విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు గురువారం ఉదయం జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ సీఐ డీవీజీ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది నెల్లిమెట్ల సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఐషర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 720 కిలోల గంజాయి కనిపించింది. ఇందుకు సంబంధించి చింతపల్లికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని వాహనం సహా గంజాయిని సీజ్ చేశారు.