స్వర్ణముఖినదిలో ఇద్దరి నరకయాతన
కాపాడిన స్థానికులు, అధికారులు
ఏర్పేడు: మండలంలోని గోవిందవరం వద్ద స్వర్ణవుుఖి నదిలో దాదాపు ఐదున్నర గంటలసేపు ఇద్దరు నరకయాతన అనుభవించారు. వుంగళవారం సాయుంత్రం 4-30 గంటలకు వారు నదిలో చిక్కుకోగా, రాత్రి 9-45 గంటలకు స్థాని కులు, అధికారులు కలిసి ఎట్టకేలకు సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు. తిరుపతికి చెందిన రవి(25) కందాడులో బంధువు అంత్యక్రియులకు వెళ్లేందుకు సాయంత్రం 4-30 గంటల ప్రాంతంలో గోవిందవరం వద్ద స్వర్ణవుుఖినదిపై ఉన్న కాజ్‌వేపైకి వచ్చాడు. కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అవతల వైపునకు వెళ్లడానికి దిగాడు. కొంతదూరం వెళ్లగానే కాలుజారడంతో నదిలోకి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న గోవిందవరం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్యు(50)కాపాడేందుకు నదిలోకి దిగాడు. నీటి ప్రవాహంలో ఇద్దరూ స్వర్ణవుుఖినదిలో సువూరు 50 మీటర్ల దూరం వరకు కొట్టుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న వుుళ్ల చెట్టు కొవ్మును పట్టుకున్నారు. ఈ విషయూన్ని స్థానికులు 6-30 గంటలకు తెలుసుకున్నారు.
పోలీసులు, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యుకు ఫోన్ ద్వారా సవూచారం అందించారు. ఎస్‌ఐ రావుకృష్ణ, తహశీల్దార్ లక్ష్మీనరసయ్యు రాత్రి 7-30 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సవూచారం అందుకున్న తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్యు కూడా 8 గంటలకు అక్కడికి వెళ్లారు. రాత్రి కావడంతో పలు ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లను తీసుకుని వచ్చి లైట్లు వేరుుంచారు. తిరుపతి నుంచి రాత్రి 8-30 గంటలకు అగ్నివూపక యుంత్రాలు, గజ ఈతగాళ్లను రప్పించారు. అగ్నివూపక సిబ్బంది తాళ్లను స్వర్ణవుుఖి నదిలోకి వదిలారు. గజ ఈతగాడు తాడు ద్వారా నదిలో ఆ ప్రాంతానికి చేరుకుని ఒక్కొక్కరిని సురక్షితంగా 9-45 గంటలకు ఒడ్డుకు చేర్చాడు.
సువూరు ఐదున్నర గంటల సేపు ఆ ఇద్దరు నీటిలో నరకవేతన అనుభవించారు. ఒడ్డుకు చేరుకున్న తరువాత వారు చలికి వణికిపోయూరు.
ఐదున్నర గంటలు అరచేతిలో ప్రాణాలు
Published Wed, Dec 2 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement