్ (35), నరోడాలోని కృష్ణనగర్ వాసి దీప్తి పటేల్ (28) స్థిరపడేందుకు కెనడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ పాస్పోర్ట్స్పై వీసాలు రావడం కష్టమని గుర్తించిన ఆ ఇద్దరూ... రామన్ అలియాస్ లాలాభాయ్ అనే దళారీని సంప్రదించారు. ఇరువురితోనూ ఒప్పందం కుదుర్చుకున్న రామన్ వారి నుంచి ఫొటోలు సేకరించాడు. హైదరాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన ఒరిజినల్ పాస్పోర్ట్స్ చేజిక్కించుకున్న ఇతగాడు వాటిపై ఉన్న ఫొటోల స్థానంలో గుజరాతీ ‘జంట’వి అతికించాడు. ఈ పాస్పోర్ట్స్ తీసుకున్న నేమిష్, దీప్తి శనివారం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబి మీదుగా కెనడా వెళ్లేందుకు బయలుదేరారు. పాస్పోర్ట్స్లో ఉన్న వయసులు, ఈ ఇద్దరికీ పొంతన లేకపోయినా ఇక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందిన ఇరువురూ అబుదాబి వరకు వెళ్లిపోయారు. పాస్‌పోర్ట్స్‌ను తనిఖీ చేసిన అక్కడి అధికారులకు ఇదే విషయంలో అనుమానం వచ్చి పరిశీలించగా... ‘అతుకు’ వ్యవహారం బయపటడింది. వీరిని ప్రశ్నించిన నేపథ్యంలో పాస్పోర్ట్స్లో పేర్లకు సంబంధించిన వర్గం వారు కాదనీ స్పష్టమైంది. దీంతో నేమిష్, దీప్తిలను అదుపులోకి తీసుకున్న అబుదాబి అధికారులు ఆదివారం అహ్మదాబాద్‌కు డిపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేశారు. కీలకంగా మారిన సిటీ కోణం... అహ్మదాబాద్ చేసుకున్న ఇరువురినీ అదుపులోకి తీసుకున్న సర్దార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పటి వరకు నకిలీ పాస్పోర్ట్స్తో ప్రయాణిస్తున్న వారిని పట్టుకున్న అక్కడి పోలీసులకు ఈ తరహా కేసు దర్యాప్తు చేయడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌కు చెందిన వృద్ధదంపతుల పాస్పోర్ట్స్ అహ్మదాబాద్‌లోని దళారీ రామన్‌కు ఏలా చేరాయన్నది ఇక్కడి కీలకంగా మారింది. దీంతో పాస్‌పోర్టుల ‘యజమానుల్ని’ ప్రశ్నించడం కోసం సర్దార్‌నగర్‌కు చెందిన ఓ ప్రత్యేక బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి మహ్మద్ జన్సిత్, సాజిదాబానులకు చెందిన వివరాలను సర్దార్‌నగర్ పోలీసులు సేకరించారు. రామన్ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన వారితో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులూ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
720 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ డీవీజీ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది నెల్లిమెట్ల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఐషర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 720 కిలోల గంజాయి కనిపించింది. ఇందుకు సంబంధించి చింతపల్లికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని వాహనం సహా గంజాయిని సీజ్ చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కరీంనగర్ జిల్లా : అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. మహదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనంలో కలప తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. -
అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. మెట్పల్లి సమీపంలోని పెద్దవాగు నుంచి మెట్‌పల్లికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు.. ట్రాక్టర్లను అడ్డుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టుచేసి.. స్టేషన్ కు తరలించారు. -
రూ. కోటి విలువైన ఎర్ర దుంగలు స్వాధీనం
తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం వెల్లెపాడు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 50 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. కోటి పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ దుంగలను ఎవరు తరలిస్తున్నారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. -
రూ. 7 లక్షల కలప దుంగలు స్వాధీనం
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 13 కలప బండ్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో భూపాలపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటుగా వస్తున్న బండ్లను తనిఖీ చేయగా.. అక్రమంగా తరలిస్తున్న దుంగలు కనిపించాయి. స్వాధీనం చేసుకున్న కలప బండ్ల విలువ రూ. 7 లక్షల వరకు ఉంటుందని పోలీసుల తెలిపారు. -
బెల్లం స్వాధీనం
అక్రమంగా బెల్లం రవాణ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయలగూడెం గ్రామం నుంచి బెల్లం అక్రమంగా రవాణ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో ట్రాలీతో పాటు.. 18బస్తాల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అగని అక్రమ దందా!
విదేశాల నుంచి యథేచ్ఛగా బంగారం తరలింపు ఆగస్టులోనే 10 కిలోలకు పైగా రవాణా తాజాగా పొట్టలో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చిన మహిళ సంచలనాలకు కేంద్ర బిందువుగా విమానాశ్రయం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తీరు సంచలనంగా మారుతోంది. ఓ వైపు కస్టమ్స్ అధికారులు భారీగా తనిఖీలు చేపట్టినా అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. దీంతో ఎంతకూ బంగారం అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పడడం లేదు. ఆదివారం అమెరికా మహిళా మూసా మోజియా (34) ఏకంగా తన కడుపులో మాదకద్రవ్యాల ప్యాకెట్లు తీసుకురావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆరు నెలల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడు కూడా తన కడుపులో 400 గ్రాముల బంగారం ఉండలు మింగి తీసుకురాగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు విరేచనాల ద్వారా బంగారాన్ని బయటకు తీశారు. తాజాగా అమెరికా మహిళ కూడా కడుపులో రూ. 50 లక్షలు విలువచేసే మాదకద్రవ్యాల ప్యాకెట్లను తీసుకురాగా.. ఉస్మానియా వైద్యులు అందులో కొన్నింటిని బయటకు తీశారు. ఆగస్టులో అత్యధిక బంగారం.. గతేడాది 2014-ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి 2015 మార్చి 31 వరకు మొత్తం రూ. 39 కోట్ల విలువ చేసే 127 కేజీల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని 125 కేసులు నమోదు చేశారు. విమానాశ్రయం ఏర్పాటు తర్వాత గత ఆర్థిక సంవత్సరంలోనే భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 25 కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆగస్టు మాసంలో పది కేజీలకుపైగా బంగారం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కాగా, అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని తీసుకొస్తున్నారు. ఏడాది కిందట ఓ వ్యక్తి బంగారు బిస్కెట్లను తన మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారంతో పాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చర్చనీయాంశంగా మారింది. -
మహిళల అక్రమరవాణా: 27 మందికి విముక్తి
కాఠ్మండు: వారంతా 20 నుంచి 40 ఏళ్ల వయసున్నవారే. కాస్త ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ నిరక్షరాస్యులు. ఊర్లో పని దొరకడం కష్టం. అలాంటి వాళ్ల అసహాయ స్థితిని సొమ్ము చేసుకుని కొందరు వ్యక్తులు ఏకంగా 27 మంది మహిళలను దుబాయ్ కి అక్రమ రవాణా చేయబోయి అడ్డంగా దొరికిపోయారు. ఆ మహిళలంతా బుధవారం తమ తమ ఇళ్లకు క్షేమంగా చేరారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్ లోని పలు ప్రాంతాలకు చెందిన 27 మంది మహిళలకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు ఇద్దరు బ్రోకర్లు. ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కుర్దీస్థాన్, కెన్యా దేశాల్లో ఉద్యోగాలు ఉన్నాయని.. మంగళవారం వారిని బయలుదేరదీశారు. కఠ్మాండు మీదుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న తరువాత.. ఆఫ్రికా కాకుండా దుబాయికి వెళ్లే విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇంతమంది మహిళలు.. ఇద్దరు మగవాళ్లు బృందంగా కనిపించడం, వారి కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. భారత విదేశాంగ శాఖతోపాటు నేపాల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు రంగంలోకి దిగి మహిళల వివరాలు సేకరించారు. బుధవారం మధ్యాహ్నం వారందరినీ కఠ్మాండు ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి వారివారి నివాసాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి బిష్ణు తమాంగ్ (29), నుపానే (32) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఇసుక రీచ్‌ల్లో టీడీపీ దందా!
ఒత్తిళ్లకు గురవుతున్న అధికారులు అర్ధరాత్రుళ్లు జోరుగా అక్రమ రవాణా ఇసుక క్వారీల వద్దనే కోడిపందేలు, పేకాటలు అండగా బడా నాయకులు విజయవాడ : జిల్లాలోని ఇసుక కార్వీలలో దందాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు గడిస్తున్నారు. అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, కుంటల్లోని మట్టిని తవ్వి అమ్ముకుని దోచుకునేందుకు లెసైన్స్ ఇవ్వడంతో ఇసుకతోపాటు మట్టి దందా కూడా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేయడంతో జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాశంగా మారింది. ఇసుక క్వారీలను డ్వాక్రా గ్రూపులకు ఇచ్చినప్పటికీ వాస్తవంగా తెలుగుదేశం నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కొన్ని చోట్ల నేతల అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేయడమే కాకుండా అక్కడే కోడిపందేలు, పేకాటలు కూడా ఆడుతూ అధికారులకు సవాలు విసురుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాను పరిశీలిస్తే.. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుకను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా పశ్చిమగోదావరి జిల్లాకు తరలించుకుపోతున్నారు. బలివే, రంగంపేట ప్రాంతాల్లో నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకుపోతున్నారు. రాత్రిపూట అయితే ఇతని అనుచరుల ఆగడాలకు అంతే ఉండదు. ఇసుక దందాతోపాటు భారీ ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నారు. వీరికి ముసునూరు మండలంలోని టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇదేమని ప్రశ్నించిన తహశీల్దార్ వనజాక్షి, ఆమె సిబ్బందిపై, అక్కడికి వెళ్లిన సాక్షి విలేకరిపై దాడులకు తెగబడటం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాలు ఊడగొట్టించుకుని.. జగ్గయ్యపేట మండలం వేదాద్రి ఇసుక క్వారీ అనుమతి వచ్చినప్పటికి రహదారి లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు రిజర్వు ఫారెస్ట్ సర్వే నంబరు 124 భూమిని 200ల మీటర్ల మేర ధ్వంసం చేసి రోడ్డు నిర్మించారు. