లైంగికదాడి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌ | Absconding Meghalaya MLA Julius Dorphang arrested | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 7 2017 12:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

లైంగిక దాడి కేసులో మేఘాలయ ఎమ్మెల్యే జూలియస్‌ డార్పాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప‍్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రి కుమారుడితో పాటు నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తనను గెస్ట్హౌస్‌కు పిలిపించి దాడికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ‍్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ జారీ చేసి ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను గౌహతిలో అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement