- భారీగా గంజాయి అక్రమ రవాణా
- రూ. 2.50 కోట్ల సరకు సీజ్ ఇద్దరు నిందితుల అరెస్ట్
- ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ
విశాఖపట్నం సిటీ/నర్సీపట్నం టౌన్: హుదూద్ తుపాను గాయాల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంటే కొందరు ప్రబుద్ధులు ఇదే అదనుగా గంజాయిని అక్రమంగా తరలించేస్తున్నారు. ‘సైక్లోన్ రిలీఫ్ వేన్’ పేరుతో గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమ రవాణా చేసేస్తున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం వీటిని పట్టుకున్నారు. సైక్లోన్ రిలీఫ్ వేన్ చిట్టడవిలో ఏం చేస్తుందోనని పరిశీలించిన ఈ బృందానికి క ళ్లు బైర్లు కమ్మేలా గంజాయి బస్తాలు కనిపించాయి.
విశాఖ ఎక్సైజ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణ విశాఖలో శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన క థనం ప్రకారం నర్సీపట్నం నుంచి లంబసింగికి వెళ్లే రోడ్డులో అంజలి పంచాయతీ పరిధిలో భారీఎత్తున గంజాయి తరలింపు జరుగుతోందన్న సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కాపు కాసింది. ఐషర్ వాహనంలో 60 బ స్తాల గంజాయిని తరలిస్తుండగా నెల్లిమెట్ట జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుపడింది.
ఆ వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. వాహనం రాజమండ్రికి చెందిన ఎస్.సుందరి పేరున ఉందన్నారు. వాహనంలో వున్న కూలికి వచ్చిన ఈదులబయలు గ్రామానికి గెమ్మెలి భాస్కరరావు, చింతపల్లికి చెందిన కొర్రా సీతారాంలను పట్టుకున్నారు. మరో ఐదుగురు పరారయ్యారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక సూత్రధారులు ఎవరు? అనే వివరాలను ఎక్సైజ్ పోలీసులు వీరి నుంచి రాబడుతున్నారు.
60 బస్తాల్లో 2,640 కిలోల గంజాయి వున్నట్టు గుర్తిం చారు. దీని విలువ దాదా పు రూ. 2.50 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ కమిషనర్ తానికొండ శ్రీనివాసరావు నేతృత్వంలో నర్సీపట్నం ఇన్‌స్పెక్టర్ జగన్మోహన్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జైభీం, అచ్యుతరావు, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, బసంతీ, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.