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడులో ఇసుక క్వారీలో డ్వాక్రా మహిళల చాటున అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో వారికి సహకరించిన ఐకేపీ సీసీ నాగరాజు, ఏపీఎం చంద్రశేఖర్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి ఇంటికి పంపి క్వారీ నిలిపివేశారు. అదే విధంగా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఇసుక క్వారీ నుంచి కూడా తెలుగు తమ్ముళ్లు ఇసుకను అక్రమంగా రవాణా చేయటంతో ఐకేపీ సీసీని సస్పెండ్ చేయటంతో అక్కడ క్వారీ కూడా నిలిచిపోయింది. రీచ్‌లు మూత పడటంతో తెలుగు తమ్ముళ్లు రాత్రుళ్లు ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక గుంటుపల్లి రేవును మూసివేయడంతో ఫెర్రి క్వారీకి విపరీతమైన డిమాండ్ పెరిగి లారీలను సీరియల్లో పెడుతున్నారు. టీడీపీ నాయకుల లారీలకు మాత్రం సీరియల్‌తో పనిలేకుండా నేరుగా ఇసుక క్వారీకి పంపుతున్నారు. లారీ కార్మికులకు టీడీపీ నేతల మధ్య నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి. పక్క రాష్ట్రానికి ఇసుక తరలింపు.. గంపలగూడెం మండలంలో రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్కడ నుంచి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. తిరువూరు మండలంలోని గానుగపాడు, రోలుపడి, చింతలపాడు, అక్కపాలెం గ్రామాల పరిధిలో వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మండల పరిషత్ కార్యాలయం నుంచి జారీ చేస్తున్న ఇసుక కూపన్లను చేతుల్లో పెట్టుకొని గ్రామ కమిటీలు ఇసుక సీనరేజీ వసూలు చేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక సిండికేట్లను నిర్వహిస్తూ పోలీసు, రెవెన్యూ అధికారులను నియంత్రిస్తున్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. పెడన మండలం మడక, బల్లిపర్రు, కొంకేపూడి, కట్లపల్లి ప్రాంతాల్లో ఇసుక దందా జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రక్కు రూ. 500 చొప్పున బందరు మండలానికి తరలించి విక్రయిస్తున్నారు. -
స్టీఫెన్ ఫోన్ చేసి రమ్మన్నారు: రేవంత్
-
‘హద్దు’ మీరిన అక్రమం
♦ బహిరంగంగానే రేషన్ బియ్యం రవాణా ♦ ఎస్పీలు మారడంతో పట్టుసడలించిన పోలీస్ అధికారులు ♦ వారం వ్యవధిలో వందల లారీల్లో తెలంగాణకు తరలింపు ♦ చెక్ పోస్టుల్లో మామూళ్లు అందుకుని సాగనంపుతున్న అధికారులు సాక్షి, గుంటూరు : జిల్లాలో చాపకింద నీరులా జరుగుతున్న చౌక బియ్యం అక్రమ రవాణా కొద్ది రోజులుగా బహిరంగంగా మారింది. అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటున్నారని, అక్రమ రవాణాకు అడ్డుగా నిలుస్తున్నారనే కారణాలతో రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను అధికార పార్టీ ముఖ్య నేతలు బదిలీ చేయించిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు నిర్వహించిన ఎనిమిది నెలల్లో జిల్లాకు చెందిన ఓ మంత్రి సొంత నియోజకవర్గంలోనే అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీల బియ్యాన్ని పట్టుకుని క్రిమినల్ కేసులు పెట్టిన విషయం కూడా విధితమే. ఈ నేపథ్యంలో ఎస్పీ బదిలీ కావడంతో జిల్లా పోలీసులు సైతం అక్రమ రవాణాపై పట్టు సడలించినట్లు తెలుస్తోంది. దీంతో అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో వందల లారీల చౌక బియ్యం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, మిరియాలగూడకు తరలిపోయాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఎస్పీలు ఈ అక్రమ రవాణాపై దృష్టి సారించని పక్షంలో జిల్లాలో పేదలకు చౌక బియ్యం అందే అవకాశమే ఉండదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దు దాటుతున్న అధికారుల అవినీతి .... రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద అధికారులు డబ్బుకోసం హద్దుమీరి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో నాగార్జునసాగర్, పొందుగల వద్ద సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి అధికారులు మాత్రం డబ్బులు తీసుకుని వాహనాలను చెక్ చేయకుండా పంపివేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు అధికారులు ప్రైవేట్ వ్యక్తులను దళారులుగా ఏర్పాటు చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు పొందుగల చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహంచడంతో అక్కడి అవినీతి బాగోతం బయటపడింది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు తెలియనీయకుండా అక్కడి సిబ్బంది తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. రాత్రివేళ వారి ఆగడాలకు హద్దు లేకుండాపోతోంది. అక్రమ రవాణా రాత్రిపూటే అధికంగా జరుగుతుండటంతో వారి జేబులు నిండిపోతున్నాయి. అసలు లక్ష్యం ఇది... రాష్ట్ర విభజన అనంతరం దాచేపల్లి మండలం పొందుగల, నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్ వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ రవాణ , కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖలకు చెందిన సిబ్బందిని వాహనాల తనిఖీ కోసం ఏర్పాటు చేశారు. ఆయా వాహనాల రికార్డులు తనిఖీ చేయడంతో పాటు వాహనంలో వున్న సరుకును కూడా పరిశీలించాల్సి వుంది. అనుమానం వున్న వాహనాలను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించాలి. మితిమీరిన లోడుతో వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వ పన్నుల వసూళ్లు చేపట్టాలి. అలాగే రాత్రింబవళ్ళు పటిష్ట నిఘా కొనసాగిస్తూ సమర్థంగా విధులు నిర్వహించాల్సి వు ంది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీలు, మన జిల్లా నుంచి వెళ్లే బియ్యం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
మనుషుల అక్రమ రవాణాపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: మనుషుల అక్రమ రవాణా ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాను నిరోధించడంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడం లేదంటూ స్వచ్ఛంద సంస్థ ‘ప్రజ్వల’ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలపై కౌంటరు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బొసాలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం 1956లోని నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని, చట్టాలను కఠినంగా అమలు చేసి అక్రమ రవాణాను అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కూడా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల రోజు రోజుకు మహిళల అక్రమ రవాణా పెరిగిపోతోందని, చిన్నారులపై లైంగిక దాడులు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి కేసులను పరిష్కరించే కింది కోర్టులకు, అధికారులకు బాధితుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకునేలా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. -
ఇసుకాసురులు
గుంటుపల్లి రీచ్‌లో సిండికేట్లు అక్రమంగా కోట్లు మింగేస్తున్న వైనం ప్రశ్నించిన డ్వాక్రా అధ్యక్షురాలిపై వేధింపుల పర్వం కలెక్టర్‌కు ఫిర్యాదు విజయవాడ : జిల్లాలో అడ్డగోలు ఇసుక దందాకు తెరలేచింది. రీచ్‌లో ఒక లారీ ఇసుక తవ్వినట్లు బిల్లు తీసుకుని ఆ బిల్లుపై దాదాపు 20 నుంచి 30 లారీల ఇసుకను యథేచ్ఛగా విక్రయించుకుని కొందరు సిండికేట్లు కోట్లు గడిస్తున్నారు. దీనికి పంచాయతీ అధికారులు సహకరించడంతో అక్రమ వ్యాపారం రెండు నెలల్లో కోట్లకు చేరింది. ఈ విషయం రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవటంతో పరిస్థితి పరాకాష్టకు చేరింది. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన డ్వాక్రా సంఘ అధ్యక్షురాలిని బెదిరించడమే కాదు ఆమెను పదవి నుంచి దించే దిశగా సిండికేట్ అడుగులు వేస్తోంది. ఇదంతా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి ఇసుక రీచ్‌లో సాగుతున్న అక్రమ దందా. అక్రమాల పుట్ట బోట్స్‌మెన్ సొసైటీ నిర్వహణలో నడిచిన గుంటుపల్లిలోని ఇసుక రీచ్‌లో తవ్వకాలను హైకోర్టు ఉత్తర్వులతో 2012 మార్చి నుంచి నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతను ద్వాక్రా సంఘాలకు అప్పగించడమే కాకుండా విక్రయాల వ్యవహారాన్ని ఆన్లైన్ చేశారు. 2014, అక్టోబర్ 11న ఈ రీచ్‌ను పునరుద్దరించి అక్కడి ద్వాక్రా సంఘ అధ్యక్షురాలు నలజాల గీతాంజలికి బాధ్యతలు అప్పగించారు. ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్న లారీకి రూ.3,900 ధర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.1,380 బోట్స్‌మెన్ సొసైటీకి, మిగిలిన మొత్తం ద్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వానికి వస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు రీచ్ మూతపడి ఉండటంతో ఇసుక నిల్వలు భారీగా పేరుకుపోయాయి. వాస్తవానికి రీచ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న గుంటుపల్లి సాండ్ మైనింగ్ మ్యూచ్‌వల్ కో-ఆపరేటివ్ సొసైటీ పర్యవేక్షణలో వ్యవహారమంతా సాగాలి. కొనుగోలుదారులు ఇసుకను ఆన్లైన్లో బుక్‌చేసి ఆ రశీదు రీచ్‌లో చూపితే అక్కడి ద్వాక్రా సంఘం ముద్రించిన పర్మిట్ స్లిప్ ఇస్తారు. దానిని చూపించి ఇసుకను లోడ్ చేసుకోవాలి. అలా ద్వాక్రా సంఘం ఇచ్చిన ప్రతి రశీదును ఆన్లైన్లో నమోదు చేయాలి. అప్పుడే ఆ రీచ్ నుంచి రోజుకు ఎన్ని లారీల ఇసుక విక్రయాలు జరిగిందని అధికారికంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఖజానాకు నగదు జమ అవుతుంది. కానీ, అందుకు విరుద్ధంగా గుంటుపల్లి ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయి. తవ్వకాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఇద్దరు వెలుగు ఉద్యోగులు వారికి అనుకూలమైన వ్యక్తుల్ని ఆపరేటర్లుగా నియమించుకున్నారు. ఈ క్రమంలో ద్వాక్రా సంఘం ఇస్తున్న రశీదు బిల్లులేవీ ఆన్లైన్లో సక్రమంగా నమోదు కావట్లేదు. రీచ్ నుంచి రోజూ సగటున 70 లారీల ఇసుక తవ్వుతుంటే, సుమారు 70 వరకు ద్వాక్రా సంఘాలు రశీదులు ఇస్తుండగా, వాటిలో 20 వరకు మాత్రమే ఆన్లైన్లో నమోదవుతున్నాయి. మిగిలినవి లెక్కల్లోకి రావట్లేదు. అధికారికంగా నమోదు చేస్తున్న లారీల్లో కూడా తేడాలు వస్తున్నాయి. ఒకే బిల్లును రెండు, మూడుసార్లు నమోదు చేయడం వల్ల ఆన్లైన్ రెడ్‌మార్క్ పడి నమోదు కావట్లేదు. గత డిసెంబర్ నుంచి మార్చి వరకు దాదాపు వందల లారీల ఇసుక అనధికారికంగా తరలివెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు రూ.2కోట్ల విలువైన ఇసుక సిండికేట్ల పరం అయింది. ఇక్కడి బోట్స్‌మెన్ సొసైటీ సభ్యులు కొందరు, ఇద్దరు అధికారులు కలిసి ఇదం తా చేస్తున్నారు. పలు ఆరోపణల నేపథ్యంలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి జనవరిలో రీచ్‌ను సందర్శించారు. ప్రశ్నిస్తే వేధింపులే.. దీనిని డ్వాక్రా సంఘ అధ్యక్షురాలు గీతాంజలి ప్రశ్నించటంతో ఆమెపై వేధింపులు మొదల య్యాయి. వెలుగు అధికారులను ఆమె ప్రశ్నించడం, బిల్లులు, ఆన్లైన్ లిస్ట్ తనకు చూపాలని కోరటంతో వేధింపులకు దిగుతున్నారు. దీనిపై ఆమె గత సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వేధింపులు తీవ్రం కావటంతో పాటు ద్వాక్రా అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించే యత్నాలు సాగుతున్నాయి. -
కొల్లగొడుతున్నారు!
