సాక్షి, తిరుపతి: జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా సా గుతోంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పైగా అక్రమ రవాణాను అరికట్టే అధికారులు కొందరు సమైక్య ఉద్యమంలో ఉండడం దొంగలకు లాభిస్తోంది. అవినీతికి అలవాటుపడిన కొందరు అధికారులు ఇసుక దొంగలకు సహకరిస్తుండడంతో నదులు, పొలాలు అన్న తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు.
ఆదివారం జిల్లా సరిహద్దు ప్రాంతంలో 200కు పైగా ఇసుక లారీలు పట్టుబడడమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు వంకలు, వాగులు, నదీతీర ప్రాంతాల్లోని సాగు భూము ల్లో ఉన్న ఇసుకును ఇష్టానుసారం తవ్వి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక దాదాపు కనుమరుగైంది.
సాగు భూములనూ వదలని వైనం
స్వర్ణం కరిగిపోవడంతో నదీతీర ప్రాంతాల్లోని సాగు భూములపై కన్నుపడింది. అనుకున్నదే తడవుగా ఇసుకాసురులు భూముల యజమానులను కలసి రూ.లక్షలు ఆశచూపి బంగారం లాంటి భూములను ఎందుకూ పనికిరాకుండా మార్చేస్తున్నారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు సాగు భూములన్నీ బోరుమంటున్నా యి. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న వందలాది ఎకరాల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నారు.
రేణిగుంట, గాజులమండ్యం, పాపానాయుడుపేట, గోవిందవరం, వికృతమాల, కొత్తవీరాపురం, తొండమనాడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని సాగు భూములన్నీ ఇసుకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా యి. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లోని ప్రభు త్వ భూముల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. పాపానాయుడుపేట-పెన్నగడ్డం మార్గంలో స్వ ర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూములను కొంతమంది రైతులు లీజుకు తీసుకుని అందులోని ఇసుకును అమ్మి సొమ్ము చేసుకుంటున్నా రు. ప్రశ్నించిన వారికికొంత ముట్టజెపుతున్నారు.
కాసులు కురిపిస్తున్న ఇసుక రవాణా
ఇసుక అక్రమ రవాణా కొందరు అధికారులకు, స్థానికులకు కాసులు కురిపిస్తోంది. ఇసుక ట్రాక్టర్ లేదా లారీ కనిపిస్తే పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులకు పండగే. వాహనాన్ని బట్టి రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఇసుకాసురుల నుంచి వచ్చే మామూళ్లే అధికంగా ఉన్నాయని ఓ అధికారి బహిరంగంగానే చెబుతున్నాడు.
ఇసుకాసురులు
Published Mon, Sep 23 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement