Svarnamukhi River
-
ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలి
స్వర్ణముఖి నదిలోమునిగిన విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఇసుకాసురుల ధన దాహానికి బాలుడు బలయ్యాడు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణముఖి నదిలో 20 అడుగులకు పైగా ఇసుకను తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నదిలో నీరు ప్రవహించింది. సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు వైష్ణవి నగర్‌కు చెందిన బాలుడు ఈత కోసమని వెళ్లి గుంతలో మునిగిపోయాడు. తిరుచానూరు : తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరం గ్రామం వినాయకనగర్‌కు చెందిన ఆర్ముగం, గుణవతీలకు ముగ్గురు సంతానం. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కొడుకు బాలాజీ(13) తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటర్వెల్ ఇవ్వడంతో మరో 8 మంది విద్యార్థులతో కలిసి ఈత కొట్టేందుకు స్వర్ణముఖి నదికి వెళ్లాడు. నది మధ్యలో పెద్ద గుంత ఉండడంతో మునిగిపోయాడు. విద్యార్థులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం కోసం గాలింపు గ్రామ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రూరల్ తహశీల్దార్ యుగంధర్, ఎంపీడీవో రవికుమార్‌నాయుడు, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, పంచాయతీ ఈవో ఎం.జనార్థన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శంకర్‌ప్రసాద్ తన బృందంతో కలిసి అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహం కోసం గాలించారు. మృతదేహం లభ్యంకాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మిన్నంటిన రోదనలు విద్యార్థి మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బాలాజీ తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికిచేరుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకైన బాలాజీ బాగా చదువుకుని పెద్దవాడై కష్టాల నుంచి కడతేరుస్తాడని నమ్ముకున్న ఆ కుటుంబానికి నదిలో కడతేరి విషాదం మిగిల్చాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుండడంతో కొందరు అక్రమార్కులు స్వర్ణముఖి నది నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లలు గుంతల్లో ఈతకొట్టేందుకు వెళ్లి మృతిచెందుతున్నారు. -
ఐదున్నర గంటలు అరచేతిలో ప్రాణాలు
స్వర్ణముఖినదిలో ఇద్దరి నరకయాతన కాపాడిన స్థానికులు, అధికారులు ఏర్పేడు: మండలంలోని గోవిందవరం వద్ద స్వర్ణవుుఖి నదిలో దాదాపు ఐదున్నర గంటలసేపు ఇద్దరు నరకయాతన అనుభవించారు. వుంగళవారం సాయుంత్రం 4-30 గంటలకు వారు నదిలో చిక్కుకోగా, రాత్రి 9-45 గంటలకు స్థాని కులు, అధికారులు కలిసి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు. తిరుపతికి చెందిన రవి(25) కందాడులో బంధువు అంత్యక్రియులకు వెళ్లేందుకు సాయంత్రం 4-30 గంటల ప్రాంతంలో గోవిందవరం వద్ద స్వర్ణవుుఖినదిపై ఉన్న కాజ్‌వేపైకి వచ్చాడు. కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అవతల వైపునకు వెళ్లడానికి దిగాడు. కొంతదూరం వెళ్లగానే కాలుజారడంతో నదిలోకి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న గోవిందవరం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్యు(50)కాపాడేందుకు నదిలోకి దిగాడు. నీటి ప్రవాహంలో ఇద్దరూ స్వర్ణవుుఖినదిలో సువూరు 50 మీటర్ల దూరం వరకు కొట్టుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న వుుళ్ల చెట్టు కొవ్మును పట్టుకున్నారు. ఈ విషయూన్ని స్థానికులు 6-30 గంటలకు