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! నదులను లూఠీ చేస్తున్న తెలుగుతమ్ముళ్లు రాత్రిళ్లు పొక్లెయిన్లతో తోడేస్తున్నారు బెంగుళూరు, చెన్నైలకు యథేచ్ఛగా ఎగుమతి రాళ్లు తేలి రోదిస్తున్న పాపాఘ్ని, పెన్నానదులు కడప: ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే’ తలంపు తెలుగు తమ్ముళ్లల్లో బలపడింది. అందుకు ప్రకృతి సంపదను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఒక్కరోజులో లక్షలు పోగుచేసుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తొలుత ఎర్రచందనం దృష్టి సారించి సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా తీవ్రతరం కావడంతో, ఇసుక వైపు వారి దృష్టి మళ్లింది. నదుల్నీ కొల్లగొట్టుతున్నారు. పోటీలు పడి ఇసుక తోడేస్తుండడంతో పాపాఘ్ని, పెన్నా నదుల్లో రాళ్లు తేలియాయి. రాత్రి సమయంలో యంత్రాలతో ఇసుకను తరలిస్తున్న ఘటనలు జిల్లాలో విచ్చలవిడి అయ్యాయి. అధికారపార్టీ నేతల్లో కొందరికి ప్రస్తుతం ఇసుక అక్రమరవాణే అక్రమార్జన అయింది. పొద్దుగూటికి చేరగానే నదుల్లో వీరి విజృంభణ మొదలై పొద్దుపొడిచే సమయానికి ముగిస్తుంది. సమీప గ్రామాల్లో మిషన్లను, లారీలను అందుబాటులో ఉంచుకుని రాత్రి కాగానే నదుల్లోకి ప్రవేశించి ఇసుకను తోడేస్తున్నారు. స్థానికులకు తెలిసినా నిశ్చేష్ట్రులై చూస్తుండిపోవడం మినహా ఏమీచేయలేని స్థితి. అధికారులకు సమాచారం అందించినా పేర్లు తెలుస్తున్నాయని మిన్నకుండిపోతున్నారు. పాపాఘ్ని... పెన్నా లూఠీ.... జిల్లాలో పాపాఘ్ని, పెన్నా నదులు లూఠీ అవుతున్నాయి. తర్వాత స్థానాన్ని చెయ్యేరు నది ఆక్రమించింది. పాపాఘ్ని నదిలో వేంపల్లె నుంచి కమలాపురం వరకూ అంచెలంచెలుగా నదిలోని ఇసుకను తోడేస్తున్నారు. వేంపల్లె, తంగేడుపల్లె, నందిమండలం, పైడికాల్వ, కమలాపురం తదితర పల్లెల్లో ఇసుక అక్రమరవాణాను అలుపెరగకుండా చేస్తున్నారు. పైడికాల్వ సమీపంలో పాపాఘ్ని నదిలో విందు ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాలకు తెలుగుతమ్ముళ్లు రక్షణగా నిలుస్తున్నారు. నదిలో యంత్రాలతో లారీలకు ఇసుకను నింపడమే కాకుండా జిల్లా హద్దులు దాటేంతవరకూ ఎస్కార్టుగా తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంత తతంగం నిర్వహిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకున్నారు. అందుకు కారణం అధికారపార్టీ నేతల బెదిరింపులేనన్నది సుస్పష్టం. అలాగే పెన్నా నదిలో కొండాపురం నుంచి చెన్నూరు వరకూ ఆయా ప్రాంతాల్లోని అధికారపార్టీ నేతల అనుచరులు ఇసుక అక్రమ రవాణా అక్రమాధాయంగా ఎంచుకున్నారు. కొండాపురం, ప్రొద్దుటూరుల నుంచి నిత్యం బెంగుళూరుకు ఇసుక తరలివెళ్తోంది. తెలుగుతమ్ముళ్లు కాకుండా ఇతరులు నదిలోకి దిగితే వెంటనే అధికారులకు ఫోన్లు చేసి పట్టిస్తూ పోటీ లేకుండా చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదులకు మాత్రమే అధికారులు సైతం స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక టీం ఏర్పాటైనా.... ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆరు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్డీఓ పరిధిలో రెండు టీంలు పనిచేస్తున్నారుు. ఈ టీంలో రెవిన్యూ, ఫారెస్టు, మైనింగ్, పోలీసు శాఖలకు చెందిన సభ్యులు ఉంటారు. ఇసుక డంప్‌లు, ఇసుక అక్రమరవాణా అరికట్టడంలో వీరు విఫలం అవుతున్నారు. అందుకు కారణం ఈ టీంలు ఆర్డీఓల పర్యవేక్షణలో ఉండడమేనని తెలుస్తోంది. కలెక్టర్ కంట్రోల్లోనే స్పెషల్ టీంలు ఉంటే తప్ప అక్రమరవాణా నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తోంది. ‘ఎర’గా డంప్‌లు.... అధికారుల దాడులకు ఎరగా డంప్‌లను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అనువైన ప్రాంతానికి ఇసుకను చేర్చడం అధికారులకు చెప్పి సీజ్ చేయించడం, ఆపై దానిని వేలంలో దక్కించుకోవడం లాంటి ఎత్తుగడలను అధికారపార్టీ నేతలు కొన్ని ప్రాంతాలల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో దక్కించుకున్న ఇసుకకు యంత్రాంగంచే అనుమతి పొంది, ఆ అనుమతితో నదుల్లోని ఇసుకను తరలిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నందిమండలం, పెద్దచెప్పలి, పైడికాల్వ సమీపంలో పట్టుబడ్డ ఇసుక డంప్‌లు నిలుస్తున్నాయి. వాటిని సీజ్ చేయించడం, ఆ ఇసుకను తరలించేందుకు అనుమతి దక్కించుకోవడం, అక్రమంగా కొల్లగొట్టడం తంతు యధేచ్ఛగా నడుస్తోంది. ఇలాంటి వ్యవహారాలకు ఆర్డీఓ కార్యాలయాలే వేదికగా నిలుస్తుండడం విశేషం. పీడీ యాక్టు ప్రయోగిస్తేనే.... ఇసుక అక్రమరవాణా అరికట్టాలంటే పీడీ యాక్టు ప్రయోగిస్తే మినహా సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ, కలెక్టర్ కేవీ రమణ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా స్పందిస్తున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ వద్ద శుక్రవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు సోదా చేయగా పది బాక్సుల్లో మొత్తం రెండు వేల జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. వీటిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకెళ్తున్నట్లు అనుమానాలున్నాయని కొత్తగూడెం ఓఎస్డీ డేవిస్ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పేరుకే పెద్దమనుషులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమాజంలో పెద్దమనుషుల్లా చలామణి అవుతున్న కొందరు నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాలో చక్రం తిప్పుతున్నారు. వారికి స్థానిక పోలీసుల సహకారం మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు పోలీసులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.., ఎస్పీ వద్ద మెప్పుపొందేందుకు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణాలో పాలుపంచుకున్నవారు.. తప్పు తెలుసుకుని మానేసిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వేధింపులకు గురవుతున్న వారు ప్రధానంగా గతంలో ఈ పెద్ద మనుషులకు అడ్డొచ్చినవారేనని తెలిసింది. గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలో కొందరు పోలీసు అధికారులు తీరే ఇందుకు నిదర్శనం. పోలీసులు, అటవీ అధికారులు గట్టి నిఘాపెట్టినా ఆ డివిజన్ పరిధిలోని ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టుచప్పుడుగా సాగిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలిసింది. పెద్దమనుషులుగా చలామణి అవుతున్న టీడీపీ నాయకులు కొందరు ఎర్రచందనం అక్రమరవాణా కేసుల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తపడుతున్నారు. అనంతసాగరం మండల పరిధిలో కొందరు రైతులను స్థానిక పోలీసు అధికారి ఒకరు తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఎప్పుడో ఒకసారి ఎర్రచందనం అక్రమరవాణాలో పాలుపంచుకున్న వారు తప్పు తెలుసుకుని అక్రమరవాణాకు దూరంగా ఉంటూ.. కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వారిని స్టేషన్‌కు పిలిపించి రకరకాల వేధింపులకు గురిచేస్తునట్లు తెలిసింది. సంబంధం లేదన్నా ఒప్పుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆ కుటుంబంలోని కొందరు నెల్లూరు కలెక్టరేట్ వద్ద విలేకరులను కలిసి బోరుమన్నారు. అదేవిధంగా అసలు సంబంధమే లేని వ్యక్తులపైనా ఎర్రచందనం అక్రమరవాణా కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మరి కొందరు బాధితులు వివరించారు. అయితే వారి పేర్లు చెప్పడానికి భయపడ్డారు. పేపర్లో తమ పేర్లు, ఫొటోలు వేయవద్దని బతిమలాడారు. తామ ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చామని తెలిస్తే ఆ పోలీసులు మమ్మల్ని బతకనివ్వరని వాపోయారు. దర్జాగా దొంగలు. డివిజన్ల పరిధిలో కొందరు స్మగ్లర్లు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాలో తమకు సంబంధం లేనట్లే నడుచుకుంటూ చలామణి అవుతున్నారు. ఎర్రచందనం అధికంగా ఉన్న అటవీ ప్రాంతంలో సునాయాసంగా వెళ్లి వచ్చేందుకు కొందరు పోలీసులు, అటవీ అధికారుల సహకారంతో దారి ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గూడూరు, ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో అనేకచోట్ల ఎర్రచందనం దుంగలను డంప్ చేసినట్లు తెలిసింది. అలా డంప్‌చేసిన దుంగలను ఇటీవల ఓ లారీకి నింపి జిల్లా సరిహద్దు దాటించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు కొందరు పోలీసులు తప్పుడు కేసులుపెట్టి హడావుడి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి అసలు దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. స్మగ్లింగ్‌తో సంబంధం లేదు బాలాయపల్లి: వెంకటగిరి వేలుకొండ అడువుల్లో నుంచి తరలిపోతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎటువంటి సంబందం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు రావి మస్తాన్‌నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి విందురు పరంధామరెడ్డి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొరపాటి రామచంద్రయ్య తెలిపారు. బాలాయపల్లిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఓ ఉన్నత స్థానంలో ఉన్నాడన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. -
తమ్ముళ్లే స్మగ్లర్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎర్రచందనం అక్రమరవాణాలో అధికారపార్టీ నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. మరో జెడ్పీటీసీ సభ్యుడు ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. వీరికి ఓ గ్రామం గ్రామమే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు జిల్లాలో శేషాచలం, వైఎస్సార్ కడప జిల్లాలో లంకమల, ప్రకాశంలో నల్లమల, నెల్లూరు జిల్లాలో వెలుగొండ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తెలుగుతమ్ముళ్లు వాటిపై దృష్టిపెట్టారు. అధికార బలంతో కొందరు పోలీసులు, మరి కొందరు అటవీ, ఇంకొందరు చెక్‌పోస్టు అధికారులను బెదిరించి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎర్ర బంగారాన్ని కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణే లక్ష్యంగా తమ్ముళ్లు, తమిళనాడుకు చెందిన కొందరు స్మగ్లర్లు బరితెగించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవలకాలంలో నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమరవాణా అధికమైందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరికి జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో జెడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌లు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్లకు సహకరించటంతో పాటు జిల్లాపరిధిలోని వెంకటగిరి, రాపూరు, సోమశిల, సీతారామపురం, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రచందనం చెట్లను నరకటం ప్రారంభించారు. విచ్చలవిడిగా నరికిన ఎర్రచందనం దుంగలను రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అలా దాచి ఉంచిన ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార బలంతో అక్రమరవాణా టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే కొందరు ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిసారించి నట్లు తెలుస్తోంది. ఓ గ్రామం మొత్తం ఎర్రచందనం అక్రమరవాణాపైనే ఆధారపడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుచుకుంటారని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ డంప్ చేసిన దుంగలతో పాటు వీరు నరికి దాచి ఉంచిన ఎర్రందనం దుంగలను కలిపి అధికార బలంతో సరిహద్దులు దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్రమ రవాణాలో అధికారపార్టీ ఎమ్మెల్యేకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నట్లు అటవీశాఖలో పనిచేసే ఓ అధికారి స్పష్టం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేం దుకు అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేనే ఎర్రచందనం దుంగలను తన వాహనంలో ఉంచుకుని అనుకున్న స్థావరానికి చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలా పలుమార్లు ఎమ్మెల్యేనే తాను ప్రయాణించే కారులోనే ఎర్రచందనం దుంగలను తరలించినట్లు ఓ అటవీ అధికారి వెల్లడిం చటం గమనార్హం. ఎమ్మెల్యే ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం సీఎం వద్దకు కూడా చేరింది. దీనిపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అరెస్టులైనా బయటకు వస్తారు.. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులైన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎమ్మెల్యే తన అధికార బలం ఉపయోగించి బయటకు రప్పించారు. ప్రస్తుతం వారు అడవుల్లోనే ఉంటూ స్మగ్లింగ్ పనిలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుడైన జెడ్పీటీసీ సభ్యుడు ఒకరు తడ పరిధిలోని ఓ మెడికల్ షాపు యజమానికి ఎర్రచందనం సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు కొంత మొత్తాన్ని కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో మొత్తం 374 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కాసులు కురిపిస్త్ను కంకర దందా!
తూప్రాన్ : మండలంలో ఇసుకతో పాటు కంకర దందా కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమార్కులు నామమాత్రం అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లోని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మండలంలో ఘనపూర్, కూచారం, లింగారెడ్డిపేట, పాలాట గ్రామాల్లోని ప్రభుత్వ, పట్టా భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. బహిరంగంగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్వారీల ఏర్పాటు ప్రభుత్వ అనుమతులతో అనుమతించిన నిర్ణీత ప్రదేశంలో తవ్వకాలు జరపాలి. కానీ అక్రమార్కులు మాత్రం అధికారులకు ఓ స్థలాన్ని చూపి అనుమతులు పొందిన అనంతరం మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పేలుళ్లు పేలుస్తూ పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ పేలుళ్ల దాటికి పెంకుటిళ్ల పైకప్పు నుంచి మట్టి రాలి మీద పడుతుండగా.. సిమెంటుతో నిర్మించుకున్న భవనాలు బీటలు వారుతున్నాయి. క్వారీల నుంచి వెలువడే దుమ్ము పక్కనే ఉన్న పంటల పొలాలపై పడి వాటిని ఎదగడం లేదు. దీంతో పంటను మొత్తం కోల్పోవాల్సి వస్తోందని పలువురు రైతులు మైనింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లు గుంతల మాయంగా... క్వారీల్లోని కంకరను టిప్పర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు గుంతల మయంగా మారుతున్నాయి. ఘనపూర్ గ్రామ సమీపంలో సుమారు ఐదు క్వారీల్లోని వాహనాలు కంకర లోడుతో రామాయిపల్లి మీదుగా కొన్ని వాహనాలు, ధర్మారాజుపల్లి, దండుపల్లిల మీదుగా మరికొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని ఘనపూర్ - రమాయిపల్లి గ్రామల మధ్య వేసిన బీటీ రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.ఇప్పటికైనా గనుల శాఖ అధికారులు ఈ క్వారీలను తనిఖీలు చేసి ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇసుక పెత్తనం తమ్ముళ్లకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డ్వాక్రా రుణాలు మాఫీ అటకెక్కించడంతో.. మహిళలను సంతృప్తి పరచడానికి టీడీపీ ప్రభుత్వం ఇసుక రీచ్‌ల డ్రామా తెరపైకి తెచ్చింది. పోనీ మహిళలకే కట్టబెట్టారనుకుంటే పొరపాటే. మహిళల పేరు చెప్పి ఇసుక రీచ్‌లపై తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. పెపైచ్చు తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలతో డ్వాక్రా మహిళలకు కన్నీళ్లు మిగిలాయి. అలాగే యథాతథంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కొత్తదే అయినా.. జిల్లాలో మాత్రం పాత పద్ధతిలోనే ఇసుక రవాణా కొనసాగుతోంది. జిల్లాలో 72 ఇసుక రీచ్‌లను గుర్తించారు. అందులో ప్రస్తుతం 25 రీచ్‌లకు అనుమతులు వచ్చాయి. వీటిలో కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల తమ్ముళ్ల బినామీలు అడ్డుతగులు తుండటంతో ప్రారంభం కాలేదు. కోవూరు నియోజక వర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని జొన్నవాడ, మినగల్లు, విడవలూరు మండలం ముదివర్తి, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ఇసుక రీచ్‌లు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం. ‘అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయాలని చూస్తే మీ అంతుచూస్తాం’ అని బెదిరిస్తున్నట్టు తెలిసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకులతోట ఇసుక రీచ్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ తమ్ముళ్ల బినామీలు అడ్డుతగిలి దౌర్జన్యం చేశారు. ఇసుక రీచ్‌ను తమకే ఇవ్వాలంటూ ప్రారంభాన్ని అడ్డుకున్నారు. షామియానాను పడదోసి మహిళలపై దౌర్జన్యం చేశారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత సద్దు మణిగింది. అయితే ‘రీచ్‌లో ఎవరైనా అడుగుపెడితే.. ఇసుకలోనే తొక్కేస్తాం’ అని బెదిరిస్తున్నట్టు మహిళలు భయపడుతున్నారు. దీంతో ఇక్కడ ఇసుక తవ్వకాలు ప్రారంభించలేదు. అదే విధంగా కోడూరుపాడు, ఎన్వీ గార్డెన్, పొట్టేపాళెం, గొల్లకందుకూరు, సజ్జీపురం, ముల్లుముడి తదితర ప్రాంతాల వద్ద స్థానికులు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. బిల్లొకటే.. అనుమతి మూడింటికి కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వే బిల్లును చూపి మూడు ట్రాక్టర్ల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నాయుడుపేట పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి పగలు నిబంధనల ప్రకారం తరలిస్తున్నా.. రాత్రి పూట మాత్రం ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా సూళ్లూరుపేట పరిధిలోనూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
బ్లాంక్ చెక్.. పోస్టులు
అక్రమ రవాణాకు అడ్డాగా మారిన చెక్‌పోస్టులు మామూళ్ల మత్తులో జోగుతున్న సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు జిల్లాలో ఇదీ పరిస్థితి చెక్‌పోస్టులో ఉద్యోగమంటే బ్లాంక్ చెక్కుచేతికిచ్చినట్టే. జిల్లాల్లో ఎన్నో చెక్ పోస్టులు న్నా అక్రమ రవాణా ఎలా జరుగుతోందంటారు. బండి వచ్చిందంటే జేబుపైనే ధ్యాస.. చేయి తడిపితే చాలు.. ఏ సరుకైనా ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు.. నిఘా నీడలో ఉండాల్సిన తనిఖీ కేంద్రాలు బ్లాంక్ చెక్పోస్టులుగా మారిపోతున్నాయి. ఇక్కడ ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేస్తారు. ఆ ఉద్యోగం కోసం రాజకీయ నాయకుల్ని మొదలు... దేవుళ్ల వరకు చుట్టేస్తారు. లంచాలకూ పాలుమాలరు. ఆ ఒక్క ఉద్యోగముంటే చాలని లక్షలు కుమ్మరించేస్తారు.. ఉద్యోగమొస్తే బడా స్మగ్లర్లకు దాసోహమైపోతారు. తిరుపతి(మంగళం): జిల్లాలోని చెక్ పోస్టులు అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. మామూళ్లిస్తే చాలు చెక్‌పోస్టు సిబ్బందే బడాస్మగ్లర్లకు రెడ్‌కార్పెట్ పరిచేస్తారు. బీట్ ఆఫీసర్లే ఎస్కార్టగా వచ్చి ఎర్రచందనాన్నీ సాగనంపేస్తారు. ఇంటిదొంగలే సహకరిస్తున్నప్పుడు ఇక తమను పట్టుకునేవారెవరంటూ స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ పనికానిచ్చేస్తున్నారు. కలగా ఆధునికీకరణ పద్ధతులు చెక్‌పోస్టుల్లో లంచగొండితనాన్ని అరికట్టేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు నడుం బిగించారు. చెక్‌పోస్టులను ఆధునికీకరించి సిబ్బంది పని తీరును మెరుగుపరచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 2010 జనవరిలో తిరుపతిలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో అప్పటి పీసీసీఎఫ్ మధుకర్‌రాజ్ నేతృత్వంలో చెక్‌పోస్టుల ఆధునికీకరణపై చర్చించారు. జిల్లాలోని 27 చెక్‌పోస్టుల పనితీరును మెరుగుపరచాలని నిర్ణయించారు. రహదారుల్లో నిర్వహిస్తున్న టోల్గేట్లు తరహాలో ఎలక్ట్రానిక్ చెక్‌పోస్ట్ విధానాన్ని అమలుపరిచి, తనిఖీ చేసే ప్రతి వాహనం వివరాలనూ కంప్యూటర్ ద్వారా పొందుపరచాలని భావించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వీడియో కెమెరాల ద్వారా రికార్డ్‌చేసి, సిబ్బంది అవినీతికి పాల్పడే వీలులేకుండా చేయాలని భావించారు. అయితే ఏళ్లు గడిచినా ఇంతవరకు ఈ భావనలు అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులు అవినీతి కేంద్రాలుగా, వసూళ్లకు అడ్డాగా మారిపోయాయి. స్మగ్లర్లకు రాచమార్గం శేషాచల అడవుల్లో నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించేందుకు చెక్‌పోస్టులు స్మగ్లర్లకు రాచమార్గాలుగా మారాయి. ఇక్కడ డ్యూటీ చేసేవారితో స్మగ్లర్లు ఒప్పందం కుదుర్చుకుంటారు. చేయి తడపగానే ఎర్రచందనం లోడు చేసుకునేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఆ బీట్ ఆఫీసర్లే ఎస్కార్ట్‌గా వచ్చి సాగనంపేస్తారు. ఇంటి దొంగలే సహకరిస్తున్నప్పుడు తమను పట్టుకునేదెవ్వరని స్మగ్లర్లు కాలరెగరేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అటవీ శాఖ చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలు కన్ను కప్పి ఎర్రచందనాన్ని చెక్‌పోస్టులు దాటిస్తే ఆ వాహనాలు మరోచోట పట్టుపడితే మొదటి చెక్‌పోస్టులో డ్యూటీ చేస్తున్న అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేస్తాం. ఎర్రచందనం స్మగ్లర్లకు అటవీ శాఖలో ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. - జీ.శ్రీనివాసులు, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో -
సైక్లోన్ రిలీఫ్ వేషం!
భారీగా గంజాయి అక్రమ రవాణా రూ. 2.50 కోట్ల సరకు సీజ్ ఇద్దరు నిందితుల అరెస్ట్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ విశాఖపట్నం సిటీ/నర్సీపట్నం టౌన్: హుదూద్ తుపాను గాయాల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే కొందరు ప్రబుద్ధులు ఇదే అదనుగా గంజాయిని అక్రమంగా తరలించేస్తున్నారు. ‘సైక్లోన్ రిలీఫ్ వేన్’ పేరుతో గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమ రవాణా చేసేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం వీటిని పట్టుకున్నారు. సైక్లోన్ రిలీఫ్ వేన్ చిట్టడవిలో ఏం చేస్తుందోనని పరిశీలించిన ఈ బృందానికి క ళ్లు బైర్లు కమ్మేలా గంజాయి బస్తాలు కనిపించాయి. విశాఖ ఎక్సైజ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణ విశాఖలో శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన క థనం ప్రకారం నర్సీపట్నం నుంచి లంబసింగికి వెళ్లే రోడ్డులో అంజలి పంచాయతీ పరిధిలో భారీఎత్తున గంజాయి తరలింపు జరుగుతోందన్న సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం కాపు కాసింది. ఐషర్ వాహనంలో 60 బ స్తాల గంజాయిని తరలిస్తుండగా నెల్లిమెట్ట జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుపడింది. ఆ వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. వాహనం రాజమండ్రికి చెందిన ఎస్.సుందరి పేరున ఉందన్నారు. వాహనంలో వున్న కూలికి వచ్చిన ఈదులబయలు గ్రామానికి గెమ్మెలి భాస్కరరావు, చింతపల్లికి చెందిన కొర్రా సీతారాంలను పట్టుకున్నారు. మరో ఐదుగురు పరారయ్యారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక సూత్రధారులు ఎవరు? అనే వివరాలను ఎక్సైజ్ పోలీసులు వీరి నుంచి రాబడుతున్నారు. 60 బస్తాల్లో 2,640 కిలోల గంజాయి వున్నట్టు గుర్తిం చారు. దీని విలువ దాదా పు రూ. 2.50 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ తానికొండ శ్రీనివాసరావు నేతృత్వంలో నర్సీపట్నం ఇన్స్పెక్టర్ జగన్మోహన్రావు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జైభీం, అచ్యుతరావు, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, బసంతీ, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. -
తెట్టులోనే ఉంది గుట్టు?