తెలుసుకున్నారు. పోలీసులు, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యుకు ఫోన్ ద్వారా సవూచారం అందించారు. ఎస్ఐ రావుకృష్ణ, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యు రాత్రి 7-30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సవూచారం అందుకున్న తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్యు కూడా 8 గంటలకు అక్కడికి వెళ్లారు. రాత్రి కావడంతో పలు ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లను తీసుకుని వచ్చి లైట్లు వేరుుంచారు. తిరుపతి నుంచి రాత్రి 8-30 గంటలకు అగ్నివూపక యుంత్రాలు, గజ ఈతగాళ్లను రప్పించారు. అగ్నివూపక సిబ్బంది తాళ్లను స్వర్ణవుుఖి నదిలోకి వదిలారు. గజ ఈతగాడు తాడు ద్వారా నదిలో ఆ ప్రాంతానికి చేరుకుని ఒక్కొక్కరిని సురక్షితంగా 9-45 గంటలకు ఒడ్డుకు చేర్చాడు. సువూరు ఐదున్నర గంటల సేపు ఆ ఇద్దరు నీటిలో నరకవేతన అనుభవించారు. ఒడ్డుకు చేరుకున్న తరువాత వారు చలికి వణికిపోయూరు. -
ఇసుకాసురులు
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఇసుక రవాణా యథేచ్ఛగా సా గుతోంది. జిల్లాలోని నగరాలు, పట్టణాలేగాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో భవన నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పైగా అక్రమ రవాణాను అరికట్టే అధికారులు కొందరు సమైక్య ఉద్యమంలో ఉండడం దొంగలకు లాభిస్తోంది. అవినీతికి అలవాటుపడిన కొందరు అధికారులు ఇసుక దొంగలకు సహకరిస్తుండడంతో నదులు, పొలాలు అన్న తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. ఆదివారం జిల్లా సరిహద్దు ప్రాంతంలో 200కు పైగా ఇసుక లారీలు పట్టుబడడమే దీనికి నిదర్శనం. జిల్లాలో ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు వంకలు, వాగులు, నదీతీర ప్రాంతాల్లోని సాగు భూము ల్లో ఉన్న ఇసుకును ఇష్టానుసారం తవ్వి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఇసుక దాదాపు కనుమరుగైంది. సాగు భూములనూ వదలని వైనం స్వర్ణం కరిగిపోవడంతో నదీతీర ప్రాంతాల్లోని సాగు భూములపై కన్నుపడింది. అనుకున్నదే తడవుగా ఇసుకాసురులు భూముల యజమానులను కలసి రూ.లక్షలు ఆశచూపి బంగారం లాంటి భూములను ఎందుకూ పనికిరాకుండా మార్చేస్తున్నారు. చంద్రగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు సాగు భూములన్నీ బోరుమంటున్నా యి. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న వందలాది ఎకరాల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నారు. రేణిగుంట, గాజులమండ్యం, పాపానాయుడుపేట, గోవిందవరం, వికృతమాల, కొత్తవీరాపురం, తొండమనాడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లోని సాగు భూములన్నీ ఇసుకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నా యి. స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లోని ప్రభు త్వ భూముల్లోనూ ఇసుకను తోడేస్తున్నారు. పాపానాయుడుపేట-పెన్నగడ్డం మార్గంలో స్వ ర్ణముఖి నది ఒడ్డున ఉన్న భూములను కొంతమంది రైతులు లీజుకు తీసుకుని అందులోని ఇసుకును అమ్మి సొమ్ము చేసుకుంటున్నా రు. ప్రశ్నించిన వారికికొంత ముట్టజెపుతున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక రవాణా ఇసుక అక్రమ రవాణా కొందరు అధికారులకు, స్థానికులకు కాసులు కురిపిస్తోంది. ఇసుక ట్రాక్టర్ లేదా లారీ కనిపిస్తే పోలీసు, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులకు పండగే. వాహనాన్ని బట్టి రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఇసుకాసురుల నుంచి వచ్చే మామూళ్లే అధికంగా ఉన్నాయని ఓ అధికారి బహిరంగంగానే చెబుతున్నాడు.