ఆయిల్‌ఫెడ్‌లో రూ.450 కోట్ల కుంభకోణం..! అశ్వారావుపేట ఆయిల్‌ఫాం {Mషింగ్ ఫ్యాక్టరీ కేంద్రంగా పామాయిల్ చమురు దోపిడీ భారీ ముడి చమురున్న తెట్టును పీపాల్లో అక్రమంగా తరలిస్తున్న వైనం ఇదే ఫ్యాక్టరీ రిక వరీనే ప్రామాణికంగా తీసుకొని ధర నిర్ణయిస్తున్న ప్రైవేట్ కంపెనీలు రైతుల్లో ఆందోళన.. అక్రమాలు నిజమేనన్న ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు హైదరాబాద్: పామాయిల్ పరిశ్రమలో తెట్టు మాటున చేస్తున్న ముడిచమురు అక్రమ రవాణా గుట్టుర ట్టు అయింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫాం క్ర షింగ్ ఫ్యాక్టరీలో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి. ఈ క్రషింగ్ ఫ్యాక్టరీ ప్రారంభమైన ఏడేళ్ల నుంచి జరుగుతోన్న ఈ తంతుతో పామాయిల్ రైతులను ఆర్థికంగా పీల్చి పిప్పిచేశారు. ఫ్యాక్టరీ అధికారులు మొదలుకొని ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు ఉన్నతాధికారులు.. ప్రైవేట్ కంపెనీ దళారులతో కుమ్మ క్కై ఈ భారీ కుంభకోణానికి ఒడిగట్టారు. రెండురోజుల క్రితం అక్రమంగా తరలిస్తున్న ముడిచమురున్న తెట్టును రైతులు పట్టుకోవడంతో ఈ బండారం బట్టబయలైంది. దీనిపై విచారణ జరుగుతోంది. అక్రమాలు నిజమేనని సాక్షాత్తూ ఆయిల్‌ఫెడ్ ఎండీ విష్ణు అనడంతో ఎంత కుంభకోణం జరిగిందనే చ ర్చ జరుగుతోంది. దోపిడీ జరుగుతోందిలా...! గెలలు క్రషింగ్ అయిన తర్వాత వ్యర్థాలను (మడ్డి) వదిలేందుకు అశ్వారావుపేటలో 3 చెరువులను తవ్వారు. రోజూ వీటిని అందులోకి పంపుతారు. నిజానికి వీటిలో 2.3 శాతానికి మించి ముడిచమురు ఉండకూడదు. కానీ అధికారులు ఒకరోజు అకస్మాత్తుగా వెళ్లి చూస్తే క్రషింగ్ అనంతర వ్యర్థాల్లో ఏకంగా 73 శాతం ముడి చమురు ఉన్నట్లు తేలింది. ఒకసారి రైతులు చేయించిన పరీక్షలో ఏకంగా 98 శాతం నూనె ఉన్నట్లు తేలింది. విచారణాధికారుల కమిటీ ముందే ఈ విషయం బట్టబయలైంది. ఈ మడ్డిపై చెరువులో తెట్టు తేలి ఉంటుంది. దాన్ని తీసుకువెళ్లేందుకు కొందరు కాంట్రాక్టర్లు వస్తారు. ఆ తెట్టును అతి తక్కువ ధర కే అమ్ముతారు. అయితే కేవలం తెట్టునే కాకుండా ముడిచమురు కలిసి ఉండేలా ఈ వ్యర్థాలను కూడా పీపాల్లో పోసుకొని దానిపైన తెట్టు వేస్తారు. చూసేవారికి కేవలం తెట్టు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇలా పెద్దఎత్తున ముడిచమురు తరలివెళుతోంది. ఆ ముడి చమురును ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకొని వారు కోట్లు గడిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెట్టును తీసుకెళ్లే లారీలు వచ్చిన రోజునే ఈ మడ్డిలో ముడిచమురును పెద్దఎత్తున కలిపేస్తారు. మిగిలిన రోజుల్లో కలపడానికి అవకాశం ఉండదు. అలా కలిపితే చెరువులు ఓవర్‌లోడ్ అవుతాయి. నెలకు ఐదారుసార్లు ఇలా చేస్తున్నారు. తెట్టును బస్తా సంచుల్లో తీసుకెళ్లవచ్చు. కానీ పీపాల్లో తరలిస్తుండటం గమనార్హం. ఆయిల్‌ను ఉత్పత్తి చేసే సమయంలో వృథాగా బైటకు వెళ్లే తెట్టు బాగా అట్టకట్టుకొని ఉంటుందని.. దాన్ని బస్తా సంచుల్లో ఎత్తి పంపేయవచ్చని అంటున్నారు. పీపాల్లోనూ.. ట్యాంకర్లలోనూ తెట్టును నింపాల్సిన అవసరం ఉండనే ఉండదంటున్నారు. అంటే ముడిచమురుతో నిండిన తెట్టును అక్రమంగా తరలిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలా నెలకు రూ. 5 కోట్లకుపైగా కొల్లగొడుతున్నారని అంచనా. ఇంకో మార్గంలో దోపిడీ.. రైతులకు నెలకోసారి వారి గెలలకు ఎంత రికవరీ (ముడిచమురు) వచ్చిందో దాని ప్రకారం పేమెంట్ చేస్తారు. సహజంగా ఇక్కడ 24 శాతం రికవరీ ఉండాలి. కాని వ్యర్థపు నీటిలో ముడిచమురును తరలించడం వల్ల గెలల ద్వారా వచ్చే ముడిచమురు రికవరీని కేవలం 18 శాతానికి మించనీయకుండా అధికారులు చూస్తారు. ఆ ప్రకారం రైతులకు ఐదారు శాతం రికవరీ తగ్గుతుండటంతో పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఇంకో గమ్మత్తై విషయం ఏమింటంటే అశ్వారావుపేట క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన 13 (అందులో ఒకటి ప్రభుత్వ సంస్థ) ప్రైవేటు కంపెనీలు రికవరీ ధర నిర్ణయిస్తాయి. దీని రికవరీ ప్రభావం రెండు రాష్ట్రాల్లోని రైతులపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు దేశంలో ఉన్న మిగిలిన ప్రైవేటు కంపెనీలు కూడా దీన్నే అనుసరిస్తాయని అంటున్నారు. ఎందుకంటే దేశంలో అధికంగా మన ఉమ్మడి రాష్ట్రాల్లోనే పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అశ్వారావుపేటలో ఉన్న ఆయిల్‌ఫెడ్ వారి క్రషింగ్ ఫ్యాక్టరీ రికవరీ రేటునే ప్రామాణికంగా గుర్తిస్తారు. అంటే అన్నిచోట్ల కూడా రైతులకు ఐదారు శాతం రికవరీ రేటును తగ్గించి ధర ఇవ్వడంతో రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఇలా మొత్తంగా అన్ని ప్రాంతా ల రైతులను దోపిడీ చేస్తున్నారు. తద్వారా దాదాపు ఈ నాలుగైదేళ్లలో దాదాపు రూ. 450 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు సంబంధిత ఉన్నతాధికారే ఒకరు చెప్పడం గమనార్హం. అంతేగాకుండా దీని రికవరీ రేటును మరింత తగ్గించి చూపించి నష్టాలబాట పట్టేట్లు చేస్తే ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవచ్చనేది మరో కుట్రగా చెబుతున్నారు. ముడిచమురు దోచుకెళ్లడం.. రికవరీ రేటును తగ్గించి చూపడం.. నష్టాలబాట పట్టించడం అన్న కోణంలో ఇక్కడ కుట్ర జరుగుతోంది. దీనికి ఆయిల్‌ఫెడ్‌కు చెందిన కొందరు అధికారులు కూడా కుమ్మక్కయినట్లు ఓ అధికారే వెల్లడించారు. రైతులు మొత్తుకున్నా పట్టించుకోని వైనం... పామాయిల్ తోటలు సాగు చేసే రైతులు క్రషింగ్ కు వచ్చినప్పుడు తమకు ఎకరానికి రావాల్సిన ఆదాయం రాకపోవడంపై అనేకసార్లు తమ గోడును వెళ్లగక్కారు. విదేశాల్లో ఎక్కువ ఆయిల్ వస్తున్నప్పుడు ఇక్కడ తక్కువ రావడానికి కారణమేంటని ప్రశ్నిస్తే... ఇక్కడి నేలల్లో పండే పామాయిల్‌తో అంతస్థాయిలో ఆయిల్ రాదని చెప్పేవారు. దీంతో వారు తీవ్రమైన నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. పెపైచ్చు వందల కోట్ల రూపాయలు ఆర్జించాల్సిన ఆయిల్‌ఫెడ్ ఆదాయం గణనీయంగా తగ్గింది. అయినా ఇటువంటి దారుణమైన కుంభకోణం జరగడం దారుణమని రైతులు అంటున్నారు. కోట్లల్లో వ్యాపారం... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆయిల్‌ఫాం గెలల నుంచి పామాయిల్ తీస్తారు. అందుకోసం తెలంగాణలో అశ్వారావుపేటలో ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలో ప్రభుత్వ ఫ్యాక్టరీ ఉంది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో మరో 12 ప్రైవేటు క్రషింగ్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి ద్వారా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక హెక్టారు పామాయిల్ తోటలకు రూ. 30 వేల మేర సబ్సిడీ ఇస్తుంది. ఒక్కో ఎకరానికి 12 టన్నుల ఆయిల్‌ఫాం గెలలు వస్తాయి. వాటిని క్రషింగ్ చేస్తే 30 శాతం ఆయిల్ వస్తుంది. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గంటకు 20 టన్నులు క్రష్ చేస్తారు. తద్వా రా 6 టన్నుల ఆయిల్ వస్తుంది. అలా రోజుకు 20 గంటలపాటు 400 టన్నుల పామాయిల్ గెలలను క్రషింగ్ చేస్తే 120 టన్నుల ముడిచమురు వస్తుంది. టన్ను ముడిచమురు ఆయిల్ మార్కెట్లో రూ. 40 వేలకుపైగా ధర పలుకుతుం ది. అంటే రోజుకు రూ. 48 లక్షల విలువైన ఆయి ల్ అశ్వారావుపేటలో క్రషింగ్ అవుతోందన్నమా ట. ఇంత భారీగా ఆయిల్ వస్తుండటంతో దాన్ని కొల్లగొట్టేందుకు భారీ ఫ్లాన్ వేశారు. పారిశ్రామి క నేపథ్యం ఉన్న రాజకీయ ప్రముఖులు, ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఇందులో కీలకంగా ఉన్నారు. దాన్ని నష్టాల బాటన తీసుకొచ్చి కాజేసే కుట్ర జరుగుతోంది. ఔను.. అక్రమాలు జరిగాయి: వీఎన్.విష్ణు, ఆయిల్‌ఫెడ్ ఎండీ అశ్వారావుపేట పామాయిల్ గెలల క్రషింగ్ ఫ్యాక్టరీలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే తెట్టును బస్తాల్లో కాకుండా పీపాల్లో తీసుకెళ్లారు. ఫ్యాక్టరీ స్థాయిలోనే ఈ అక్రమాలకు తెరలేచింది. దీనిపై విచారణకు ఆదేశించాను. ఏమేర అక్రమాలు జరిగాయో విచారణ నివేదిక వచ్చాక తెలుస్తుంది. -
‘టాక్స్’ఫోర్స్!
► రాజకీయ కక్ష సాధిస్తున్న అధికార పార్టీ నేతలు ► జీ హుజూర్ అంటున్న పోలీసు యంత్రాంగం ► చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు ► ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం ► అమాయకులపై స్మగ్లింగ్ పేరుతో కేసులు ► రైల్వేకోడూరు, రాజంపేటలో చెలరేగుతున్న తెలుగుతమ్ముళ్లు సి...నాయుడు, పి...నాయుడు, వీఎస్...నాయుడు.. వీరందరూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తులు. వీరందరిదీ రాజంపేట నియోజక వర్గంలోని సిద్దవటం మండలం. ఏడాది క్రితం పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చారు. ఈ ముగ్గురు ఓ ఎంపీకి సన్నిహితులు. పెపైచ్చు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మద్దతు ఉంది. ఇంకేముంది.. అడవులను విచ్చలవిడిగా ధ్వంసం చేయసాగారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో ఇబ్బడి ముబ్బడిగా ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. విచిత్రమేమిటంటే వారి డంప్‌లు పట్టుబడితే వేరేవ్యక్తులపై కేసులు బనాయిస్తున్నారు. రైల్వేకోడూరుకు చెందిన రాజగోపాల్ ఫ్యాన్సీ దుకాణం నిర్వాహకుడు. మిత్రులు సుధాకర్, గిరి(కానిస్టేబుల్)తో కలిసి రెడ్డిపల్లెలోని ఓ వివాహనికి బైక్‌లో పయనమయ్యారు. మార్గమధ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అటకాయించారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనంను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అక్రమ కేసు నమోదు చేశారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ కేసులో మరికొందరిని చేర్చి మరో తప్పు చేశారు. పై రెండు ఘటనలు పరిశీలిస్తే పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు ప్రస్ఫుటం అవుతోంది. ఓవైపు ఇతర రాష్ట్రాల కూలీలతో ఎర్రచందనం స్మగ్లర్లు ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. అడ్డుకుంటున్న అటవీ సిబ్బందిని కిరాతకంగా నరికేస్తున్నారు. ఇలాంటి తరుణంలో స్మగ్లర్ల ఆట కట్టించాల్సిన టాస్క్‌ఫోర్స్ పోలీసు యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ నేతలకు తాము దాసులమనే చెప్పకనే చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతల మెప్పుకోసం స్మగ్లర్లను గౌరవస్థులుగా, అమాయకులను నేరస్థులుగా మారుస్తున్నారు. కళంకితులకు బాధ్యతలా..! నీతి, నిజాయితీ ఉన్న అధికారులకు టాస్క్‌ఫోర్స్ విభాగంలో బాధ్యతలు అప్పగిస్తే అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంది. తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్ రైల్వేకోడూరు,రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని స్మగ్లర్లపై నిఘా ఉంచింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సివిల్ ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్లలో ‘మూడు పువ్వులు ఆరుకాయలు’గా అసాంఘీక కార్యక్రమాలు చెలరేగిపోయాయి. రైల్వేకోడూరులో పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాల నేపధ్యంలో కేవలం 9నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. వేంపల్లెలో పనిచేస్తున్న సమయంలో సివిల్ పంచాయితీల దందా నేపధ్యంలో అక్కడి నుంచి సైతం బదిలీ అయ్యారు. అలాంటి అధికారికి టాస్క్‌ఫోర్స్ వింగ్‌లో అవకాశం దక్కింది. ఇంకేముంది అధికారపార్టీ నేతలతో టాక్స్(మాటలు) నిర్వహించడం, ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించడం చేస్తున్నారు. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల పరిధిలో ఈతరహా వ్యవహరం ప్రస్తుతం నడుస్తోంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారులకు టాస్క్‌ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా అవినీతి ఆరోపణలు ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే టాస్క్‌ఫోర్స్ స్థానంలో ‘టాక్స్’ఫోర్స్ ఏర్పడక తప్పదని పలువురు భావిస్తున్నారు. -
‘ఎర్ర’దొంగల కోసం కొత్త చట్టం
ఏపీలో ‘కఫిపొసా’ తరహా చట్టానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు స్టోరీ బోర్డు హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల ఆటకట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు పటిష్టమైన చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. అటవీ చట్టంలో ఉన్న సెక్షన్ 49 ప్రకారం పోలీసు అధికారులు ఎర్రచందనాన్ని సీజ్ చేసినా.. తమంతట తాముగా స్వాధీనం చేసుకునే అధికారం లేదు. సదరు స్మగ్లర్ అక్రమ రవాణా ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడని తెలిసినా వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉండట్లేదు. దీంతో ఈ పరిస్థితుల్ని మార్చి, ఎర్రచందనం అక్రమ రవాణాదారులకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు ప్రస్తుతం ఉన్న అటవీ చట్టంలోనూ సవరణలకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ స్మగ్లింగ్‌ను నిరోధించడం కోసం కస్టమ్స్ అధికారులు ప్రయోగిస్తున్న ‘ది కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ (కఫిపొసా)-1974’ తరహాలో తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరహా చట్టం అమలులోకి వస్తే ఎర్రచందనం స్మగ్లర్లకు బెయిల్ కష్టతరం కావడంతో పాటు వారికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్తున్నారు. అయితే అటవీ సంబంధ విషయాలు కేంద్రం-రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్నవి కావడంతో వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచీ అనుమతి పొందడం అనివార్యంగా మారింది. మరో నెల రోజుల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా.. వాస్తవానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి నమోదు చేయడానికి ప్రత్యేక సెక్షన్లు ఏవీ లేవు. దీంతో పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లపై పోలీసులు అటవీ చట్టంలోని కొన్ని సెక్షన్లతో పాటు చోరీ (ఐపీసీ 379), అనుమతి లేకుండా ఓ ప్రాంతంలో గుమిగూడటం (ఐపీసీ 147), మారణాయుధాలతో గుమిగూడటం (ఐపీసీ 148), ఓ నేరం చేసేందుకు సమూహంగా గుమిగూడటం (ఐపీసీ 149) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సరిపెట్టాల్సి వస్తోంది. వీటిలో నిందితులకు తేలిగ్గా బెయిల్ లభించే అవకాశం ఉండటంతో స్మగ్లర్లను వీలైనంత ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు హత్యాయత్నం (ఐపీసీ 307), ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం/దాడి చేయడం (ఐపీసీ 353) వంటి సెక్షన్లు జోడిస్తున్నారు. సదరు స్మగ్లర్లు, కూలీలను అరెస్టు చేసే సందర్భంలో ఈ పరిణామాలు ఎదురైనా, కాకున్నా అనివార్యంగా వీటిని జోడించాల్సి వస్తోంది. ఫలితంగా కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు నిరూపించడం కష్టంగా మారి వీగిపోయే పరిస్థితులు ఉన్నాయి. -
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తిరుమల/ తిరుపతి అర్బన్: నిబద్ధతతో పనిచేస్తూ శాంతి, భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తిరుపతి అర్బన్ నూతన ఎస్పీ గోపీనాథ్ జట్టి అన్నారు. గురువారం ఉదయం ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో సంప్రదాయంగా ఫైల్‌పై ఎస్పీ సంతకం చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని, వకుళమాతను దర్శించుకున్నారు. తదుపరి తిరుపతి చేరుకుని ఎస్పీ కార్యాలయం లో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ఎప్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల, తిరుపతి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, తిరుపతి నగరం తనకు కొత్తేమీ కాదన్నారు. తాను ఇక్కడే వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ చదివానన్నారు. గతంలో తమిళనాడులోనూ అటవీ శాఖకు సంబంధించిన శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. ఆ కారణంగా అటవీ శాఖపై కూడా పూర్తి పట్టు ఉందని, శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అందుకోసం ప్రస్తుత అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అక్రమ రవాణాను అదుపు చేస్తామని వివరించారు. తిరుపతిలాంటి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వర్తించడం అదృష్టంగా భావించడమే కా కుండా సంతోషంగా ఉందన్నారు. అదే తరుణంలో దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాదిమంది యా త్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మరింత లోతుగా అధ్యయ నం చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. తిరుపతి నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో అల్లరి మూకలను కూకటివేళ్లతో పెకలిం చి వేసేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తామన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీ సుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. కొత్త గా బాధ్యతలు చేపట్టిన అర్బన్ ఎస్పీని విజిలెన్స్ అం డ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రవిశంకర్‌రెడ్డితోపాటు ఏఎస్పీలు, అర్బన్ జిల్లా పరిధిలోని పలువురు డీఎస్పీ లు, సీఐలు, నగరంలోని ప్రముఖులు కలసి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు శ్రీవారి సందర్శన సమయంలో ఎస్పీ వెంట తిరుపతి ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ విజయశేఖర్, ఎస్ఐ తిమ్మయ్య ఉన్నారు. -
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రదొంగలపై సస్పెక్టెడ్ షీట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు సమావేశంలోగుంటూరు రేంజ్ ఐజీ నెల్లూరు(క్రైమ్): ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ పోలీసు, అటవీ అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గురువారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే, సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన సోమశిల, రాపూరు, ఉదయగిరి, మర్రిపాడు తదితర ప్రాంతాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలపై ఇకమీదట ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని ఎస్ఐలు తీసుకొంటున్న చర్యలు? ఎంత మందిని అరెస్ట్‌చేశారు? ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర వివరాలను విధిగా తెలియచేయాలన్నారు. దాని ఆధారంగానే వారి పనితీరును అంచనా వేస్తామన్నారు.గతంలో ఎర్రచందనం కేసుల్లో అరెస్ట్ అయిన వారిపై వెంటనే సస్పెక్టెడ్ షీట్లు తెరవాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించినా? నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై వేటు తప్పదని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సోమశిల కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కథనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ నవదీప్ సింగ్ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను ఐజీకి వివరించారు. అటవీశాఖ అధికారులు నేరస్తులను పట్టుకునేందుకు గ్రామాల్లోకి వెళ్లిన సమయంలో రాజకీయనాయకులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. దీంతో నిందితులు తప్పించుకుంటున్నారని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన ఐజీ స్థానిక పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేయాలని, అటవీ అధికారులకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి రాంబాబు, ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, రాంబాబు, మాల్యాద్రి, బాలవెంకటేశ్వరరావు, చౌడేశ్వరి, ఓఎస్డీ శిల్పవల్లి, గూడూరు, కావలి, ఆత్మకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, అటవీ అధికారులు, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, వై. జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్..
కేసముద్రం మార్కెట్ కార్యదర్శికి వ్యాపారుల వినతి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల తరలింపే కారణం కేసముద్రం, న్యూస్‌లైన్ : అధికారుల అవగాహనా రాహిత్యం కారణంగా రైతులే ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో కాలంటాలు నిలిపివేశారు. ఇప్పటికే కొనుగులు చేసి నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలిం చేందుకు ఏ ఒక్క లారీని వదలకుండా పోలీ సుల సహకారంతో వినియోగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కోసం వ్యాపారులు తెప్పించుకున్న లారీలను సైతం కొనుగోలు కేం ద్రాల వద్దకు మళ్లించారు. దీంతో ఇతర వాహనాలను వెతుక్కుని సరుకులను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాపారులు వాపోయారు. ఇప్పటికే కేసముద్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోమటిపల్లి, కేసముద్రంవిలేజ్, ఇనుగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 20 వేలకుపైగా ధాన్యం బస్తాలు, ఐకేసీ ద్వారా కల్వల, కాట్రపల్లి, అర్పనపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లోని కేంద్రాల్లో సుమారు 40వేల బస్తాలు, ధన్నసరి పీఏసీఎస్ కేంద్రంలో సుమారు 20వేల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. ఆ ధాన్యాన్ని తరలించడానికి నిర్వాహకులు, పోలీసు యంత్రాంగం నానా పాట్లు పడుతున్నారు. బుధవారం మార్కెట్లోని పత్తి వ్యాపారులంతా ఏకమయ్యారు. తాము తెచ్చుకున్న లారీలన్నింటినీ కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారని, గురువారం నుంచి తాము పత్తి కొనుగోళ్లు చేపట్టలేమంటూ మార్కెట్ ప్రత్యేకహోదా కార్యదర్శి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఇద్దరు నిందితుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఒకటికాదు, రెండు కాదు... ఏకంగా వెయ్యి జిలెటిన్‌స్టిక్స్, రెండువేల ఎలక్ట్రానిక్ డిటొనేటర్లను అక్రమంగా తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆల్వాల్ ఏసీపీ జి.ప్రకాశరావు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... బుధవారం రాంపల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మారుతీ జెన్ కారు(ఏపీ11ఎఫ్6399)ను సోదా చేయగా, అందులో మొత్తం వెయ్యి జిలెటిన్ స్టిక్స్, 2150 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న టి.సురేందర్‌తోపాటు హోల్‌సేల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నగర శివారు మండలాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు అవసరమైన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను సరఫరా చేస్తున్న వీరిరువురిపై గతంలో మేడ్చల్ తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు విచారణలో ఉన్నాయి. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ప్రముఖుల ‘హస్తం’
కర్నూలు: చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాలకే పరిమితమైన ఎర్రచందనం అక్రమ రవాణా కర్నూలు జిల్లాలోనూ విస్తరిస్తోంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అడపాదడపా దుంగలు పట్టుబడటం తెలిసిందే. తాజాగా వెల్దుర్తి వద్ద దాదాపు రూ.40కోట్ల విలువ చేసే దుంగలు ఓ గుజిరీ గోడౌన్లో బయటపడటం చూస్తే ఈ అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో తెలియజేస్తోంది. ఈ బాగోతం వెనుక అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విస్తారంగా లభిస్తోంది. అక్రమార్కులు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన కూలీలతో ఈ దుంగలను జపాన్, చైనా దేశాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డొస్తే ఎంతటి వారినైనా మట్టుబెట్టేందుకూ వెనుకాడని పరిస్థితి. ఇటీవల చిత్తూరు జిల్లా అటవీ అధికారులు స్మగ్లర్ల చేతిలో దారుణ హత్యకు గురవడం ఇందుకు నిదర్శనం. ప్రతిగా ఒకరిద్దరిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో పాటు వందలాది మందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్ర దొంగలు రూటు మార్చారు. అక్రమ రవాణాకు కర్నూలు జిల్లాను అడ్డాగా మార్చుకుంటున్నారు. అటవీ, పోలీసు శాఖలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా అక్రమార్కులు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారు. శేషాచలం అడవిలోని ఎర్ర చందనం దుంగలను అధికారుల కళ్లుగప్పి చిత్తూరు, పుత్తూరు, పీలేరు మీదుగా చెన్నై, కర్ణాటక ప్రాంతాలకు తరలించేవారు. ప్రస్తుతం నిఘా పెరగడంతో కర్నూలు జిల్లాను అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. సేకరించిన దుంగలను అటవీ మార్గంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో కర్నూలుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వైఎస్ఆర్ కడప జిల్లా కోడూరుకు చెందిన గంగిరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన రమేష్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డిలు మరికొందరితో కలసి జాతీయ రహదారి పక్కనున్న గోదాములను అద్దెకు తీసుకున్నారు. అందులో ఒకటి వెల్దుర్తి వద్దనున్న గుజిరీ గోదాము. గత నెల 28న డోన్ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ సుబ్రహ్మణ్యంరెడ్డిలు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వెల్దుర్తి వైపు నుంచి వస్తున్న లారీని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 228 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. లారీ క్లీనర్ రాంబాబు, కర్నూలుకు చెందిన సోమసుందర్గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్దుర్తి కేంద్రంగా ఈ బాగోతం నడుస్తున్నట్లు గుర్తించారు. అందరికీ ఆమ్యామ్యాలు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం దుంగలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో నంబర్-1 క్వాలిటీ ఎర్రచందనం టన్ను ధర రూ.20లక్షల పైమాటే. ఒక్క కంటైనర్‌ను ఇతర దేశాలకు తరలిస్తే సుమారు పది మంది వరకు కోటీశ్వరులవుతున్నారు. వారితో పాటు కూలీలు, కొందరు పోలీసులు, అటవీ, చెక్‌పోస్టు అధికారులు, లారీ, కంటైనర్ డ్రైవర్లు లక్షాధికారులవుతున్నారు. డబ్బుకు ఆశపడి అధికారులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం. ఇంత పెద్ద స్థాయిలో వాహనాల్లో అక్రమ రవాణా సాగుతున్నా మార్కెట్‌యార్డుల చెక్‌పోస్టుల్లో సిబ్బంది ఏమి చేస్తున్నట్లు ప్రశ్న తలెత్తుతోంది. ఎవరి స్థాయిలో వారు మామూళ్లతో సరిపెట్టుకోవడం వల్లే దుంగల దొంగలు చేలరేగినట్లు తెలుస్తోంది. -
‘డబుల్’ ధమాకా!
నంబర్ల కేటాయింపులో ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం ఒకే నంబర్ రెండు వాహనాలకు ఏజెంట్ల దందావల్లే ఈ పరిస్థితి అన్న ఆరోపణలు లక్కీ నంబర్ల పేరుతో అడ్డగోలు కేటాయింపులు జరగరానిది జరిగితే ఎవరిని బాధ్యులు చేస్తారో? అక్రమ రవాణా, విద్రోహక చర్యలకు ఇప్పుడు వాహనాలే కేంద్రబిందువులుగా మారాయి. ఈ పరిస్థితుల్లో జరగరానిది జరిగితే పోలీసులకు వాహన తయారీ సంస్థ, నంబర్లే ప్రాథమిక ఆధారం. అటువంటప్పుడు నంబర్ల కేటాయింపు ఎంత పక్కాగా ఉండాలి? ఆ...అంతేం లేదండీ అనుకున్నారో ఏమో మన ఆర్టీఏ అధికారులు ఒకే నంబర్ రెండు వాహనాలకు కేటాయించి తమ తీరును చాటుకున్నారు. ఏదైనా ఘటన జరిగితే ఎవరిని బాధ్యులను చేస్తారో వారే చెప్పాలి. చోడవరం, న్యూస్‌లైన్: లక్కీ నంబర్ల ప్రహసనం చిక్కులు తెచ్చిపెడుతోంది. సంఘ విద్రోహక శక్తులకు ఆసరాగా మారుతోంది. వాహనదారుల సెంటిమెంట్, ఏజెంట్ల దందా, రవాణా శాఖకు కాసుల పంట వెరసి నంబర్ల కేటాయింపు పక్కతోవ పడుతోంది. ‘నగదు కొట్టు...నంబర్ పట్టు’ అన్న సిద్ధాంతం కొనసాగుతుండడంతో ఏజెంట్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా పరిస్థితి మారింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ /చలానా తేదీ ఆధారంగా వరుస క్రమంలో వాహనాలకు నంబర్లు కేటాయిస్తారు. ఒక సీరియల్లో నంబర్ ఒక వాహనానికే కేటాయించాలి. అనకాపల్లి ఆర్టీఎ కార్యాలయంలో ఒకే నంబర్‌ను రెండు మూడు వాహనాలకు కేటాయిస్తున్న విషయం వెల్లడైంది. ఈ పరిస్థితి యజమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. కిడ్నాప్‌లు, రోడ్డు ప్రమాదాలు, సంఘ విద్రోహక చర్యలు, అక్రమ రవాణా... ఇలా విచ్చలవిడిగా నేరాలు జరుగుతున్నాయి. మెజారిటీ ఘటనల్లో నిందితులు ఏదో ఒక వాహనాన్ని వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన నంబర్ కేటాయింపులో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చోడవరం మండలానికి చెందిన రెండు వాహనాలకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ (ఏపీ 31టీ 4104)ను అనకాపల్లి ఆర్టీఏ అధికారులు కేటాయించారు. వెంకన్నపాలెంకు చెందిన నంబారు ముసిలినాయుడు 2013 ఫిబ్రవరిలో టాటా సూపర్ ఏసీ సరకు రవాణా వాహనం కొన్నారు. ఏజెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నర్సాపురానికి చెందిన బొడ్డేడ ముత్యాలనాయుడు 2013 జూన్‌లో మెగా మ్యాక్స్ ప్రయాణికుల ఆటో కొన్నారు. ఏజెంట్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయించారు. ముసిలినాయుడు వాహనానికి ఇచ్చిన నంబర్ (ఏపీ 31టీ 4104)నే అధికారులు ముత్యాలనాయుడు వాహనానికి ఇచ్చారు. ముసిలినాయుడు నాలుగు రోజుల క్రితం ఆర్టీఏ కార్యాలయానికి ట్యాక్స్ కట్టేందుకు వెళ్లాడు. డబ్బులు కట్టించుకుని రశీదుకు తర్వాత రమ్మనడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరు యజమానులు అవాక్కయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇంకా ఎన్ని వాహనాలకు ఇలా ‘డబుల్ ధమాకా’ ఇచ్చారో అని ఇతర వాహనాల యజమానులూ ఆందోళన చెందుతున్నారు. లక్కీ నంబర్ కోసం... మొత్తం తొమ్మిది వచ్చే విధంగా లక్కీ నంబర్ కోసం చోడవరం ఆర్టీఏ ఏజెంట్ మధుకి రూ.5 వేలిచ్చాను. నాకు ఏపీ 31టీ 4104 నంబర్‌ను కేటాయించారు. ఒకసారి ట్యాక్స్ కూడా కట్టాను. తర్వా త తెలిసింది ఇదే నంబర్‌తో పక్క ఊరులో మరో వాహనం తిరుగుతోందని. ఏదైనా జరిగితే ఇది చిక్కులు తెచ్చిపెడుతుంది. అధికారులు న్యాయం చేయాలి - నంబారు ముసిలినాయుడు, వెంకన్నపాలెం అవాక్కయ్యాను నా బండి నంబరే మరో వాహనానికి ఉండడం చూసి అవాక్కయ్యాను. వాహనం కొన్న తరువాత అనకాపల్లిలో ఆర్టీఏ ఏజెంట్ రాయుడు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాను. ఏపీ 31టీ 4104 నంబర్ కేటాయించారు. తీరా ఇప్పుడు చూస్తే ఇదే నంబర్ మరో వాహనానికి ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. - బొడ్డేడ ముత్యాలనాయుడు, నర్సాపురం. -
స్వాతంత్య్రానికి పూర్వమే అటవీ హత్యలు
సాక్షి ప్రతినిధి, కడప: అటవీ హత్యలు ఈనాటివి కావు. స్వాతంత్య్రం రాకముందు కూడా ఇలాంటి హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. అడవులను కాపాడుకోవాలనే దృక్పథాన్ని విడనాడి ప్రకృతి సంపద ద్వారా అక్రమార్జన చేయడానికి కొందరు అలవాటుపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిత్తూరు జిల్లాలో అటవీ సిబ్బందిని స్మగ్లర్లు కిరాతకంగా హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. అలాంటి ఘటన 1939లోనే వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. స్మగ్లర్లతో పాటు క్రూరమృగాల నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలన్న అటవీ సిబ్బంది విన్నపాన్ని పాలకులు 8 దశాబ్దాలుగా పెడచెవిన పెడుతున్నారు. 1939లోనే మూడు హత్యలు... చిట్వేలి మండలం తిమ్మయ్యగారిపల్లెలో 1939 మార్చి 17న ముగ్గురు అటవీ సిబ్బంది హత్యకు గురయ్యారు. అటవీ సంపదను తెగనరకవద్దని అన్నందుకే వీరు ప్రాణాలు కోల్పోయారు. తిమ్మయ్యగారిపల్లెకు చెందిన కేశవులు, సోమయ్య, పెంచలు అనే ముగ్గురు అక్కడి ఫారెస్టు సంరక్షకులుగా ఉండేవారు. వంట చెరకు, ఇంటి సామగ్రి కోసం అడవిని స్థానికులు నిత్యం ధ్వంసం చేస్తుండేవారు. కటారి పాపయ్య అనే వ్యక్తి అడవిని కొల్లగొడుతుండటంతో కేశవులు పరుషంగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన కటారి పాపయ్య ముగ్గురిని హత్యచేసి మృతదేహాలను అడవిలో పారేశాడు. ఈ కేసుకు సంబంధించి కటారిపాపయ్యకు మరణశిక్ష విధించగా తన పలుకుబడితో యావజ్జీవ శిక్షకు పరిమితం చేసుకున్నాడు. అటవీ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి సిబ్బంది గుర్తుగా స్మారకస్థూపం ఏర్పాటైంది. ఆ నాటి నుంచి ఆ ప్రాంతాన్ని కేశవుల బండ అని పిలుస్తున్నారు. పునరావృతం అవుతున్న ఘటనలు.... అక్రమార్జనకు ఎర్రచందనం ఆర్థిక వనరుగా మారడంతో తరుచూ అటవీ యంత్రాంగ ంపై దాడులు జరుగుతున్నాయి. జిల్లాలో 2010లో పుల్లలమడుగు బీట్‌లో అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు కాల్పులు జరిపారు. సుండుపల్లె సమీపంలో అటవీ సిబ్బందిపై ప్రత్యక్ష దాడులు చేశారు. కడప సమీపంలోని పాలకొండల్లో ఓబులేసు అనే బీట్ ఆఫీసర్‌పై దాడి చేశారు. మైదుకూరు సెక్షన్ పరిధిలో వరుస దాడులు జరిగాయి. అంతరించిపోతున్న ఎర్రచందనాన్ని రక్షించాలంటే అటవీ సిబ్బందికి ఆయుధాలు అవసరమని ఉన్నతాధికారులు పలుమార్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కడప, చిత్తూరు, కర్నూలు అటవీ సిబ్బందికి 400 తుపాకులు అవసరమని నివేదికలు సమర్పించారు. ఆ నివేదికలు బుట్టదాఖలయ్యాయి. దీంతో ఎర్రచ ందనం స్మగ్లర్లకు ఇష్టారాజ్యమైంది. అనతి కాలంలోనే కోటీశ్వర్లుగా చ లామణి అవుతుండటంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వదులుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పాలకుల అండతోనే.. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లుగా ఉంది. అధికారంలో ఉన్న పాలకుల అండదండలతో స్మగ్లర్లు చెలరేగిపోతున్నట్లు పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గజ్జల శ్రీనివాసులరెడ్డిపై వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు ఏడు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డితో శ్రీనివాసులరెడ్డి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడు. ‘గజ్జ గల్లు- అడవి ఘెల్లు’ అంటూ గత ఏడాది సాక్షి కథనం కూడా ప్రచురించింది. గజ్జల శ్రీనివాసులరెడ్డి అలియాస్ శ్రీనురెడ్డి కొన్నేళ్ల క్రితం కోర్టులో లొంగిపోయాడు. అప్పట్లో అటవీ యంత్రాంగం శ్రీనురెడ్డిపై పీడీ యాక్టు అమలు చేసింది. కొంత కాలం జైలు జీవితం గడిపిన శ్రీనురెడ్డి చట్టంలో ఉన్న లొసుగుల కారణంగా బయటికొచ్చాడు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా శ్రీను రెడ్డి పత్రికలలో శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి స్మగ్లర్లను అడ్డుకునే సాహసం ఎవరు చేస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే అటవీ హత్యలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలకు ఇటువంటి ఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు. -
పేదల బియ్యం పెద్దల భోజ్యం
సాక్షి, గుంటూరు :కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రేషన్ బియ్యం అధిక మొత్తంలో దారి మళ్లుతోంది. మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి కోటా బియ్యం సరఫరా కాగానే పలువురు డీలర్లు దొడ్డిదారిన విక్రయించదలచిన సరుకును వేరు చేస్తున్నారు. కార్డుదారుల్లో 20 నుంచి 30 శాతం మంది కిలో రూపాయి బియ్యం తీసుకోరు. వీరికి కేటాయించిన బియ్యంతో పాటు మరికొన్ని క్వింటాళ్ల బియ్యాన్ని జత కలిపి లారీలకు ఎక్కిస్తున్నారు. బాగా పరిచయస్తులైన రైసు మిల్లుల యజమానులతో ముందే మాట్లాడుకుని వ్యూహాత్మకంగా బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. మిల్లులకు చేరిన బియ్యాన్ని ఆయా మిల్లుల యజమానులు బాగా పాలిష్ పట్టించి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయించుకుంటున్నారు. గడచిన రెండు నెలలుగా ఈ మూడు జిల్లాల్లోనూ రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఆపైన విక్రయాలు బాగా పెరిగాయి. ఎప్పటికప్పుడు దీన్ని నియంత్రించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు డీలర్లు ముట్టజెప్పే నెలసరి మామూళ్లు, నజరానాలకు కక్కుర్తిపడి పేదల బియ్యంపై నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. దీంతో పేదలకు పంచాల్సిన బియ్యాన్ని కొందరు డీలర్లు, వ్యాపారులతో కలిసి కిలో రూ. 8 నుంచి రూ.10 చొప్పున మిల్లులకు విక్రయిస్తున్నారు. పాలిష్ వేయించిన ఈ బియ్యాన్ని మిల్లర్లు తిరిగి జనానికే కిలో రూ.16 చొప్పున విక్రయిస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా మండపేట, రాజోలు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని మిల్లుల యజమానులు అధికంగా ఈ తరహా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. 8 నెలల్లో 6342 క్వింటాళ్ల రవాణా.. గుంటూరు జిల్లాలోనే రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో బ్లాక్‌మార్కెట్‌కు చేరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నవంబరు నెలాఖరు వరకు జిల్లాలో అక్రమంగా రవాణా అవుతున్న 6342 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.30 కోట్లు. 61 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. మరో 161 మందిపై నిత్యావసర వస్తువుల ఉల్లంఘన చట్టం కింద 6ఏ కేసులు నమోదు చేశారు. మరో 83 వాహనాలను సీజ్ చేశారు. ఇంకా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా సరిహద్దులు దాటించిన బియ్యం మరో 500 క్వింటాళ్లు ఉండొచ్చని అధికారుల అంచనా. నవంబరు నెలలోనే జిల్లా విజిలెన్సు అధికారులు రూ. 33 లక్షల విలువైన 1683 క్వింటాళ్ల బియాన్ని సీజ్ చేశారు. గుంటూరు ఆటోనగర్, చిలకలూరిపేట, చల్లగుండ్ల, గామాలపాడు, చమళ్లమూడి, వినుకొండ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా అవుతున్న పేదల బియ్యాన్ని విజిలెన్సు అధికారులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. అదేవిధంగా ప్రకాశం,కృష్ణా జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం దారి మళ్లింది. -
ఇసుక మేటలపై సిండి‘కేట్లు’
=నదీ పరివాహాక పొలాలపై కన్ను =తవ్వకాలకు రైతులచే దరఖాస్తు యత్నం సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఇసుక సిండికేట్లు అనుమతుల్లేకుండానే నదులను తవ్వేశారు. అడ్డొచ్చిన అధికారులపై దాడులకు సైతం దిగారు. రోజురోజుకి వీరి ఆగడాలు అధికమవ్వడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదుతో అడ్డగోలు తవ్వకాలను, అక్రమ రవాణాను కొంతమేరకు కట్టడి చేశారు. కానీ అక్టోబర్ వరదలకు ఇసుక మేటలేసిన పొలాలపై కన్నేశారు. సంబంధిత రైతుల్ని పావుగా వాడుకుని, వాటిలో తవ్వకాలకు అనుమతి తీసుకుని పక్కనున్న నదుల్లో ఇసుక దోచేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. తాండవ, గోస్తనీ, వరహా, శారదా తదితర నదుల్లో నిబంధనలకు లోబడి ఇసుక లేకపోవడంతో మూడేళ్లగా లీజులివ్వలేదు. కానీ ఇసుక సిండికేట్లు మాత్రం ఆగలేదు. అడ్డగోలు తవ్వకాలు, రవాణా చేసి కోట్లకు పడగెత్తారు. ఇదే సమయంలో అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు వారికి బాగా కలిసొచ్చాయి. పొంగి పొర్లిన నదులు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలేర్పడ్డాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇసుక అక్రమార్కులు రంగంలోకి దిగారు. నదీ పరివాహాక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇసుక మేటలేసున్నాయో ఇప్పటికే గుర్తించారు. వ్యవసాయ అధికారులు కూడా అధికారికంగా జిల్లాలో 120 హెక్టార్ల పొలాల్లో ఇసుక మేటలేసినట్టు నిర్ధారించారు. ఇప్పుడా రైతుల పేర్లును సేకరించే పనిలో పడ్డారు. ఆ రైతులకు ఎంతోకొంత ముట్టజెప్పి, వారి ద్వారానే పొలాల్లో ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించి, తరలించేందుకు మండల అధికారుల ద్వారా అనుమతి తీసుకోవచ్చు. దీన్నే సిండికేట్లు అస్త్రంగా చేసుకుంటున్నారు. ఇసుక మేటల తొలగింపు అనుమతితో వాటి ముసుగులో పక్కనున్న నదుల్లోని ఇసుకను దోచేయడమే వారి వ్యూహంగా తెలుస్తోంది. అనకాపల్లి, చోడవరం, తగరపువలస కేంద్రాలుగా పావులు కదుపుతూ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అధికారులకు ముడుపులందించేందుకు లోపాయికారీగా ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు తెలిసింది. -
ఇసుకాసురులు
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా సా గుతోంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పైగా అక్రమ రవాణాను అరికట్టే అధికారులు కొందరు సమైక్య ఉద్యమంలో ఉండడం దొంగలకు లాభిస్తోంది. అవినీతికి అలవాటుపడిన కొందరు అధికారులు ఇసుక దొంగలకు సహకరిస్తుండడంతో నదులు, పొలాలు అన్న తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. ఆదివారం జిల్లా సరిహద్దు ప్రాంతంలో 200కు పైగా ఇసుక లారీలు పట్టుబడడమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు వంకలు, వాగులు, నదీతీర ప్రాంతాల్లోని సాగు భూము ల్లో ఉన్న ఇసుకును ఇష్టానుసారం తవ్వి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక దాదాపు కనుమరుగైంది. సాగు భూములనూ వదలని వైనం స్వర్ణం కరిగిపోవడంతో నదీతీర ప్రాంతాల్లోని సాగు భూములపై కన్నుపడింది. అనుకున్నదే తడవుగా ఇసుకాసురులు భూముల యజమానులను కలసి రూ.లక్షలు ఆశచూపి బంగారం లాంటి భూములను ఎందుకూ పనికిరాకుండా మార్చేస్తున్నారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు సాగు భూములన్నీ బోరుమంటున్నా యి. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న వందలాది ఎకరాల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నారు. రేణిగుంట, గాజులమండ్యం, పాపానాయుడుపేట, గోవిందవరం, వికృతమాల, కొత్తవీరాపురం, తొండమనాడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని సాగు భూములన్నీ ఇసుకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా యి. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లోని ప్రభు త్వ భూముల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. పాపానాయుడుపేట-పెన్నగడ్డం మార్గంలో స్వ ర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూములను కొంతమంది రైతులు లీజుకు తీసుకుని అందులోని ఇసుకును అమ్మి సొమ్ము చేసుకుంటున్నా రు. ప్రశ్నించిన వారికికొంత ముట్టజెపుతున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక రవాణా ఇసుక అక్రమ రవాణా కొందరు అధికారులకు, స్థానికులకు కాసులు కురిపిస్తోంది. ఇసుక ట్రాక్టర్ లేదా లారీ కనిపిస్తే పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులకు పండగే. వాహనాన్ని బట్టి రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఇసుకాసురుల నుంచి వచ్చే మామూళ్లే అధికంగా ఉన్నాయని ఓ అధికారి బహిరంగంగానే చెబుతున్నాడు.